తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tirumala Brahmostavalu : బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన విశిష్టత ఏంటి?

Tirumala Brahmostavalu : బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన విశిష్టత ఏంటి?

HT Telugu Desk HT Telugu

14 October 2023, 11:27 IST

    • Garuda Vahana Seva : తిరుమలలో బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవకు ప్రత్యేకత ఉంది. శ్రీవారిని గరుడ వాహనంపై తీసుకెళ్తుంటే కన్నుల పండువక ఉంటుంది. దీని విశిష్టతను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తిరుమల శ్రీనివాసుడికి ప్రియసఖుడు గరుడుడు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఐదవరోజు రాత్రి జరిగే గరుడసేవ విశిష్టమైనది. అనాదిగా ఈ సేవకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. గరుడవాహనం అధిరోహిచే స్వామిమూర్తి మలయప్పకు మూలవిరాట్టుకున్న మకరకంఠి, సహస్రనామహారం, లక్ష్మీహారం, పచ్చ మొదలైన వాటిని అలంకరిస్తారు. మూలవిరాట్టే ఈ వాహనాన్ని ఆవహించి భక్తులను అనుగ్రహిస్తారని ఐతిహ్యం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

లేటెస్ట్ ఫోటోలు

Venus Transit : శుక్రుడి నక్షత్ర మార్పు.. వీరి జీవితంలో అన్నీ అద్భుతాలే ఇక!

May 12, 2024, 08:50 AM

ఈ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది.. డబ్బు సహా చాలా ప్రయోజనాలు

May 11, 2024, 02:05 PM

Jupiter Venus conjunction: మీకు పని ప్రదేశంలో అవమానం కలగవచ్చు.. ఆర్థిక నష్టం రావచ్చు, జాగ్రత్త

May 11, 2024, 01:33 PM

Trikona Raja Yogam : శని దేవుడి చల్లని చూపు.. రాజయోగంతో అదృష్టమంతా ఈ రాశులవారిదే

May 11, 2024, 08:50 AM

సంతోషం అంతా ఈ రాశుల వారిదే! ధన లాభం, ప్రమోషన్​- కొత్త ఇల్లు కొంటారు..

May 11, 2024, 05:50 AM

మే 11, రేపటి రాశి ఫలాలు.. రేపటితో వీరికి డబ్బు సమస్యకు తెరపడబోతుంది

May 10, 2024, 08:20 PM

గరుడసేవ ఊరేగింపు సమయంలో స్వామి ఆలయాన్ని వీడి తిరువీధులలో సంచరిస్తారని భక్తుల నమ్మకం. అందుకే అశేష సంఖ్యలో భక్తులు గరుడసేవకు హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాక గరుత్మంతుడు నిత్యసూరి, స్వామికి దాసుడు, సఖుడు, వాహనం, పతాక చిహ్నం, గరుత్మంతునికి తెలియని స్వామి రహస్యాలుండవు. గరుడుని పెరియతిరువడి అనడం వైష్ణవ సంప్రదాయం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

గరుడసేవలో స్వామిని దర్శిస్తే కోర్కెలు తీరుతాయని, ముల్లోకాలదేవతలు కూడా గరుడసేవలో, ముల్లోకాల దేవతలు కూడా గరుడసేవలో స్వామివారిని దర్శించడానికి వస్తారని భక్తుల నమ్మకం. తొమ్మిది రోజులు జరిగే బ్రహ్మోత్సవాల్లో ఇది పరాకాష్ట గతంలో వేలలో ఉండే భక్తుల సంఖ్య ఇప్పుడు లక్షలకు పెరిగింది. రాష్ట్రప్రభుత్వ తరపున ముఖ్యమంత్రి గరుడసేవ రోజున స్వామికి పట్టువస్తాలను సమర్పించేవారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అప్పటినుంచి నిరంతరాయంగా కొనసాగుతోందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కాలక్రమంలో గరుడసేవ రోజు అధిక రద్దీ.. భద్రతాపరమైన కారణంగా 2004లో వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని సవరించి బ్రహ్మోత్సవాల మొదటిరోజున అంటే ధ్వజారోహణం మొదటిరోజున అంటే ధ్వజారోహణం తర్వాత ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించడాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే ప్రక్రియ నేటికీ కొనసాగుతోందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

చెన్నై నుండి గరుడోత్సవంనాడు నూతన గొడుగులను సమర్పించే విధానం అనాదిగా వస్తోంది. భక్తిశ్రద్ధలతో ఈ గొడుగులను తయారుచేసి చెన్నై నుండి ఐదు రోజుల పాటు పాదయాత్రతో తిరుమలకు చేరుకుంటారు. ఆలయం ప్రదక్షిణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు గొడుగులను అప్పగిస్తారు. వీటిలో రెండు స్వర్ణకాంతులు, మరో ఏడు శ్వేత కాంతులతో ఉంటాయని ప్రముఖ ఆధ్యాత్మి కవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

తదుపరి వ్యాసం