తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Transit 2023 । శని సంచారంలో మార్పు.. వారు జైలు పాలు అయ్యే సూచనలు!

Saturn Transit 2023 । శని సంచారంలో మార్పు.. వారు జైలు పాలు అయ్యే సూచనలు!

HT Telugu Desk HT Telugu

07 December 2022, 15:54 IST

    • Saturn Transit 2023: మరికొన్ని నెలల్లో శని సంచారంలో మార్పు రాబోతుంది. దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి శుభ, అశుభ ఫలితాలు ఉంటాయి. అయితే కొంతమంది జైలు పాలు అయ్యే సూచనలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ పేర్కొన్నారు.
Saturn Transit 2023
Saturn Transit 2023 (stock photo)

Saturn Transit 2023

Saturn Transit 2023: త్వరలో సంవత్సరం మారుతుంది, మరొక కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. 2023వ సంవత్సరంలో ఏప్రిల్ 29 వరకు శని మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఏప్రిల్ 29 తరువాత నుండి రెండున్నర సంవత్సరాల పాటు శని కుంభ రాశిలో సంచరిస్తాడు. 29 ఏప్రిల్ నుండి శని కుంభ రాశిలో సంచరించుటవలన 2023 సంవత్సరం నుండి కొన్ని రాశుల వారికి ఫలితాలు మారబోతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

లేటెస్ట్ ఫోటోలు

Venus Transit : శుక్రుడి నక్షత్ర మార్పు.. వీరి జీవితంలో అన్నీ అద్భుతాలే ఇక!

May 12, 2024, 08:50 AM

ఈ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది.. డబ్బు సహా చాలా ప్రయోజనాలు

May 11, 2024, 02:05 PM

Jupiter Venus conjunction: మీకు పని ప్రదేశంలో అవమానం కలగవచ్చు.. ఆర్థిక నష్టం రావచ్చు, జాగ్రత్త

May 11, 2024, 01:33 PM

Trikona Raja Yogam : శని దేవుడి చల్లని చూపు.. రాజయోగంతో అదృష్టమంతా ఈ రాశులవారిదే

May 11, 2024, 08:50 AM

సంతోషం అంతా ఈ రాశుల వారిదే! ధన లాభం, ప్రమోషన్​- కొత్త ఇల్లు కొంటారు..

May 11, 2024, 05:50 AM

మే 11, రేపటి రాశి ఫలాలు.. రేపటితో వీరికి డబ్బు సమస్యకు తెరపడబోతుంది

May 10, 2024, 08:20 PM

శని కుంభరాశిలోనికి ప్రవేశించిన తరువాత మే 2023 నుండి మేష రాశి వారికి, వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి, తులా రాశి వారికి, అలాగే ధనుస్సు రాశి వారికి శుభఫలితాలు ఉండబోతున్నాయి. ఈ రాశుల వారు చేసే ప్రతి పనియందు అనుకూల విజయములు పొందెదరు. అలాగే ఆయా రాశుల వారికి ఆర్ధిక ప్రయోజనాలు, ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు, వ్యాపారస్తులకు లాభములు కలుగును.

శని సంచారంలో మార్పు- వారు జైలు పాలు అయ్యే సూచనలు

శని కుంభరాశిలో సంచరించుట వలన కర్కాటక రాశికి, వృశ్చికరాశికి, మకర, కుంభ, మీన రాశుల వారికి ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక్కడ పేర్కొన్న రాశుల వారికి ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని ప్రభావం చేత పనుల యందు ఆటంకములు, మానసిక వేదన, కుటుంబ సమస్యలు, ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు, వ్యాపారస్తులకు ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడు సూచనలు అధికముగా ఉన్నాయి. కలహములు కోర్టు వ్యవహారములు వంటి వాటిలో జాగ్రత్తలు వహించాలి.

ఈ రాశుల వారు శనివారం రోజు నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, శని జపం వంటివి చేసుకోవడం, అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం వలన కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. కుంభ రాశి లోకి శని మారడం వలన సింహ రాశి వారికి మధ్యస్త ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.

శని కుంభ రాశి లోనికి మారడం వలన దేశములయందు యుద్ధ భయాలు, ఆర్ధిక రంగంపై ప్రభావం అధికముగా ఏర్పడును. అవినీతి చర్యల మీద ప్రభుత్వాల దాడి పెరుగును. అవినీతిపరులు, రాజకీయ నాయకులు జైలు పాలు అయ్యెదరు. శని కుంభ రాశి లోకి శని మారడం వలన చలి ప్రభావం అధికముగా ఉండును. ఇనుము, నూనె, ఇంధనం, గ్యాస్ రంగములలో అభివృద్ధి కలుగును.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000.

 బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

టాపిక్

తదుపరి వ్యాసం