తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నవంబర్ 26 : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు అప్పులు తీసుకోవడం అస్సలు మంచిది కాదు

నవంబర్ 26 : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు అప్పులు తీసుకోవడం అస్సలు మంచిది కాదు

HT Telugu Desk HT Telugu

26 November 2023, 4:05 IST

    • Today Horoscope In Telugu : ఈరోజు రాశి ఫలాలు తేదీ 26 నవంబరు 2023 ఆదివారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు నేటి దినఫలాలు ఇక్కడ తెలుసుకోండి
ఈరోజు రాశి ఫలాలు
ఈరోజు రాశి ఫలాలు (unsplash)

ఈరోజు రాశి ఫలాలు

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 26.11.2023, వారం: ఆదివారం, తిథి : చతుర్దశి, నక్షత్రం : భరణి, మాసం : కార్తీకం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

లేటెస్ట్ ఫోటోలు

Budhaditya raja yogam: బుధాదిత్య రాజయోగం.. వీరికి పెళ్లి కుదురుతుంది, ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది

May 20, 2024, 05:54 PM

భద్ర మహాపురుష రాజ యోగంతో ఈ రాశుల జాతకులకు కొత్త అవకాశాలు, శుభ ఘడియలు

May 20, 2024, 05:31 PM

30 ఏళ్ల తరువాత అదృష్ట రాజయోగం.. ఈ 3 రాశులకు శుభ ఘడియలు

May 20, 2024, 11:30 AM

Gajalakshmi Yogam : గజలక్ష్మీ యోగం.. వీరికి అప్పులు తీరుతాయి.. వ్యాపారంలో లాభాలు!

