తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  డిసెంబర్ 1 : నేటి రాశి ఫలాలు.. రాజకీయాల్లో ఉన్న ఈ రాశివారిపై ఒత్తిడి

డిసెంబర్ 1 : నేటి రాశి ఫలాలు.. రాజకీయాల్లో ఉన్న ఈ రాశివారిపై ఒత్తిడి

HT Telugu Desk HT Telugu

01 December 2023, 6:18 IST

    • Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 01.12.2023 శుక్రవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 01.12.2023, వారం: శుక్రవారం, తిథి : చవితి, నక్షత్రం : పునర్వసు, మాసం : కార్తీకం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

లేటెస్ట్ ఫోటోలు

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మే 19 నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు.. ఉద్యోగంలో ప్రమోషన్​- ధన లాభం!

May 14, 2024, 09:35 AM

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా కలసివస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు మెరుగుపడతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల సమయం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీరుస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో విజయం. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశివారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాలు కొలిక్కివస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా ఉన్నది. వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురుకావచ్చు. విద్యార్థులు శ్రమపడినా ఆశించిన ఫలితం రాకపోవచ్చు. బంధువులు సలహాలు స్వీకరిస్తారు. కాంట్రాక్టర్లకు నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో మార్చులు జరిగే అవకాశం. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. ఆస్తివివాదాలు నెలకొంటాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్షి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న మేరు డబ్బు చేతికందుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. విద్య ఉద్యోగవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. పారిశ్రామిక వర్గాలకు కొత్త లైసెన్సులు లభిస్తాయి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలం. భూముల కొనుగోలు. విద్యార్థులు విద్యావకాశాలు దక్కుతాయి. కోర్టు వ్యవహారం ఒకటి అనుకూలిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు. బంధువిరోధాలు. అనారోగ్య సూచనలున్నాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం. స్థిరాస్తిపై వివాదాలు కొలిక్కివస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలో గతం నుంచి నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు, ధనవ్యయం. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆర్థిక వ్యవహారాలలో అటుపోట్లు ఎదురవుతాయి. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు నెమ్మదిస్తాయి. పనులు నిదానంగా కొనసాగుతాయి. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు అప్రయత్నంగా దక్కుతాయి. నిరుద్యోగులు ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలం. ఆర్థిక పరిస్థితులో మార్పు కనిపిస్తుంది. కొన్ని రుణాలు సైతం తీరే సమయం. ఆస్తుల వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరంచేస్తారు. వాహనాలు, విలువైన వస్తువలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. కొత్త పెట్టుబడులు సమీకరిస్తారు. ఉద్యోగాలు సమర్ధవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు సాగిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు రావలసిన బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగాలో ఉన్నత పదవులు దక్కవచ్చు. రాజకీయవర్లాల లక్ష్యాలు నెరవేరతాయి. అనారోగ్య సూచనలున్నాయి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
తదుపరి వ్యాసం