తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Planets Transit: ఒకేరాశిలోకి మూడు గ్రహాలు.. ఈ రాశుల జాతకులకి రెట్టింపు లాభాలు

Planets transit: ఒకేరాశిలోకి మూడు గ్రహాలు.. ఈ రాశుల జాతకులకి రెట్టింపు లాభాలు

Gunti Soundarya HT Telugu

26 January 2024, 9:00 IST

  • Planets transit: మకర రాశిలోకి బుధుడు, కుజుడు, శుక్రుడు సంచరించబోతున్నాయి. ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రావడం వల్ల సంపద పెరగబోతుంది. 

ఒకేరాశిలోకి మూడు గ్రహాలు
ఒకేరాశిలోకి మూడు గ్రహాలు (stock photo)

ఒకేరాశిలోకి మూడు గ్రహాలు

Planets transit: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనానికి అధిక ప్రాధన్యత ఉంటుంది. ఫిబ్రవరిలో అనేక పెద్ద గ్రహాలు తమ రాశులని మార్చుకోవడంతో ఈ నెల ఎంతో ప్రత్యేకంగా మారబోతుంది. మూడు పెద్ద గ్రహాలు ఒకే రాశిలోకి రాబోతున్నాయి. దీని వల్ల ఈ మాసం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది.

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఫిబ్రవరిలో గ్రహాల యువరాజు బుధుడు, కుజుడు, శుక్రుడు తమ రాశి చక్రం మార్చుకోబోతున్నాయి. బుధుడు, శుక్రుడు, కుజుడు మూడు గ్రహాలు మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాయి. ఇప్పటికే ఇక్కడ సూర్యుడు సంచరిస్తున్నాడు. మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం కూడా ఏర్పడబోతుంది. బుధుడు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి వృత్తి, వ్యాపారాల్లో లాభం పొందుతారు. అలాగే శుక్రుడు శుభ స్థానంలో ఉంటే డబ్బుకు ఎటువంటి కొదువ ఉండదు. అంగారకుడు ధైర్యం, పరాక్రమానికి ప్రతీకగా ఉంటాడు. మకర రాశిలో ఈ గ్రహాల కలయిక ఏ రాశుల వారికి అదృష్టంగా పరణమించబోతుందో తెలుసుకుందాం. అందులో మీ రాశి ఉందో లేదో చూసుకోండి.

మేష రాశి

బుధుడు, కుజుడు, శుక్రుడు కలయిక మేష రాశి జాతకులకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి కల నెరవేరే అవకాశం ఉండి. ఆర్థికంగా దృఢంగా ఉండాలంటే పెట్టుబడులు పెట్టడం మాత్రమే కాదు పొదుపుపై కూడా దృష్టి పెట్టాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. అలాగే హైడ్రేట్ గా ఉండటం వాలల మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ధనుస్సు

మకర రాశిలో మూడు గ్రహాల కలయిక ధనుస్సు రాశి వారికి శుభదాయకంగా మారనుంది. వృత్తిలో బాస్ నుంచి ఉద్యోగస్తులు చాలా మద్దతు పొందుతారు. మీరు అనేక కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు. ఆదాయం పెంచుకోవడానికి అనేక కొత్త మార్గాలు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా పుంజుకోవడానికి అనేక మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. కానీ మీరు సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరంగా ఉండేందుకు మీరు జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది.

మకర రాశి

ఇప్పటికే జనవరి 15 నుంచి మకర రాశిలో సూర్య సంచారం జరుగుతోంది. ఇప్పుడు బుధుడు, కుజుడు, శుక్రుడు కూడా ఇదే రాశిలోకి ప్రవేశించబోతున్నారు. అందువల్ల ఈ రాశి వాళ్ళు మిశ్రమ ఫలితాలు ఎదుర్కోబోతున్నారు. వ్యాపారాలు చేసే వారికి ఇది శుభ సమయం. వ్యాపారం విస్తరించుకునేందుకు అనేక కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉన్నప్పటికీ కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. పెట్టుబడు పెట్టె ముందు సంబంధిత విషయం గురించి బాగా పరిశోధించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అప్పుడే మీ పెట్టుబడికి సంబంధించి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

తదుపరి వ్యాసం