తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Transit: ఈ రాశుల వారికి సూర్యుడి సంచారంతో మంచి రోజులు మొదలు కాబోతున్నాయి

Sun transit: ఈ రాశుల వారికి సూర్యుడి సంచారంతో మంచి రోజులు మొదలు కాబోతున్నాయి

Gunti Soundarya HT Telugu

10 April 2024, 11:00 IST

    • Sun transit: మరో మూడు రోజుల్లో సూర్యుడు మీన రాశిని వీడి మేష రాశి ప్రవేశం చేస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి మంచి రోజులు మొదలు కాబోతున్నాయి. సూర్యుడి సంచారంతో ఏయే రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుందో తెలుసుకుందాం. 
మేష రాశిలో సూర్యుడి సంచారం
మేష రాశిలో సూర్యుడి సంచారం (pinterest )

మేష రాశిలో సూర్యుడి సంచారం

Sun transit: సూర్యుడు నెలకు ఒకసారి రాశి చక్రం మారుస్తూ ఉంటాడు. నవగ్రహాలలో సూర్యుడిని అన్ని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు శుభప్రదంగా ఉన్నప్పుడు వ్యక్తి అదృష్టం పెరుగుతుంది. ఏప్రిల్ 13న సూర్యుడు మీన రాశి నుంచి మేషరాశి లోకి ప్రవేశిస్తాడు. 

లేటెస్ట్ ఫోటోలు

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

సూర్యుడి మీన రాశిని వీడటం వల్ల ఖర్మ రోజులు కూడా ముగిసిపోతాయి. గ్రహాల రాజు మొత్తం పన్నెండు రాశులలో ధనుస్సు, మీన రాశిలో సంచరించినప్పుడు ఖర్మల కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు. నవగ్రహాలలో తిరోగమన దశలో ప్రయాణించని ఒకే ఒక గ్రహం సూర్యుడు. మేష రాశిలో సూర్యుడు ప్రవేశించిన వెంటనే దేవగురువు బృహస్పతితో సంయోగం చెందుతాడు. ఈ రెండు గ్రహాలు సుమారు పన్నెండు సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నాయి. 

సూర్యుడి రాశి చక్రం మారడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది. సూర్యుడి సంచారంతో ఏ ఏ రాశుల వారికి శుభదాయకం కాబోతుందో తెలుసుకుందాం

మేష రాశి 

సూర్యుడు రాశి మీన రాశిని విడిచి మేష రాశిలోకే ప్రవేశిస్తాడు. ఈ సంచారం మేష రాశి వారికి అద్భుతమైన విజయాన్ని చేకూరుస్తుంది. సంపద, సమృద్ధి పెరుగుదలతో ఆర్థిక శ్రేయస్సును పొందుతారు. భౌతిక సౌకర్యాలు అనుభవిస్తారు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. సహనం, పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడి భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. వ్యాపార రంగంలో విదేశీ ఒప్పందాలు చేసుకుంటారు. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఇబ్బందులు క్రమంగా సమసిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. లవ్ లైఫ్ రొమాన్స్ తో నిండిపోతుంది. 

మిథున రాశి 

సూర్యుడి సంచారం వల్ల మిథున రాశి జాతకులు శుభ ఫలితాలు పొందుతారు. నాయకత్వ సామర్థ్యం, అధికారం పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది. ఆత్మవిశ్వాసంతో సరైన మార్గంలో నడుస్తారు. కుటుంబం సంతోషంతో నిండిపోతుంది. ఆర్థిక పురోగతిని అనుభవిస్తారు.  సంఘంలో పేరు, ప్రఖ్యాతలు పొందుతారు. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. నిలిచిపోయిన డబ్బు కూడా చేతికి అందుతుంది. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం శుభప్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.

సింహ రాశి

సింహ రాశి వారికి సూర్యుడి సంచారం శుభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్ లో విజయం సాధిస్తారు. దృఢ సంకల్పంతో ఎన్నో విజయాలు సాధిస్తారు. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకునేందుకు కృషి చేస్తారు. ధన ప్రవాహానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ సమయం లావాదేవీలకు అనుకూలంగా ఉంటుంది.

కన్యా రాశి 

సూర్యుడి సంచార ప్రభావం కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. ఈ సమయంలో మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. కార్యాలయంలో గౌరవం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మీరు అద్భుతంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగం వ్యాపారంలో శుభవార్తలు వింటారు.  పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు నియంత్రించుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. 

 

తదుపరి వ్యాసం