తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  డిసెంబర్ 31 : నేటి రాశి ఫలాలు.. 2023లో చివరి రోజు మీ రాశి ఎలా ఉందంటే

డిసెంబర్ 31 : నేటి రాశి ఫలాలు.. 2023లో చివరి రోజు మీ రాశి ఎలా ఉందంటే

HT Telugu Desk HT Telugu

31 December 2023, 1:00 IST

    • Today December 31st Horoscope : నేటి రాశి ఫలాలు 31.12.2023 కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 31.12.2023, వారం: ఆదివారం, తిథి : కృ. చవితి,, నక్షత్రం : మఖ, మాసం : మార్గశిరం,, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

లేటెస్ట్ ఫోటోలు

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగవు. అయినవారితో మాట్లాడటం ఆనందాన్నిస్తుంది. ఖర్చులు అధికమగును. బాధ్యతలు అప్పగించవద్దు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు చేస్తారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ప్రతీ విషయానికి ఆందోళన చెందుతారు. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఖర్చులు అధికమగును. రుణ పరమైనటువంటి సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. అతిగా ఆలోచించవద్దు. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. పెద్దలను సంప్రదించండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పత్రాలు అందుకుంటారు. గృహమార్పు కలసివస్తుంది. పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది. వృషభరాశివారు ఈరోజు క్రిష్టాష్టకం పఠించడం వల్ల వృషభరాశి వారికి మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనుల సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఆహ్వానం అందుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఇంటికి సంబంధించిన పనులు చేపడతారు. దైవకార్యంలో పాల్గొంటారు. మిథునరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పెద్ద మొత్తంలో ధనసహాయం మంచిది కాదు. కష్టమనుక్ను పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఉల్లాసంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. అరుణం పఠించడం లేదా వినడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఆదాయం ఆనందకరం. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. వ్యాపకాలు అధికమవుతాయి. సింహరాశివారికి మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చులు అధికమగును. పనులు చురుకుగా సాగుతాయి. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అయినవారితో సంప్రదింపులు చేస్తారు. మీ ప్రతిపాదనకు స్పందన లభిస్తుంది. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పిల్లల దూకుడు అదుపుచేయండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ప్రయాణాలు అనుకూలించును. కుటుంబంతో ఆనందముగా గడుపుతారు. పత్రాలు, నగదు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. తులారాశివారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. ఖర్చులు అధికమగుతాయి. పరిచయస్తులు ధనసహాయం కోరుతారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇష్టాఇష్టాలను లౌక్యంగా తెలియచేయండి. ఆప్తుల కలయిక వీలుపడదు. ఒక సంబంధం కలసివస్తుంది. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. వృశ్చికరాశివారు మరింత శు భఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం, నవగ్రహా ఆలయాల్లో పూజలు వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండదు. కష్ట సమయంలో సన్నిహితులు సాయం అందిస్తారు. ధన సమస్యలు ఎదురవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆత్మీయుల కలియిక ఆనందాన్నిస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్ట్రకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది. క్షీరాన్నాన్ని ఆలయాల్లో ప్రసాదంగా పంచడం మంచిది.

మకర రాశి

మకర రాశివారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. దుబారా ఖర్చులు విపరీతం. సన్నిహితులతో సంభాషిస్తారు. గృహ మరమ్మత్తులు చేపడతారు. సంతానపరంగా శుభ సమయం. వేడుకకు హాజరవుతారు. ప్రయాణం చికాకు కలిగిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహశాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రావలసిన ధనం అందుతుంది. కొంత మొత్తం పొదుపు చేస్తారు. ప్రతి విషయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పనులు చురుకుగా సాగుతాయి. ఆశించిన పదవులు దక్కవు. పుణ్యక్షేత్రాల సందర్శన మనసుకు ఆనందాన్నిస్తుంది. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నువ్వులతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచి పెట్టండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. వివాహ ప్రయత్నం ఫలిస్తుంది. ఆరోగ్యం అనుకూలించును. ఆపన్నులకు సాయం అందిస్తారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామపారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగును.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
తదుపరి వ్యాసం