తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  డిసెంబర్ 10 : నేటి రాశి ఫలాలు.. వీరు వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు

డిసెంబర్ 10 : నేటి రాశి ఫలాలు.. వీరు వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు

HT Telugu Desk HT Telugu

10 December 2023, 6:47 IST

    • Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 10.12.2023 ఆదివారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల జాతక ఫలాలను ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 10.12.2023, వారం: ఆదివారం, తిథి : త్రయోదశి, నక్షత్రం : స్వాతి, మాసం : కార్తీకం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

లేటెస్ట్ ఫోటోలు

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మే 19 నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు.. ఉద్యోగంలో ప్రమోషన్​- ధన లాభం!

May 14, 2024, 09:35 AM

మేషరాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వరా లాభాలుంటాయి. విదేశీయాన ప్రయత్నాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభ యోగముంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభరాశివారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగియుంటారు. శుభవార్తలు వింటారు. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది. వృషభరాశివారు ఈరోజు క్రిష్టాష్టకం పఠించడం వల్ల వృషభరాశి వారికి మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథునరాశివారికి ఈ రోజు మీకు అనుకూలముగా ఉన్నది. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. బుణ విముక్తి లభిస్తుంది. మానసికానందం పొందుతారు. గతంలో వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు ఆనందకరముగా ఉంటాయి. మిథునరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగరంగాల్లో సహనం వహించక తప్పదు. బంధుమిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించలి. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు, మానసికాందోళన తప్పదు. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. ఆకస్నిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. అరుణం పఠించడం లేదా వినడం మంచిది.

సింహరాశి

సింహరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో బుణ బాధలు తొలగిపోతాయి. సింహరాశివారికి మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.

కన్యా రాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబములో సుఖ సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యములు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. పిల్లలతో జాగ్రత్త వహించుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్య గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. ఆకస్మిక ధనలాభాలుంటాయి. శుభవార్తలు వింటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగియుంటారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృ బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. తులారాశివారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. బంధు మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. అనారోగ్య అధికమవుతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చగును. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబములో మనశ్శాంతి లోపిస్తుంది. బుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం, నవగ్రహా ఆలయాల్లో పూజలు వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. అనుకోకుండా ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. కుటుంబముతో సంతోషంగా ఉంటారు. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్ట్రకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది. క్షీరాన్నాన్ని ఆలయాల్లో ప్రసాదంగా పంచడం మంచిది.

మకర రాశి

మకర రాశివారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయ. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా నుండుట మంచిది. బుణబాధలు తొలగును. పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. ఆరోగ్యం అనుకూలించును. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ప్రేమూలకంగా లాభం ఉంది. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహశాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు మిత్రులతో కలసి ఆనందముగా గడుపుతారు. గొప్ప వ్యక్తిని కలుస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా నుండుట మంచిది. అనారోగ్య బాధలుండవు. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నువ్వులతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచి పెట్టండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా ఉన్నది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్చడు అవకాశముంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. బుణబాధలు తొలగుతాయి. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసింకాదోళన తప్పదు. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగును.

తదుపరి వ్యాసం