తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వార ఫలాలు : ఈ వారం రాశి ఫలాలు.. వీరు కొత్త సంవత్సరంలో అధికంగా ధనం ఖర్చు పెడతారు

వార ఫలాలు : ఈ వారం రాశి ఫలాలు.. వీరు కొత్త సంవత్సరంలో అధికంగా ధనం ఖర్చు పెడతారు

HT Telugu Desk HT Telugu

31 December 2023, 2:00 IST

    • Weekly Horoscope Telugu : ఈవారం రాశి ఫలాలు (వార ఫలాలు) 31.12.2023 నుండి 06.01.2024 వరకు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈవారం రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈ వారం రాశి ఫలాలు
ఈ వారం రాశి ఫలాలు (Pixabay)

ఈ వారం రాశి ఫలాలు

రాశిఫలాలు (వార ఫలాలు) 31.12.2023 నుండి 06.01.2024 వరకు, సంవత్సరం : శోభకృత్‌ నామ, అయనం : దక్షిణాయనం, మాసం : మార్గశిరం

లేటెస్ట్ ఫోటోలు

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మే 19 నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు.. ఉద్యోగంలో ప్రమోషన్​- ధన లాభం!

May 14, 2024, 09:35 AM

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం జన్మరాశియందు గురుడు, లాభస్థానములో శని, వ్యయస్థానములో రాహువు ప్రభావంచేత పనులలో ఒత్తిళ్ళు ఏర్పడినప్పటికీ అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. భాగ్యములో రవి, కుజుడు, చంద్రుని ప్రభావం వలన శారీరక సౌఖ్యం, ఆనందం పొందెదరు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. సౌఖ్యం, ఆనందము పొందెదరు. ప్రయాణాలలో ధనమును ఖర్చు చేసెదరు. ఉద్యోగస్తులకు ఈవారం అనుకూల ఫలితాలు ఇస్తుంది. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడుకున్నటువంటి వారం. మేషరాశివారు ఈ వారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుణిడిని పూజించినట్లయితే మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం కళత్ర స్థానములో బుధ, శుక్రుల అనుకూలత వలన కుటుంబసౌఖ్యం, ఆనందము పొందెదరు. మీయొక్క అనందం కోసం ప్రయాణములు వంటివి చేసెదరు. ప్రయాణముల కొరకు అధికముగా ధనమును ఖర్చుపెట్టెదరు. స్తీ సౌఖ్యం, ఆనందము పొందెదరు. ఉద్యోగస్తులకు ఖర్చులతో కూడుకున్నటువంటి వారం. వ్యయస్థానములో గురుని ప్రభావం వలన ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. దశమంలో శని అనుకూలత వలన ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. వృషభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారంరోజు దుర్గాదేవిని పూజించాలి.

