తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Naga Panchami 2023: నాగ పంచమి తేదీ, విశిష్టత ఇవే

Naga Panchami 2023: నాగ పంచమి తేదీ, విశిష్టత ఇవే

HT Telugu Desk HT Telugu

20 August 2023, 11:00 IST

    • శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి రోజు నాగ పంచమి వస్తుంది. తేదీ, పూజ ముహూర్తం, చరిత్ర, ప్రాముఖ్యత, వేడుకల గురించి ఇక్కడ తెలుసుకోండి.
నాగ పంచమి రోజు పూజలందుకునే నాగ దేవతలు
నాగ పంచమి రోజు పూజలందుకునే నాగ దేవతలు (HT_PRINT)

నాగ పంచమి రోజు పూజలందుకునే నాగ దేవతలు

పవిత్రమైన హిందూ పండుగ అయిన నాగ పంచమి పండుగను జరుపుకోవడానికి భక్తులు సన్నద్ధమవుతున్నారు. శుక్ల పక్ష పంచమి లేదా శ్రావణ మాసంలోని ఐదవ రోజు నాగ పంచమిగా జరుపుకుంటారు. సాంప్రదాయాల ప్రకారం మహిళలు నాగదేవతను ప్రార్థిస్తారు. వాటికి పుట్టలో పాలు సమర్పించి, తమ సోదరులు, కుటుంబ సభ్యుల భద్రత కోసం ప్రార్థిస్తారు. మీరు, మీ ప్రియమైనవారు ఈ సంవత్సరం నాగ పంచమిని జరుపుకుంటున్నట్లయితే పండుగ తేదీ, సమయం, పూజ ముహూర్తం, చరిత్ర, ప్రాముఖ్యత, వేడుక గురించి ఇక్కడ తెలుసుకోండి.

లేటెస్ట్ ఫోటోలు

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మే 19 నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు.. ఉద్యోగంలో ప్రమోషన్​- ధన లాభం!

May 14, 2024, 09:35 AM

నాగ పంచమి 2023 తేదీ, సమయం, శుభ ముహూర్తం:

ఈ సంవత్సరం, నాగ పంచమి ఆగస్టు 21 సోమవారం రోజు వస్తుంది. దృక్ పంచాంగ్ ప్రకారం నాగ పంచమి పూజ సమయం ఉదయం 5:53 గంటలకు ప్రారంభమై 8:30 గంటలకు ముగుస్తుంది. నాగ పంచమి పూజా తిథి ఆగస్టు 21న ఉదయం 12:21 గంటలకు ప్రారంభమై ఆగస్టు 22న తెల్లవారుజామున 2:00 గంటలకు ముగుస్తుంది. కాగా గుజరాత్‌లో నాగ పంచమిని సెప్టెంబర్ 4 సోమవారం జరుపుకుంటారని ద్రిక్ పంచాంగం తెలిపింది.

నాగ పంచమి 2023 చరిత్ర, ప్రాముఖ్యత:

హిందూ సంప్రదాయాల ప్రకారం నాగ పంచమికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇది పాముల పూజకు అంకితం. పాములను అత్యంత శక్తివంతమైన జీవులుగా పరిగణిస్తారు. ప్రధానంగా నాగ తెగకు చెందిన భక్తులు వాటిని దేవతలుగా పూజిస్తారు. పాములకు ఏ పూజ చేసినా నాగదేవతలకు చేరుతుందని నమ్మకం. దృక్ పంచాంగ్ ప్రకారం నాగ పంచమి పండుగ సమయంలో 12 పాములను పూజిస్తారు. అనంత్, శేష, వాసుకి, పద్మ, కంబాల్, కర్కోటక్, అశ్వతర్, దృతరాష్ట్ర, శంఖపాల్, కాళియ, తక్షక్, పింగల్ తదితర 12 రకాల పాములను పూజిస్తారు. ఈ రోజున పాములను పూజించే భక్తులకు సర్ప భయం, కాల సర్ప దోషం తొలగిపోతాయని నమ్ముతారు.

నాగ పంచమి కథ

నాగ పంచమికి సంబంధించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి. యమునా నది దగ్గర ఆడుకుంటుండగా నాగు పామును బయటకు తీసుకురావడానికి శ్రీకృష్ణుడు నీటిలోకి దిగాడని ఒక నమ్మకం. అయితే, కాళీయ నాగు అతనిపై దాడి చేస్తుంది. శ్రీకృష్ణుడు కాళీయనాగును ఓడిస్తాడు. అతను సాధారణ బిడ్డ కాదని తెలుసుకున్న కాళీయ నాగు కృష్ణుడిని కరుణించమని వేడుకుంటుంది. ఇకపై గోకుల నివాసులకు హాని చేయనని వాగ్దానం చేస్తుంది. కాళీయ నాగుపై శ్రీకృష్ణుడు సాధించిన విజయాన్ని నాగ పంచమి సూచిస్తుంది.

నాగ పంచమి 2023 వేడుకలు

నాగ పంచమిని హిందువులు చాలా వైభవంగా జరుపుకుంటారు. భక్తులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పాములను పూజిస్తారు. నాగు పాములు జీవించడానికి పాలు, ఇతర ఆహారాలను సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో నాగ పంచమికి ముందు రోజును నాగ చతుర్థి లేదా నాగుల చవితి అని పిలుస్తారు. ఈరోజు ఉపవాసం ఉంటారు.

తదుపరి వ్యాసం