తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Birthday Rituals: పుట్టిన రోజు జరుపుకోవాల్సిన అసలు సిసలు పద్ధతిదే!

birthday rituals: పుట్టిన రోజు జరుపుకోవాల్సిన అసలు సిసలు పద్ధతిదే!

11 May 2023, 7:17 IST

  • birthday rituals: పురాణాల ప్రకారం పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలో , ఆరోజు ఏం చేయకూడదో తెలుసుకుందాం.

పుట్టిన రోజు వేడుకలు
పుట్టిన రోజు వేడుకలు (pexels)

పుట్టిన రోజు వేడుకలు

మనం ఇప్పుడు జరుపుకుంటున్న పుట్టిన రోజు వేడుకలు మనం వేరే సాంప్రదాయం నుంచి తెచ్చిపెట్టుకున్నవే అని మనకే తెలుస్తుంది. కానీ నిజానికి పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలో తెలీక అదే పద్ధతి కొనసాగిస్తాం. ఆరోజు చేయాల్సిన పనులేంటో, చేయకూడని పనులేంటో చూద్దాం.

లేటెస్ట్ ఫోటోలు

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

తేదీ:

పుట్టిన రోజును ఆంగ్ల క్యాలెండర్ తేదీల ప్రకారం జరుపుకోవడం సరి కాదు. తిథిల ప్రకారం జరుపుకుంటేనే సరైన రోజు జరుపుకుంటున్నట్లు లెక్క. ఉదాహరణకు మీరు 1995 లో ఫిబ్రవరీ 15 రోజున, పౌర్ణమి రోజున పుట్టారనకుందాం. 1996 లో ఫిబ్రవరీ 15 న పౌర్ణమి వస్తుందా? ఖచ్చితంగా రాదు. పురాణాల ప్రకారం మనకు సంవత్సరమంటే భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి తీసుకునే కాలం. అంటే ఫిబ్రవరి 15 న భూమి ఏ బిందువు దగ్గర పరిభ్రమిస్తుందో, అదే బిందువు దగ్గరికి చేరుకుంటే సంవత్సరం పూర్తి. కానీ ఆంగ్ల తిథుల ప్రకారం అది జరగదు. తిథి ప్రకారం పుట్టిన రోజు చేసుకోవడం వల్ల మీకూ ప్రకృతికీ, ఈ సౌరవ్యవస్థకూ, గ్రహాలకూ మీకున్న సంబంధం ఏంటో అనుభూతి చెందుతారు. మీకు మీ పుట్టిన రోజు తిథి తెలియక పోతే.. మీరూ రోజూ వాడే గూగుల్ లో ఒకసారి మీ పుట్టిన తేదీ రోజున తెలుగు పంచాంగం చూడండి. అన్ని వివరాలు తెలుస్తాయి.

ఆరోజు ఏం చేయాలి?

తప్పకుండా సూర్యోదయం కన్నా ముందే నిద్రలేవాలి. అభ్యంగన స్నానం చేయాలి. అంటే ఒంటికి నూనె రాసుకుని తలంటు స్నానం చేయడం అన్నమాట. ఆ తరువాత అక్షింతలు చేతిలోకి ఇచ్చి, ఇంట్లో పెద్ద వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. మీకు దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లి రావాలి. పుట్టిన రోజు ఆయుష్షుకు సంబంధించింది. ఇది చిన్న సందర్భం కాదు. ప్రతి మనిషీ తన జీవితంలో తప్పకుండా చేసుకోవాల్సిన వేడుక ఇది. అందుకే ఆరోజు పురాణాల ప్రకారం చిరంజీవులుగా పిలవబడే ఏడుగురిని తలచుకోవాలి. దీనికోసం తప్పకుండా జపించాల్సిన మంత్రం ఒకటుంది.

అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః । కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥

అశ్వత్థాముడు, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు చిరంజీవులుగా ఉండే వరం పొందారు. వీరి పేర్లు తలచుకోవడం వల్ల దీర్ఘాయుష్షు పొందాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు.

వేడుకలు:

మీ పుట్టిన రోజున మీకు తోచినంత, మా తాహతుకు తగ్గట్లు దానధర్మాలు చేయాలి. కుటుంబ సభ్యులందరితో కలిసి చక్కని భోజనం చేయండి. మద్యపానం జోలికి పోకూడదు. మీకు ఎన్ని సంవత్సరాలో అన్ని దీపాలు వెలిగించి దీపదానం ఇచ్చుకోవచ్చు. లేదా దేవుని దగ్గర దీపం పెట్టి పూలు అర్పించి ఆరోగ్యవంతమైన జీవితం ప్రసాదించమని కోరుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం