తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జనవరి 1 : నేటి రాశి ఫలాలు.. కొత్త సంవత్సరం రోజు మీ రాశి ఎలా ఉంది?

జనవరి 1 : నేటి రాశి ఫలాలు.. కొత్త సంవత్సరం రోజు మీ రాశి ఎలా ఉంది?

HT Telugu Desk HT Telugu

01 January 2024, 1:00 IST

    • Today January 1st Horoscope : నేటి రాశి ఫలాలు 01.01.2024 కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 01.01.2024, వారం: సోమవారం, తిథి : కృ. పంచమి, నక్షత్రం : మఖ, మాసం : మార్గశిరం,, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

లేటెస్ట్ ఫోటోలు

Budhaditya raja yogam: బుధాదిత్య రాజయోగం.. వీరికి పెళ్లి కుదురుతుంది, ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది

May 20, 2024, 05:54 PM

భద్ర మహాపురుష రాజ యోగంతో ఈ రాశుల జాతకులకు కొత్త అవకాశాలు, శుభ ఘడియలు

May 20, 2024, 05:31 PM

30 ఏళ్ల తరువాత అదృష్ట రాజయోగం.. ఈ 3 రాశులకు శుభ ఘడియలు

May 20, 2024, 11:30 AM

Gajalakshmi Yogam : గజలక్ష్మీ యోగం.. వీరికి అప్పులు తీరుతాయి.. వ్యాపారంలో లాభాలు!

May 20, 2024, 07:58 AM

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా ఉద్యోగంలో ప్రశంసలందుకుంటారు. ముఖ్య కార్యాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలంతో నిర్ణయాలు తీసుకోవాలి. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. ఆనందకరమైన జీవితం. మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. మేషరాశివారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు, ధనమును పొందెదరు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా సహనంతో లక్ష్యాన్ని పూర్తి చేయాలి. నిరుత్సాహపరిచేవారు ఉంటారు. ఎవరి మాటలూ మనసుకు తీసుకోవద్దు. లోతుగా ఆలోచించవద్దు. వ్యాపారంలో నష్టాలను నివారించాలి. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశివారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలున్నాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలుచేయండి. మేలు కలుగుతుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పోయినవి తిరిగి వస్తాయి. భూ గృహ వాహన యోగాలున్నాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందిస్తారు. మిథునరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది. ఉద్యోగపరంగా అనుకూలం. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి. శత్రువులు మిత్రులవుతారు. మనసులోని కోరిక నెరవేరుతుంది. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో లాభాలున్నాయి. కర్కాటక రాశివారికి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన, పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనేకమార్గాల్లో లాభపడతారు. ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం కలుగచేసుకోవద్దు. వ్యాపారంలో మేలు జరుగుతుంది. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు వ్యాపారపరంగా కలసివస్తుంది. ధన ధాన్యాభివృద్ధి ఉంటుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకుని అమలుచేయండి. అభీష్టం సిద్ధిస్తుంది. ఆపద నుంచి బయటపడతారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబసభ్యుల సలహా తీసుకోవాలి. పనుల్ని వాయిదా వేయవద్దు. కలహాలకు దూరంగా ఉండాలి. కన్యారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు ఉద్యోగపరంగా శుభఫలితాలున్నాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. అధికారయోగమున్నది. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి. దేనికీ వెనకడుగు వేయవద్దు. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. కొన్ని సమస్యలు తొలగుతాయి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఖర్చులు తగ్గించాలి. తులారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కలసివస్తుంది. ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఓర్పుతో వ్యవహరించండి. ఆపదలు తొలగుతాయి. పక్కనే ఉండి ఇబ్బంది కలిగించాలని చూసేవారున్నారు. శాంతంగా సంభాషించండి. వృశ్చికరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా కలసివస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. తగిన గుర్తింపు ప్రతిఫలమూ లభిస్తాయి. భవిష్యత్‌ ప్రణాళికలు కార్యరూపం దాల్బుతాయి. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడవద్దు. సొంత నిర్ణయాలలో లబ్ధి పొందుతారు. సకాలంలో పనిచేసి అభీష్టసిద్ధి పొందుతారు. ధనూరాశివారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. అపార్థాలకు అవకాశం ఇబ్బకుండా శాంతంగా సంభాషించాలి. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రశాంతంగా ఆలోచించి పరిష్కరించాలి. ముఖ్యకారర్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. లక్ష్యంపై దృష్టి నిలపాలి. మిత్రుల సూచనలు తోడ్పడతాయి. పనులు వాయిదా వేయవద్దు. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు ఉద్యోగపరంగా కలసివస్తుంది. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. అధికారయోగ సూచన. ఆర్థికంగా స్థిరమైన ఫలితాలుంటాయి. వ్యాపారంలో ధనయోగముంది. దశదిశలా విస్తరిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ బంగారు భవిష్యత్తును సాధించాలి. కుంభరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పేరు ప్రతిష్టలు పొందుతారు. మీ సత్ప్రవర్తన నలుగురికీ ఆదర్శమవుతుంది. సహాయ గుణంలో ముందుకు సాగండి. వ్యాపారంలో మధ్యస్థ ఫలితాలున్నాయి. ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలి. శుభవార్తలు వింటారు. మీనరాశి వారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

తదుపరి వ్యాసం