తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shani Dev Blessings: శని అనుగ్రహం.. 6 నెలల వరకు ఈ రాశుల అదృష్టానికి తిరుగుండదు

Shani dev blessings: శని అనుగ్రహం.. 6 నెలల వరకు ఈ రాశుల అదృష్టానికి తిరుగుండదు

Gunti Soundarya HT Telugu

08 February 2024, 16:29 IST

    • Shani dev blessings: శని చల్లని చూపు చూశాడంటే ఆ వ్యక్తి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. శని అధీనంలో ఉన్న రాశి చక్రంలోకి అనేక పెద్ద గ్రహాలు సంచరించబోతున్నాయి. ఫలితంగా కొన్ని రాశుల వారికి శని ఆశీస్సులు లభించనున్నాయి. 
శని అనుగ్రహం పొందే రాశులు ఇవే
శని అనుగ్రహం పొందే రాశులు ఇవే

శని అనుగ్రహం పొందే రాశులు ఇవే

Shani dev blessings: రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశి చక్రం మారుస్తూ ఉంటాడు శని దేవుడు. ఈ ఏడాది మొత్తం శని దేవుడు కుంభ రాశిలోనే సంచరిస్తాడు. శని గ్రహ సంచారం వల్ల కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి.

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

కర్మల ఫల దాత, న్యాయ దేవుడుగా పరిగణించే శని దేవుడిని చూసి అందరూ భయపడతారు. కానీ కర్మల అనుసారం ఫలితాలని ఇస్తాడు. మంచి పనులు చేస్తే పేదవాడు అయినా రాజుగా మారిపోతాడు. శని అశుభ దృష్టి పడితే మాత్రం ఎంతటి రాజైన తన సంపద మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. ఈ ఏడాది శని రాశి మారకపోయినా తన కదలిక మారుస్తూ ఉంటాడు. మకర, కుంభ రాశులకు శని దేవుడు అధిపతిగా వ్యవహరిస్తాడు.

ఫిబ్రవరి నెలలో శని అధీనంలో ఉండే మకర రాశిలోకి అనేక పెద్ద గ్రహాలు రాబోతున్నాయి. ఈ సంచారం వల్ల కొన్ని రాశులు అదృష్టం పొందబోతున్నారు. శని సొంత రాశి అయిన మకర రాశిలోకి సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు సంచరిస్తున్నారు. దీని ఫలితంగా కొన్ని రాశుల మీద ఆయా గ్రహాల శుభ ప్రభావం మాత్రమే కాదు శని ఆశీస్సులు కూడా లభించబోతున్నాయి. వచ్చే ఆరు నెలలు ఈ ఆరు రాశుల వారికి తిరుగే ఉండదు.

సింహం

శని అధీనంలో ఉన్న మకర రాశిలోకి అనేక గ్రహాలు రావడం వల్ల సింహ రాశి వారికి అదృష్టం వరించనుంది. రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి కలిసి సంపద పెరుగుతుంది. ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. నూతన ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం పొందుతారు.

మకర రాశి

శని మకర రాశికి అధిపతి. ఈ రాశిలోనే అనేక గ్రహాల కలయిక జరగబోతుంది. ఫలితంగా ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో పదోన్నతి లభిస్తుంది. లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు లాభాలు పొందుతారు.

మీన రాశి

శని ఈ రాశి వారిని ఆశీర్వదిస్తాడు. ఎన్నాళ్ళ నుంచో ఉన్న ఆస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. ఇతరులకు మీ సహాయ సహకారాలు అందుతాయి.

కుంభ రాశి

ఈ ఏడాది మొత్తం శని కుంభ రాశిలోనే ఉంటాడు. అది మాత్రమే కాకుండా పెద్ద గ్రహాల సంచారం వల్ల కుంభ రాశి వారికి శని ఆశీస్సులు లభిస్తాయి. ఉద్యోగాల్లో మీరు చూపించే ప్రతిభ వల్ల మీకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఇది అనుకూలమైన సమయం. వ్యాపారాలు చేసే వారికి ఆకస్మికంగా ధనలాభం వచ్చే మార్గాలు కనిపిస్తాయి.

వృశ్చికం

వృశ్చిక రాశి వారు శని ఆశీస్సులతో వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఇది ఉత్తమ సమయం. రైతులకు ఇప్పటి నుంచి మంచి రోజులు మొదలవుతాయి. పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

తదుపరి వ్యాసం