May 20, 2024, 07:58 AM

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉన్నతవర్గంలోని వారికి మీరు ఆప్తులయ్యే సూచనలున్నాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. వివాదాలకు పోకుండా సమస్యలకు పరిష్కార మార్గాలను కొనుగొంటారు. క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కోర్టు తీర్పులు అనుకూలమైన మలుపు తిరుగుతాయి. బుణాలు తీరుస్తారు. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. ఆర్థికపరమైన అంశాలు బాగుంటాయి. భూమి, గృహం కొనుగోలుకు ఏర్పడిన అవరోధాలు తొలగిపోతాయి. చిరు ఉద్యోగులకు ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆరోగ్యపరంగా స్వల్పమైన నలత ఉన్నప్పటికి అధిగమిస్తారు. మాటతీరులో స్వల్పమైన మార్పులు చేసుకుంటే మరిన్ని లాభాలు అందుకుంటారని సూచిస్తున్నాను. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది. వృషభ రాశి వారు ఈరోజు క్రిష్టాష్టకం పఠించడం వల్ల వృషభరాశి వారికి మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. కష్టపడి నష్టపోవలసిన పరిస్థితి నుంచి బయటపడతారు. ఎవరి మీదా ఆధారపడకుండా మీ పని మీరే స్వయంగా నిర్వహించుకోవడం మంచిది. బౌన్స్‌ అయిన చెక్కులను అందుకోవడం లేక మీరిచ్చిన చెక్కులు సాంకేతికపరమైన లోపాలకు గురి కావటం చెప్పదగిన సూచన. విద్యాసంబంధమైన వ్యవహారాలు నిదానంగా సాగినప్పటికి పురోగమనంలో ఉంటాయి. మిథునరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. శుభకార్య చర్చలు పురోగమనంలో ఉంటాయి. నూతనమైన ఎగ్రిమెంట్లు, పంచాయితీలు, రాయబారాలు, మధ్యవర్తిత్వాలు వంటి వ్యవహారాలలో కాలం హడావుడిగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలు వాయిదా పడుతుంది. కీలకమైన, ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. అరుణం పఠించడం లేదా వినడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. నూతన ఉద్యోగ యత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు నామమాత్రంగా ఫలిస్తాయి. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. అంతర్లీనమైన వేదాంత ధోరణి కనబరుస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. సరికొత్త ప్రణాళికలు అమలు చేయాలని నిర్ణయించుకుంటారు. సింహరాశివారికి మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. దూరప్రాంత ప్రయాణ సూచనలున్నాయి. ఉన్నత ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ముక్కుసూటితనంగా వ్యవహరిస్తారు. లౌక్యం లోపిస్తుంది. ఇందువల్ల నష్టం ఏర్పడకపోయినా సమాజంలో మీపై కొంత దుష్ప్రచారం జరిగేందుకు ఆస్కార ఉంది. అదృష్టాన్ని కంటే కృషిని నమ్ముకుంటారు. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూలపడతాయి. సంఘంలో గౌరవం, పరపతి బాగా పెంపొందుతాయి. మీ పరోక్షంలో జరుగుతున్న ఒడిదుడుకులను గమనించి చర్యలను సమర్థవంతంగా చేపడతారు. మీ మాటలకు వక్రభాషాలు చెప్పేవారు అధికమవుతారు. సహోదర, సహోదరీ వర్గానికి సహాయ సహకారాలను అదించవలస వస్తుంది. సంగీత, సాహిత్య, లలితా కళా రంగాల్లోని వారికి అనుకూలం. తులారాశివారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. శుభకార్య వ్యవహారాలు సానుకూలపడతాయి. అర్థంలేని వివాదాలు చోటు చేసుకుంటాయి. ఒక సమస్య తీరితే మరో సమస్యలను పరిష్కరించాల్సి వస్తుంది. ఒత్తిడికి లోనవుతారు. ప్రత్యర్థి వర్గం బలపడుతున్నట్లుగా భావిస్తారు. వారిని ఎదుర్కోవడానికి కావలసిన వ్యూహాలను అవలంభిస్తారు. రుణాలు మంజూరవుతాయి. మీరు ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగా గానీ ఉపకరించే ఒక లేఖ చేరాల్సిన చోటుకు చేరుతుంది. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం, నవగ్రహా ఆలయాల్లో పూజలు వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తారు. రాజకీయ రంగంలోని వారితో పరిచయాలు ఏర్పడతాయి. సాఫ్ట్‌వేర్‌ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరంభ శూరత్వాన్ని కలిగి ఉంటారు. ఎక్కువగా ఊహాలోకాల్లో విహరిస్తారు. గృహంలో వ్యాపార కేంద్రంలో అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయడం మంచిది. స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది. క్షీరాన్నాన్ని ఆలయాల్లో ప్రసాదంగా పంచడం మంచిది.

మకర రాశి

మకర రాశివారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆదాయ, వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. మీపై వచ్చిన కొన్ని అపనిందలను రూపుమాపుకోగలుగుతారు. మీ ఆలోచనలలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉన్నత విద్యా, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. రచనా రంగంలోని వారికి, బ్యాంకింక్‌ రంగంలోనివారికి, ఫైనాన్స్‌ వ్యాపారస్తులకు అనుకూలం. మీ పరపతి పెరుగుతుంది. ఆహ్లాదభరితమైన వాతావరణంలో కాలాన్ని గడుపుతారు. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహశాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు సానుకూల ఫలితాలుంటాయి. గతంలో ఆగిపోయిన వ్యవహారాలను తిరిగి ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. అలంకరణకు ప్రాముఖ్యత నిస్తారు. కళా, సాహిత్య రంగాల్లోని వారికి అనుకూలం. దూర ప్రాంత ప్రయాణాలు సానుకూల పడతాయి. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నువ్వులతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచి పెట్టండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన మార్పులుండవు. సినీ, కళారంగాలలోని వారికి సామాన్య ఫలితాలుంటాయి. నూతన అగ్రిమెంట్లు, ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా మెలగాలి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు గోచరిస్తున్నాయి. కలిగిన దానిలో సర్దుబాటు చేసుకోవడం మంచిది. రుణాలు చేయడం ఏ మాత్రం మంచిది కాదు. గోప్యతకు ప్రాధాన్యమిస్తారు. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగును.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
తదుపరి వ్యాసం