తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఈరోజు అన్ని రాశులవారు శనికి తైలాభిషేకం చేయాలి.. ఎందుకంటే..

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఈరోజు అన్ని రాశులవారు శనికి తైలాభిషేకం చేయాలి.. ఎందుకంటే..

28 January 2023, 1:59 IST

    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? జనవరి 28వ తేదీ 2023న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (28-01-2023) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈరోజు మేషరాశి ఫలాలు

మేషరాశి వారికి ఈరోజు అనుకూలముగా ఉంది. అనుకూల స్థితి వలన చేసే ప్రతి పని కలిసివచ్చును. ఆర్ధికపరమైన లాభములు, సౌఖ్యము కలుగును. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సూర్యారాధన చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ఆవేశ పూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయండి.

ఈరోజు వృషభరాశి ఫలాలు

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కుటుంబంలో వాదనలు, సమస్యలతో కూడినటువంటి వాతావరణం ఉండును. మనస్తాపము, అనారోగ్యం కలుగు సూచనలున్నాయి. మానసిక ఒత్తిడి అధికమగును. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలున్నాయి. ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి శ్రమతో, ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం పొందెదరు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

ఈరోజు మిధునరాశి ఫలాలు

మిధునరాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేసెదరు. సౌఖ్యమును పొందుతారు. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఏర్పడును. శారీరక శ్రమ పెరుగును. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. ధన లాభము కలుగును. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. సమస్యలను, ఒత్తిడిని నేర్పుతో అధిగమిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

ఈరోజు కర్కాటకరాశి ఫలాలు

కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. ధనలాభము, వస్తు లాభము కలుగును. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసెదరు. మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగును. కుటుంబంలో కొన్ని సమస్యలు బాధించును. ఆరోగ్య, ఆర్ధిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం మంచిది. చేసే ప్రతి పని అనుకూలించును. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరిన్ని శుభఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

ఈరోజు సింహరాశి ఫలాలు

సింహరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. చేసే ప్రతీ పనిలో విజయాలు పొందుతారు. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తలు వహించడం మంచిది. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగును. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభము కలుగును. కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగును. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

ఈరోజు కన్యారాశి ఫలాలు

కన్యారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. బేధాభిప్రాయములు, ఆవేశపూరిత నిర్ణయములు తీసుకుంటారు. అయినప్పటికీ విజయం పొందుతారు. ధనలాభము, సౌఖ్యము కలుగును. అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ఒత్తిళ్లు తగ్గును. ప్రయాణములు లాభించును. శత్రువులపై విజయము పొందుతారు. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

ఈరోజు తులా రాశి ఫలాలు

తులారాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలున్నాయి. చేసే ప్రతీ పనిలో చికాకులు, సమస్యలు ఏర్పడును. ఆరోగ్య విషయాలపట్ల జాగ్రత్తలు వహించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస కుటుంబమునందు ఏదో ఒక సమస్య బాధించును. వ్యాపారస్తులకు ఒత్తిడి అధికమగును. విద్యార్థులకు మధ్యస్థ ఫలములు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

ఈరోజు వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చికరాశికి ఈరోజు అంత అనుకూలముగా లేదు. కుటుంబంలో చికాకులు, సమస్యలు ఏర్పడును ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ధనలాభము కలుగును. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఉన్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

ఈరోజు ధనూ రాశి ఫలాలు

ధనూ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. ఆర్ధికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. పనుల్లో కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ పూర్తి చేసెదరు. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

ఈరోజు మకర రాశి ఫలాలు

మకర రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. చేసే పనుల్లో లాభమును పొందెదరు. ఖర్చులు అధికమగును. ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు వహించాలి. కష్టపడాల్సిన సమయం. ఒత్తిడి అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు అధికముగా ఉండును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

ఈరోజు కుంభ రాశి ఫలాలు

కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్తమునుంచి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కలసి వచ్చును. ఆర్ధికపరంగా అనుకూలించును. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికీ ఏదో రకంగా ముందుకు సాగుతారు. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. చేసే ప్రతీ పనిలో కొంత అనుకూల ఫలితములు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నం ఫలించును. వ్యాపారములో ఉన్న సమస్యలు తొలగును. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

ఈరోజు మీన రాశి ఫలాలు

మీన రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉన్నది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. పనుల్లో చికాకులు ఏర్పడును. కుటుంబమునందు సమస్యలు వేధించును. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచన. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కలసి వచ్చును. కీర్తి, సౌఖ్యము కలుగును. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

టాపిక్

తదుపరి వ్యాసం