తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ అర్ధరాత్రి నుంచి 4 రాశుల జాతకులకు పరిస్థితి మెరుగవుతుంది

ఈ అర్ధరాత్రి నుంచి 4 రాశుల జాతకులకు పరిస్థితి మెరుగవుతుంది

HT Telugu Desk HT Telugu

30 June 2023, 10:41 IST

  • Mars Transit: కుజ గ్రహ సంచారం కారణంగా ఈ అర్ధరాత్రి నుంచి 4 రాశుల జాతకులకు ఆర్థికంగా, కెరీర్ పరంగా జీవితం మెరుగ్గా ఉంటుంది. ఆయా రాశులేవో తెలుసుకోండి.

కుజ గ్రహ సంచారం వల్ల మేషం సహా 4 రాశుల జాతకుల జీవనం మెరుగుపడుతుంది
కుజ గ్రహ సంచారం వల్ల మేషం సహా 4 రాశుల జాతకుల జీవనం మెరుగుపడుతుంది

కుజ గ్రహ సంచారం వల్ల మేషం సహా 4 రాశుల జాతకుల జీవనం మెరుగుపడుతుంది

కుజ గ్రహ సంచారం వల్ల నాలుగు రాశుల జాతకుల పరిస్థితి మారనుంది. జీవన స్థితిగతులు మారనున్నాయి. కుజుడు జులై 1 తెల్లవారుజామున 1.52 గంటలకు సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ అంగారక గ్రహ సంచారంతో కొన్ని రాశుల జాతకులకు అదృష్టం వెన్నంటి ఉంటుంది. సాధారణంగా కుజుడు ఒక రాశిలో 45 రోజలు ఉండి మర రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజ గ్రహ రాశి సంచారం వల్ల ఏయే రాశులకు మేలు జరుగుతుందో ఇక్కడ తెలుసుకోండి.

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

మేష రాశిపై కుజ గ్రహ సంచార ప్రభావం

కుజ గ్రహ సంచారం మేష రాశి జాతకుల జీవితాల్లో సానుకూల ఫలితాలు తెస్తుంది. ఇది మేష రాశి వారికి ఆర్థిక, వృత్తి, వ్యక్తిగత విషయాల్లో అనూహ్య ప్రయోజనాలు తెస్తుంది. అయితే డబ్బును పొదుపు చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. సింహ రాశిలో కుజ గ్రహ సంచార సమయంలో ఆర్థికంగా సంపాదన పెరిగే అవకాశం ఉంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. స్పెక్యులేషన్ లాభదాయకంగా ఉంటుంది. సంబంధాలు బలపడుతాయి. కొన్ని బంధాల్లో ఇబ్బందులు కూడా ఉంటాయి. అనుకున్న లక్ష్యాల సాధనకు సరైన దిశలో కష్టపడుతారు.

సింహ రాశిపై ప్రభావం

సింహ రాశి జాతకులు కుజ సంచారం సమయంలో కుటుంబ సంతోషం, వృద్ధిపై దృష్టి పెడుతారు. కొత్తగా ఆస్తులు పొందే అవకాశం. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కెరీర్ పరంగా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. సింహ రాశి వారు విదేశాల్లో స్థిరపడడం వల్ల అద్భుతమైన ఆర్థిక అవకాశాలు లభిస్తాయి. ఇది పొదుపును పెంచుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నూతన ఉత్సాహంతో ఉంటారు.

వృశ్చిక రాశి వారిపై కుజ గ్రహ సంచార ఫలితం

సింహ రాశిలో కుజ గ్రహ సంచారం వల్ల వృశ్చిక రాశి జాతకులు తమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వారి నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాలు దక్కుతాయి. పదోన్నతి, ప్రోత్సాహకాలకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ గ్రహ సంచారం మరింత అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. వృశ్చిక రాశి జాతకులు ఈ గ్రహ సంచార సమయంలో ఆర్థికంగా బలంగా ఉంటారు. డబ్బు పొదుపు చేయడానికి అవకాశాలు ఏర్పడుతాయి.

కుంభ రాశిపై కుజ సంచార ఫలితం

కుజుడు సింహ రాశిలోకి ప్రవేశించిన సమయంలో కుంభ రాశి జాతకులు తమ పనిలో సానుకూల ఫలితాలు సాధిస్తారు. దూర ప్రయాణాల ద్వారా విజయం సాధించే అవకాశం ఉంటుంది. కెరీర్ పరంగా పురోభివృద్ధికి, పదోన్నతికి, ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఇది అదృష్ట సమయం. కుంభ రాశి జాతకులకు విదేశాల్లో లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు అధిక లాభాలు ఆర్జిస్తారు. వీరికి అదృష్టం వెన్నంటి ఉంటుంది.

తదుపరి వ్యాసం