తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rahu Transit: రాహు సంచారంతో ఈ రాశుల జీవితంలో అలజడి

Rahu transit: రాహు సంచారంతో ఈ రాశుల జీవితంలో అలజడి

Gunti Soundarya HT Telugu

20 January 2024, 15:00 IST

    • Rahu transit: రాహు సంచార ప్రభావంతో కొన్ని రాశుల వారి జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడబోతున్నాయి. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. 
రాహు సంచారంతో ఇబ్బంది పడే రాశులు ఇవే
రాహు సంచారంతో ఇబ్బంది పడే రాశులు ఇవే

రాహు సంచారంతో ఇబ్బంది పడే రాశులు ఇవే

Rahu transit: శని గ్రహం తర్వాత అందరూ రాహు, కేతువులకి భయపడతారు. వీటిని నీడ గ్రహాలుగా పరిగణిస్తారు. రాహువు గ్రహం వైదిక జ్యోతిష్య శాస్త్రంలో అంతుచిక్కని గ్రహంగా కనిపిస్తుంది. రాహువు ఎప్పుడూ తిరోగమన దిశలోనే సంచరిస్తాడు.

లేటెస్ట్ ఫోటోలు

Budhaditya raja yogam: బుధాదిత్య రాజయోగం.. వీరికి పెళ్లి కుదురుతుంది, ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది

May 20, 2024, 05:54 PM

భద్ర మహాపురుష రాజ యోగంతో ఈ రాశుల జాతకులకు కొత్త అవకాశాలు, శుభ ఘడియలు

May 20, 2024, 05:31 PM

30 ఏళ్ల తరువాత అదృష్ట రాజయోగం.. ఈ 3 రాశులకు శుభ ఘడియలు

May 20, 2024, 11:30 AM

Gajalakshmi Yogam : గజలక్ష్మీ యోగం.. వీరికి అప్పులు తీరుతాయి.. వ్యాపారంలో లాభాలు!

May 20, 2024, 07:58 AM

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

ప్రస్తుతం రాహువు మీన రాశిలో ఉన్నాడు. ఏడాదిన్నరకి ఒకసారి రాహువు రాశి చక్రం మారుతూ ఉంటాడు. గతేడాది అక్టోబర్ 30 ణ రాహువు మేష రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించాడు. ఈ సంవత్సరం మొత్తం రాహువు మీనరాశిలో సంచరిస్తాడు. 2025 లో రాహువు రాశి మార్పు ఉంటుంది. రాహు కన్ను పడితే ఆయా రాశుల వారి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాహు సంచారం కొన్ని రాశుల వారికి అశుభంగా పరిగణిస్తారు. ఏయే రాశుల వారికి రాహువు సంచారం వల్ల కష్టాలు ఎదురవుతాయో తెలుసుకుందాం.

కన్యా రాశి

మీన రాశిలో రాహు సంచారం కన్యా రాశి వారికి సమస్యలు కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు ప్రాపర్టీ లేదా షేర్స్ పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఆ నిర్ణయం విరమించుకోవడం మంచిది. ఇంట్లో కలహాలు చెలరేగుతాయి. బాధల వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. రాహు సంచారం వల్ల ఇంట్లో పెద్దల ఆరోగ్య మీద కూడ ప్రభావం చూపిస్తుంది. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

సింహ రాశి

రాహు సంచారం సింహ రాశి జాతకులకి ప్రయోజనకరంగా పరిగణించబడదు. ఈ ఛాయ గ్రహం కన్ను పడటం వల్ల ఈ రాశి వారి వైవాహిక జీవితంలో సమస్యలు కలుగుతాయి. భాగస్వామితో విడిపోయే పరిస్థితి కూడా తలెత్తే అవకాశం ఉంది. ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. భార్యాభర్తలు చిన్న విషయాలను కూడ పెద్దది చేసి గొడవ పడకుండా సామరస్యంగా మాట్లాడుకుంటే పరిస్థితులు అనుకూలిస్తాయి. ధన నష్టం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన ఆలోచన ఉంటే మానుకోండి. ఈ సమయంలో పెట్టుబడులు పెడితే నష్టపోయే ప్రమాదం ఉంది.

మీన రాశి

రాహు సంచారం మీన రాశిలోనే కొనసాగుతుంది. ఈ ఏడాది మొత్తం ఈ రాశిలో ఉండటం వల్ల వీరికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మంచిది. లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కుటుంబానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు గొడవలకి దారి తీసే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపార రంగంలో వారికి రాహు సంచార ప్రభావం పడుతుంది. మీ బాస్ తో విభేదాలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది.

తదుపరి వ్యాసం