తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Copper Ring Benefits : రాగి ఉంగరంతో చాలా ప్రయోజనాలు.. ఏ వేలికి ధరించాలి?

Copper Ring Benefits : రాగి ఉంగరంతో చాలా ప్రయోజనాలు.. ఏ వేలికి ధరించాలి?

HT Telugu Desk HT Telugu

28 April 2023, 11:27 IST

    • Copper Ring Benefits : చాలా మంది చేతులకు రాగి ఉంగరాలు ధరిస్తారు. రాగి ఉంగరాన్ని కొంతమంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెట్టుకుంటారు. మరికొందరు ఆరోగ్య ప్రయోజనాల కోసం ధరిస్తారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాగి ఉంగరాన్ని(Copper Ring) ధరించడం వల చాలా లాభాలు ఉన్నాయని అనేకమంది నమ్ముతారు. దీనితో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. రాగి ఉంగరం వల్ల కలిగే ప్రయోజనం గురించి వేద శాస్త్రంలో కూడా ఉంది. చాలా కోప స్వభావం ఉన్నవారు ఈ రాగి ఉంగరాన్ని ధరిస్తే, క్రోధం అదుపులో ఉంటుందని వేద శాస్త్రంలో చెప్పబడింది.

లేటెస్ట్ ఫోటోలు

Venus Transit : శుక్రుడి నక్షత్ర మార్పు.. వీరి జీవితంలో అన్నీ అద్భుతాలే ఇక!

May 12, 2024, 08:50 AM

ఈ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది.. డబ్బు సహా చాలా ప్రయోజనాలు

May 11, 2024, 02:05 PM

Jupiter Venus conjunction: మీకు పని ప్రదేశంలో అవమానం కలగవచ్చు.. ఆర్థిక నష్టం రావచ్చు, జాగ్రత్త

May 11, 2024, 01:33 PM

Trikona Raja Yogam : శని దేవుడి చల్లని చూపు.. రాజయోగంతో అదృష్టమంతా ఈ రాశులవారిదే

May 11, 2024, 08:50 AM

సంతోషం అంతా ఈ రాశుల వారిదే! ధన లాభం, ప్రమోషన్​- కొత్త ఇల్లు కొంటారు..

May 11, 2024, 05:50 AM

మే 11, రేపటి రాశి ఫలాలు.. రేపటితో వీరికి డబ్బు సమస్యకు తెరపడబోతుంది

May 10, 2024, 08:20 PM

సూర్యుడు, కుజుడు మన జాతకంలో అనుకూల స్థితిలో లేకుంటే ఈ రాగి ఉంగరాన్ని(Copper Ring) ధరించడం వల్ల దాని చెడు ప్రభావం తగ్గుతుంది. ఇది ఒక వ్యక్తిలోని చెడు చింతలను తొలగించి, సానుకూల అనుభూతిని కలిగిస్తుందని చెబుతారు. రాగి ఉంగరం ధరించడం మన వ్యక్తిత్వ వికాసానికి మంచిది.

రాగి ఉంగరాన్ని ఏ వేలికి ధరించాలి?

ఉంగరపు వేలుకు ధరించే రాగి ఉంగరంతో మంచి జరుగుతుందని చెబుతారు. పురుషులు కుడిచేతి ఉంగరపు వేలికి, స్త్రీలు ఎడమచేతి ఉంగరపు వేలికి ధరిస్తే మంచిదని అంటారు.

రాగి ఉంగరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

రాగి(Copper) లోహం మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మన శరీరంలో శక్తిని పెంచుతుంది. రాగి లోహాన్ని ఉంగరంగా ధరించడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు శరీరంలో రక్త ప్రసరణకు ఎంతో మేలు జరుగుతుంది. ఇది వ్యాధి నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. శరీరంలోని మలినాలను తొలగించి రోగనిరోధక శక్తి(Immunity)ని పెంచుతుంది.

రాగి ఉంగరం ధరించడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రాగి ఉంగరం శరీరంలోని రక్తపోటును సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి(heart health) కూడా మంచిది. ఇది గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

కీళ్ల నొప్పులు, ఇతర సమస్యలతో బాధపడేవారు రాగి ఉంగరం లేదా బ్రాస్‌లెట్ ధరించడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఇది ఎముకల ఆరోగ్యానికి(Bone health) చాలా మంచిది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

రాగి ఉంగరం లేదా ఆభరణాలు ధరించడం చర్మానికి(Skin) చాలా మంచిది. ఇది చర్మకాంతిని పెంచుతుంది. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా యవ్వనంగా కనిపించేందుకు సహాయపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలను నివారించడంలో కాపర్ రింగ్ సహాయపడుతుంది. చేతులు, వేళ్లు, పాదాల్లో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

తదుపరి వ్యాసం