తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  2023 దీపావళి ఏ తేదీలో జరుపుకోవాలి? స్పష్టత ఇచ్చిన చిలకమర్తి

2023 దీపావళి ఏ తేదీలో జరుపుకోవాలి? స్పష్టత ఇచ్చిన చిలకమర్తి

HT Telugu Desk HT Telugu

08 November 2023, 15:53 IST

    • Diwali 2023 date: 2023 దీపావళి పండగ ఏ తేదీన జరపుకోవాలి? ఏ సమయంలో జరుపుకోవాలి వంటి ధర్మ సందేహాలకు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ స్పష్టత ఇచ్చారు.
జమ్మూలో దీపావళి ప్రమిదలను సిద్ధం చేస్తున్న దృశ్యం
జమ్మూలో దీపావళి ప్రమిదలను సిద్ధం చేస్తున్న దృశ్యం (AP)

జమ్మూలో దీపావళి ప్రమిదలను సిద్ధం చేస్తున్న దృశ్యం

ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష అమావాస్య తిథి రోజు దీపావళి పండుగ అని జ్యోతిష్యశాస్త్రం తెలియచేస్తోంది. కానీ శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో తిథులు వ్యాప్తి చెందడం చేత అనేక పండుగల విషయాలలో ఇబ్బందులు, అపోహలు కలిగాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

లేటెస్ట్ ఫోటోలు

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

Mercury transit: వీరి మీద కనక వర్షం కురిపించబోతున్న బుధుడు.. అందులో మీరు ఉన్నారా?

May 16, 2024, 01:34 PM

Jupiter combust: అస్తంగత్వ దశలోకి గురు గ్రహం.. వీరికి అప్పులు, సమస్యలు, కష్టాలే

May 16, 2024, 01:11 PM

మన సనాతన ధర్మంలో పండుగల నిర్ణయాన్ని తెలిపేటటువంటి శాస్త్రాలు రెండు అని, మొట్టమొదటిది జ్యోతిష్యశాస్తమని, రెండవది ధర్మశాస్త్రమని చిలకమర్తి తెలిపారు. చిలకమర్తి పంచాంగరీత్యా ధర్మశాస్త్రం ఆధారంగా శ్రీ శోభకృత్‌ సంవత్సరంలో 12వ తారీఖు రాత్రి సమయంలో దీపావళి పండుగను ఆచరించాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

దీపావళి ఐదు రోజుల పండుగని, ధనత్రయోదశితో ప్రారంభమై యమద్వితీయతో పూర్తయ్యే ఈ ఐదు రోజులు దీపావళి పండుగను ఆచరించాలని చిలకమర్తి తెలిపారు. ఈ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా 11 నవంబర్‌ 2023 శనివారం త్రయోదశి చేత ఈరోజు ధనత్రయోదశి పూజను ఆచరించుకోవాలని సూచించారు.

12 నవంబర్‌ 2028 ఆదివారం రోజు సూర్యోదయ సమయానికి చతుర్దశి తిథి మధ్యాహ్నం 1.48 వరకు చిలకమర్తి పంచాంగరీత్యా వ్యాప్తి చెంది ఉన్నదని, మధ్యాహ్నం 1.48 నుండి రాత్రి సమయం, 13వ తారీఖు మధ్యాహ్నం అమావాస్య ఉండటంచేత ధర్మశాస్త్ర ఆధారంగా రాత్రి వ్యాపించి ఉన్న సమయంలోనే దీపావళి లక్ష్మీపూజను ఆచరించాలి. కాబట్టి 12వ తారీఖు ఉదయం నరకచతుర్దశికి సంబంధించినటువంటి స్నాన, దాన, తర్పణ మరియు పితృ కర్మలు వంటివి ఆచరించుకొని 12వ తారీఖు రాత్రి అమావాస్య సమయంలో లక్ష్మీదేవిని పూజించుకుని దీపావళి పండుగను జరుపుకోవాలని చిలకమర్తి తెలిపారు.

13వ తారీఖు సూర్యోదయ సమయానికి అమావాస్య ఉండి మధ్యాహ్నం 2.20ని॥ వరకు అమావాస్య ఉన్నప్పటికి 12వ తారీఖు రాత్రి అమావాస్య వ్యాప్తి ఉండటం వలన లక్ష్మీపూజ దీపావళి పూజ, ఆరాధనలు దీపావళి పండుగ వంటివి ఆచరించాలని, 13వ తారీఖు సోమవార వ్రతం, కేదారగౌరీవ్రతం వంటివి ఆచరించుకోవాలని, 14వ తారీఖు నుండి కార్తీక మాసం ప్రారంభం అవుతుందని వివరించారు.

14న బలిపాడ్యమి, 15వ తారీఖున యమద్వితీయతో ఈ ఐదు రోజుల దీపావళి పండుగ సంపూర్ణం అవుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం