తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  డిసెంబర్ 4 : నేటి రాశి ఫలాలు.. పని ప్రారంభించాక నిర్ణయాలను మార్చవద్దు

డిసెంబర్ 4 : నేటి రాశి ఫలాలు.. పని ప్రారంభించాక నిర్ణయాలను మార్చవద్దు

HT Telugu Desk HT Telugu

04 December 2023, 4:05 IST

    • Today Horoscope : ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 04.12.2023 సోమవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
undefined
undefined

undefined

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 04.12.2023, వారం: సోమవారం, తిథి : సప్తమి నక్షత్రం : మఖ, మాసం : కార్తీకం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

లేటెస్ట్ ఫోటోలు

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. పనుల్ని సకాలంలో స్వయంగా చేసుకుంటే త్వరగా విజయం లభిస్తుంది. ఉద్యోగంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కాలం వృథా చేయవద్దు. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఆలోచించి ఖర్చు చేయండి. ముఖ్యకార్యాలలో జాగ్రత్తగా ఉందాలి. మేష రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు మరియు ధనమును పొందెదరు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తోటివారికి కలుపుకుపోవాలి. ఆత్మీయుల సూచనలు అవసరమవుతాయి. చెడు ఏమాత్రం ఊహించవద్దు. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. అదృష్టం వరిస్తుంది. అధికారయోగ సూచన. ఒక ఆపద నుంచి తృటిలో బయటపడతారు. ఇంటా బయటా మీదే పైచేయి. భూ గృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి. అన్నింటా సానుకూల ఫలితాలున్నాయి. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. మిథునరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధ వహించాలి. ఏ విషయాన్నీ మనసుకు తీసుకోవద్దు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొన్ని విషయాల్లో మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది. పని ప్రారంభించాక నిర్ణయాలను మార్చవద్దు. శుభవార్త వింటారు. కర్కాటక రాశి వారికి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన మరియు పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు వ్యాపారపరంగా అద్భుత ఫలితాలున్నాయి. బుధగ్రహ బలం వల్ల ఆశించిన లాభాలుంటాయి. అవకాశాలు కలసివస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో అంచలంచెలుగా పైకి వస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కలహాలకు దూరంగా ఉండాలి. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం మేలు. శుభవార్త వింటారు. ఉన్నత స్థితి గోచరిస్తుంది. ఉద్యోగపరంగా బాగుంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలు లాభాన్నిస్తాయి. కన్యారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు వ్యాపారయోగం బ్రహ్మాండంగా ఉన్నది. ఇపుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. తోటివారితో ఉన్న సమస్యలు తొలగుతాయి. ఆత్మవిశ్వాసం తగ్గనివ్వద్దు. ఆశయం నెరవేరుతుంది. ఎప్పటికప్పుడు నూతన విషయాలు తెలుసుకుంటారు. మీ సామర్థ్యం నలుగురికీ తెలుస్తుంది. తులారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుణిడిని పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు ఆర్థికంగా కలసివస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. పనులు వాయిదా వేయవద్దు. మానసిక ధడత్వం అవసరం. వివాదాలకు తావివ్వవద్దు. లక్ష్యంపైదృష్టి నిలపాలి. కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా అనిపిస్తుంది. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. వృశ్చికరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సకాలంలో పనులు ప్రారంభించాలి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు పొందుతారు. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. చెడు ఊహించవద్దు. అధైర్యపడవద్దు. సొంత నిర్ణయాల కన్నా మిత్రుల సలహాలు మేలుచేస్తాయి. శక్తికి మించిన ఖర్చులు వద్దు. వ్యాపారంలో నిర్లక్ష్యం పనికిరాదు. ధనూరాశివారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు ఉద్యోగంలో శుభఫలితాలున్నాయి. ఎదురుచూస్తున్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసంలో నిర్ణయాలు తీసుకోండి. పనుల్ని మధ్యలో ఆపవద్దు. లక్ష్యం చేరువలోనే ఉంది. వ్యాపారంలో కృషి ఫలిస్తుంది. శుభవార్త వింటారు. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు ఉద్యోగపరంగా అనుకూల సమయం. అధికార లాభం సూచన. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యవిషయాల్లో ఇతరులపైన ఆధారపడవద్దు. స్వయంకృషితో సత్ఫలితాలు సాధించండి. కొందరు కావాలని అడ్డుపడతారు. వ్యర్థ ప్రసంగాల జోలికి వెళ్ళవద్దు. ధర్మ దేవతానుగ్రహం కాపాడుతుంది. కుంభరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. కాలం వ్యతిరేకంగా ఉన్నది. ప్రతి అడుగూ ఆచితూచి వేయాలి. ధైర్యాన్ని కోల్పోవద్దు. తోటివారి సహకారం తప్పనిసరి. లక్ష్యంపై దృష్టి నిలపంది. పనుల్లో జాప్యం పనికిరాదు. ఆవేశం వద్దు. ఒక మెట్టు దిగైనా సరే కార్యసిద్ధిని సాధించాలి. విజయం లభిస్తుంది. ముఖ్యకార్యాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
తదుపరి వ్యాసం