తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  డిసెంబర్ 5 : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి

డిసెంబర్ 5 : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి

HT Telugu Desk HT Telugu

05 December 2023, 4:05 IST

    • Today Horoscope Telugu : ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 05.12.2023 మంగళవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 5. 12.2023, వారం: మంగళవారం, తిథి : అష్టమి నక్షత్రం : పుబ్బ, మాసం : కార్తీకం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

లేటెస్ట్ ఫోటోలు

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మే 19 నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు.. ఉద్యోగంలో ప్రమోషన్​- ధన లాభం!

May 14, 2024, 09:35 AM

మే 14, రేపటి రాశి ఫలాలు.. రేపు శత్రువుల నుంచి వీరికి ఆర్థిక లాభాలు

May 13, 2024, 08:09 PM

Rahu transit: రాహు గ్రహ అనుగ్రహం.. 2025 వరకు ఈ రాశుల వారికి దేనికి ఢోకా లేదు

May 13, 2024, 06:27 PM

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు కళత్రంలో శుక్రుని ప్రభావం అలాగే చంద్రుని ప్రభావం వలన కుటుంబ సౌఖ్యం కలుగును. భాగ్యములో బుధుని ప్రభావం వలన మేషరాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకూల ఫలితాలున్నాయి. శని లాభస్థానములో సంచరించుట వలన మీరు చేసే పనులు కలసివచ్చును. ఆరోగ్య మరియు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా సత్ఫలితాలనిచ్చును. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. చంద్రుని అనుకూల ప్రభావం, లాభస్థానములో రాహువు, అలాగే దశమంలో శని అనుకూలమైనటువంటి ప్రభావంచేత వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా సత్ఫ ఫలితాలనిచ్చును. సినీరంగం, రైతాంగాల వారు శుభవార్తలు వింటారు. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం, ఆనందము కలుగును. ఉద్యోగస్తులు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు చంద్రుని ప్రభావం వలన అలాగే గోచారం వ్యవహరిస్తున్నటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావం వలన మధ్యస్థ ఫలితాలున్నాయి. పంచమంలో శుక్రుడు, లాభములో గురుడు అనుకూలంగా ఉండటంచేత మీరు చేసే పనుల్లో ఒత్తిళ్ళు అధికముగా ఉన్నప్పటికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికము. వ్యాపారస్తులకు ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవచ్చు. స్త్రీలకు మధ్యస్థం నుండి అనుకూలం. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఎనిమిదవ ఇంట శని, అష్టమశని ప్రభావం చేత అనుకోని చికాకులు, ఆరోగ్య సమస్యలు వేధించును. కుటుంబ విషయాల్లో చర్చలకు దూరంగా ఉండాలి. వృత్తి వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రతీ విషయంలో ఇబ్బందులు వేధించును. ఆరోగ్యం సహకరించదు. చంద్రుని ప్రభావం వలన ధైర్యంగా వ్యవహరించాలి. మరింత శుభ ఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు తృతీయంలో శుక్రుని ప్రభావం వలన భ్రాతృ వర్గీయులతో కొంత అనుకూలించును. మాతృస్థానములో రవి, కుజులు అనుకూలంగా ఉండటం వలన చేసే పనులు సత్ఫలితాలిస్తాయి. పంచమంలో బుధుని అనుకూలత వలన వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంటుంది. కళత్రస్థానములో శని, భాగ్యస్థానములో గురుని అనుకూలత వలన కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాలు అనుకూలించును. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కలసివచ్చును. అష్టమస్థానములో రాహువు, వాక్‌స్థానములో కేతువు ప్రభావం చేత గొడవలు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూల సమయం. చంద్రుని అనుకూల ప్రభావం, ధనస్థానములో శుక్రుని అనుకూలత వలన, అలాగే శని ఆరోస్థానములో అనుకూలత వలన వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా సత్ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు ధనలాభము. కుటుంబ సౌఖ్యము, ధనం సర్దుబాటు అవుతుంది. అష్టమ గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రణాళికాబద్ధంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. శని అనుకూలంగా, గురుడు కళత్రంలో అనుకూలంగా ఉన్నప్పటికి, చంద్రుని ప్రభావం వాక్‌ స్థానములో ఉన్నటువంటి రవి, కుజుల ప్రభావంచేత కొంత ఆవేశపూరిత నిర్ణయాలు, గొడవలకు దూరంగా ఉండాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా పని ఒత్తిళ్ళు అధికమగును. అయినప్పటికి మీయొక్క నైపుణ్యంతో ఒత్తిళ్ళను అధిగమిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. చంద్రుని ప్రభావం, అలాగే జన్మరాశిలో రవి, కుజుల ప్రభావం వలన ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. మానసిక వేదనలు, ఇబ్బందులు కలుగును. మీరు చేసే పనుల్లో చికాకు, బద్ధకం, అలసట కలుగును. వ్యయస్థానములో శుక్రుని ప్రభావం వలన ఖర్చులు, కుటుంబ సమస్యలు వేధించును. అర్జాష్టమ శని అలాగే శతృ స్థానములో గురుడు, జన్మరాశిలో రవి ప్రభావంచేత గొడవలకు దూరంగా ఉండాలి. ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు చంద్రుని ప్రభావం చేత అలాగే గురుడు పంచమంలో అనుకూలంగా ఉండడం, శని తృతీయంలో అనుకూలంగా ఉండటంచేత వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. జన్మరాశిలో బుధుని ప్రభావంచేత ఒత్తిళ్ళు ఇబ్బందిపెట్టును. బుధుని యొక్క అనుకూలత వలన వ్యాపారస్తులకు కలసివచ్చును. వ్యయస్థానములో రవి, బుధుల ప్రభావం చేత ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

మకర రాశి

మకర రాశివారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఏలినాటి శని అంత్య భాగములో ఉన్నప్పటికి రాహు గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే లాభములో రవి, కుజుల అనుకూల స్థితి వలన ఆరోగ్యపరంగా అనుకూలించును. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభదాయకం. ఖర్చులు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. రైతాంగం, రాజకీయ రంగాల వారికి కొంత సత్ఫలితాలనిచ్చును. సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. జన్మ శని, ఏలినాటి శని వలన పని ఒత్తిళ్ళు అధికముగా ఉన్నప్పటికి లాభములో ఉన్న బుధుడు, దశమంలో రవి, కుజుల యొక్క ప్రభావం వలన మీరు చేసే ప్రతీ పని కలసివచ్చును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. విద్యార్థులకు, స్త్రీలకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మరింత శుభ ఫలితాలు పొందాలంటే విఘ్నేః నరుని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. చంద్రుని ప్రభావంచేత, అష్టమశుక్రుని ప్రభావంచేత ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు జన్మరాహువు, ఏలినాటి శని, అష్టమ శుక్రుని ప్రభావంచేత ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు ఇబ్బందిపెట్టును. వ్యాపారస్తులకు అప్పులు చేయవలసిన పరిస్థితి. సినీరంగం, రైతాంగం వారికి అంత అనుకూలంగా లేదు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. స్త్రీలు, కుటుంబ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

 

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
తదుపరి వ్యాసం