తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  డిసెంబర్ 11 : నేటి రాశి ఫలాలు.. మీరు ఇతరులను అతిగా నమ్మకండి

డిసెంబర్ 11 : నేటి రాశి ఫలాలు.. మీరు ఇతరులను అతిగా నమ్మకండి

HT Telugu Desk HT Telugu

11 December 2023, 4:05 IST

    • Today Horoscope Telugu : ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 11.12.2023 సోమవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల జాతక ఫలాలను ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు (Unsplash)

నేటి రాశి ఫలాలు

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 11.12.2023, వారం: సోమవారం, తిథి : చతుర్దశి నక్షత్రం : విశాఖ, మాసం : కార్తీకం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

లేటెస్ట్ ఫోటోలు

Budhaditya raja yogam: బుధాదిత్య రాజయోగం.. వీరికి పెళ్లి కుదురుతుంది, ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది

May 20, 2024, 05:54 PM

భద్ర మహాపురుష రాజ యోగంతో ఈ రాశుల జాతకులకు కొత్త అవకాశాలు, శుభ ఘడియలు

May 20, 2024, 05:31 PM

30 ఏళ్ల తరువాత అదృష్ట రాజయోగం.. ఈ 3 రాశులకు శుభ ఘడియలు

May 20, 2024, 11:30 AM

Gajalakshmi Yogam : గజలక్ష్మీ యోగం.. వీరికి అప్పులు తీరుతాయి.. వ్యాపారంలో లాభాలు!

May 20, 2024, 07:58 AM

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతగా వ్యవహరిస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కుటుంబపరంగా మధ్యస్థముగా ఉండును. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు సాధారణంగా ఉండును. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. వ్యాపారస్తులకు ఇబ్బందులతో కూడిన సమయం. మేషరాశివారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు, ధనమును పొందెదరు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. శారీరక శ్రమ, అలసట ఏర్పడును. శక్తికి మించిన పనులను చేపట్టి పూర్తి చేసుకుంటారు. అధిక ఖర్చులు ఇబ్బంది పెట్టును. ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి విజయాలబాట పట్టగలరు. మనస్సును నచ్చిన పనులు చేసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మి కతలకు ప్రాధాన్యతనిస్తారు. బంధుమిత్రుల తాకిడులుంటాయి. కాలంతో పరిగెట్టే ప్రయత్నాలుంటాయి. పని ఒత్తిడులుంటాయి. వ్యక్తిగతంగా ఎదుగుటకు ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు చేరడానికి ప్రయత్నిస్తారు. మిథునరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాలనుండి దూరముగా ఉండే ప్రయత్నాలు చేసుకుంటారు. కుటుంబములో ఆధిపత్య ధోరణికి దూరముగా ఉండండి. వద్దనుకున్నా కొన్ని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. సంతానపరంగా జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశివారికి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన మరియు పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొన్ని పనులను పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆచార వ్యవహారములకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. స్వంత ఆలోచనలతో ముందుకు సాగుతారు. సమయ సద్వినియోగాల కోసం తాపత్రయపడతారు. వ్యాపార వ్యవహారములలో మీ తెలివితేటలు ప్రదర్శిస్తారు. సర్దుబాటులు వుంటున్నా కొన్ని చెల్లింపుల్ని వాయిదా వేసుకుంటారు. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. సుఖసౌఖ్యాలకు ప్రాధాన్యతనిస్తారు. కోరుకున్న వ్యక్తులతో వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. వ్యక్తిగతమైన టార్గెట్స్‌ పట్ల మక్కువ చూపుతారు. క్రమంగా ఇబ్బందులను అధిగమిస్తారు. కన్యారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. సమయమును వృథా చేయకుండా వ్యాపాకాలు ఏర్పరచుకోవాలి. ప్రతికూలతలను పట్టించుకోకుండా ప్రయత్నాలు చేయాలి. ఇతరుల సహకారము కోరకుండా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మీయొక్క తెలివితేటలతో విజయం సాధిస్తారు. తులారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. జాగ్రత్తలు అవసరం. శతృ వృద్ధి ఉంటుంది. వాహన, యంత్రాదులతో జాగ్రత్తలు అవసరం. కృషి కోసం ప్రయత్నించాలి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. బుణ ఒత్తిడులు ఉండకుండా జాగ్రత్తలు అవసరం. కుటుంబములో నిశ్శబ్దత ఉంటుంది. వృశ్చికరాశి వారికి మరింత శు భఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. సమయ సందర్భాలను పాటించాలి. కాలాతీత నిర్ణయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు టార్గెట్‌ బాటనే సాగాలి. ఇతరుల ఉత్సాహాల్లో పాల్గొనవలసి ఉంటుంది. ఆప్యాయతల కోసం ఎదురుచూదక కర్తవ్యాలకే ప్రాధాన్యత ఇవ్వండి. ధనూరాశివారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు వస్తుంది. ఖర్చులు ప్రయోజకరంగా ఉంటాయి. ఆదాయాల్లో వృద్ధి ఉంటుంది. ప్రయత్నాలకు తగిన ప్రయోజనాలు అందుతాయి. కుటుంబముతో విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండండి. మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నా వారికి అవి మంచిచేస్తాయి. ఆదర్శప్రాయంగా వ్యవహరించుకోవాలి. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. అనవసర కాలయాపనలుంటాయి. ఇతరులను అతిగా నమ్మకండి. ఖర్చులు ఉంటున్నా సంతృప్తి ఉంటుంది. పాత వ్యవహారాల్ని చేపట్టుకోండి. సంతానంతో ముఖ్య విషయాల్లో విభేదించవలసి వస్తుంది. ప్రయత్నంలో మీ బాటను అవలంభించగలరు. ఆత్మన్యూనతా భావనలకు దూరంగా ఉంటూ ప్రణాళికాబద్ధంగా సాగాలి. కుంభరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆర్థిక అవసరాలకు ముందు జాగ్రత్తలు అవసరం. వృథా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. జీవనోపాధి యత్నాలు సహకరించగలవు. ఆహార విరామాదులకు కాల నియమాలు పాటించండి. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
తదుపరి వ్యాసం