మిథున రాశి

మిథున రాశివారికి ఈ వారం కలసివచ్చును. గురుడు లాభస్థానములో సంచరించుట వలన ధనలాభము, వస్తులాభం వంటివి కలుగును. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరముగా గడిపెదరు. భాగ్యములో శని ప్రభావం వలన వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. శత్రు స్థానములో బుధ, శుక్రుల సంచారం వలన శత్రువుల వల్ల చికాకులు ఏర్పడును. కళత్రములో రవి ప్రభావం వలన జీవిత భాగస్వామితో భేదాభిప్రాయములు ఏర్పడు సూచన. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలించును. మిథునరాశివారు ఈ వారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే అదివారం సూర్యాష్టకాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలున్నాయి. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. అష్టమ శని ప్రభావంచేత సమస్యలు కొంత వేధించును. రవి, కుజులు ఆరో స్థానములో అనుకూలత వలన ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. బుధ, శుక్రుల ప్రభావం చేత ధనలాభవము, వస్తులాభము కలుగును. ప్రయాణములో చికాకులు ఏర్పడు సూచన. కర్కాటక రాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పరించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు అనుకూలంగా ఉన్నది. భాగ్యములో గురుని అనుకూల ప్రభావం వలన లాభము కలుగును. చతుర్ధంలో బుధ, శుక్రుల ప్రభావంచేత సౌఖ్యం, ఆనందము పొందెదరు. పంచమంలో రవి, కుజుల ప్రభావంచేత ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలేర్పడును. మీ ఆనందము కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు. ప్రయాణాలు అనుకూలించును. వాక్‌ స్థానములో కేతువు ప్రభావం వలన ఆవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలని సూచన. సింహరాశివారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మార్పు తెచ్చేటటువంటి వారం. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమగును. ఆరో స్థానములో శని అనుకూలత వలన ప్రయాణములు అనుకూలించును. తృతీయంలో బుధ, శుక్రుల ప్రభావం వలన వ్యాపారాభివృద్ధి కలుగును. చతుర్ధంలో రవి, కుజుల ప్రభావం వలన కుటుంబ సభ్యులతో చర్చలలో బేధాభిప్రాయం ఉన్నప్పటికి మీ మాటే నెగ్గును. స్తీ సౌఖ్యం, ఆనందము పొందెదరు. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. వ్యాపారస్తులకు అనుకూలించును. విద్యార్థులకు కష్టపడవలసిన సమయం. కన్యారాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు కోసం మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు ఈవారం అనుకూలించును. కళత్రములో గురుని ప్రభావం వలన కుటుంబ సభ్యుల ఆదరణ పొందెదరు. పంచమంలో శని, ఆరో స్థానములో రాహువు అనుకూల ప్రభావం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలించును. ధన స్థానములో బుధ, శుక్రుల ప్రభావం వలన ధనలాభము సౌఖ్యము కలుగును. ఈ వారం కొత్త వస్తువులు లభించును. స్త్రీలకు అనుకూల సమయం. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. జన్మరాశిలో బుధ, శుక్రుల ప్రభావం వలన శారీరక శ్రమ, అలసట కలుగును. సౌఖ్యం పొందినప్పటికి ఏదో విషయం మీద ఆలోచనలు, వేదన కలుగును. అర్భాష్టమ శని ప్రభావం వలన పనులయందు అలసత్వం ఏర్పడి ఒత్తిళ్ళకు గురి అయ్యెదరు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళకపోతే ఇబ్బందులు తప్పవు. వాక్‌ స్థానములో రవి, కుజుల ప్రభావం వలన గొడవలకు దూరంగా ఉండాలని సూచన. కోపము వలన నష్టపోయే సూచనలేర్పడుతున్నాయి. శత్రు స్థానములో గురుని ప్రభావం వలన శత్రువుల వలన ఇబ్బందులు ఏర్పడును. గురుదక్షిణామూర్తిని పూజించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. తృతీయంలో శని, పంచమంలో గురుడు అనుకూలంగా ఉన్నప్పటికి జన్మరాశి యందు రవి, కుజుల ప్రభావం వలన పనుల యందు ఒత్తిళ్ళు, చికాకులు కలుగును. ఆరోగ్య విషయాలయందు, కుటుంబ వ్యవహారాలయందు కచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. వ్యయస్థానములో బుధ, శుక్రుల ప్రభావం వలన ధన వ్యయం కలుగు సూచన. ఖర్చులు నియంత్రించుకోవాలి. వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల కోసం దర్పణాల కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు. స్త్రీలకు ఒత్తిళ్ళతో కూడినటువంటి సమయం. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. ఉద్యోగస్తులకు ఈవారం అనుకూలంగా ఉన్నది. ధనూరాశివారు ఈవారం మరింత శుభఫలితాల కోసం సూర్యాష్టకాన్ని పఠించడం. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశివారికి ఈ వారం మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. లాభ స్థానములో బుధ, శుక్రుల వలన ధనలాభం, వస్తులాభం కలుగును. స్త్రీ సౌఖ్యం, భోగము కలుగును. వ్యయస్థానములో రవి, కుజులు, ధనస్థానములో శని (ఏలినాటి శని) ప్రభావం చేత ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. అనవసరమైన ఖర్చులు పెరుగును. ప్రయాణములో ధన వ్యయం కలుగు సూచన. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. వ్యాపారస్తులకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మార్పు కలిగేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏలినాటి శని జన్మశని ఉన్నప్పటికి లాభస్థానములో రవి, కుజుల ప్రభావం వలన ధనలాభము, వస్తులాభము కలుగును. ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. దశమంలో బుధ, శుక్రుల అనుకూల ప్రభావం వలన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు ఈవారం అనుకూలమైన వారం. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. వాక్‌ స్థానములో రాహువు ప్రభావం వలన ఆవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. స్త్రీలకు అనుకూలించును. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఏలినాటి శని ప్రభావం, జన్మరాహువు 'ప్రభావంచేత ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. గొడవల వల్ల మీ ప్రవర్తన వలన ఇబ్బందులు పెరుగును. దశమంలో రవి, కుజుల ప్రభావం వలన మీన రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలు కలుగును. భాగ్యములో బుధ, శుక్రుల ప్రభావంచేత ధనలాభము, వస్తులాభము కలుగును. ప్రయాణాలలో ధన వ్యయం కలుగు సూచన. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. ఆవేశపూరిత నిర్ణయాలతో సమస్యలధికమగును. దక్షిణామూర్తిని పూజించండి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి. లలితా సహస్ర నామాన్ని పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
తదుపరి వ్యాసం