తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Yadadri : మే 2 నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు

Yadadri : మే 2 నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు

19 April 2023, 15:22 IST

Yadadri Jayanti Utsavalu 2023: మే 2వ తేదీ నుంచి యాదాద్రి జయంత్యుత్సవాలు  మొదలు కానున్నాయి. 3 రోజుల పాటు వేడుకలను కనుల పండువలా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా తేదీల్లో పలు సేవలను రద్దు చేయనున్నారు.

  • Yadadri Jayanti Utsavalu 2023: మే 2వ తేదీ నుంచి యాదాద్రి జయంత్యుత్సవాలు  మొదలు కానున్నాయి. 3 రోజుల పాటు వేడుకలను కనుల పండువలా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా తేదీల్లో పలు సేవలను రద్దు చేయనున్నారు.
శ్రీ  లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు వచ్చే నెల 2వ తేదీన ప్రారభం కానున్నాయి. మూడు రోజులపాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.
(1 / 5)
శ్రీ  లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు వచ్చే నెల 2వ తేదీన ప్రారభం కానున్నాయి. మూడు రోజులపాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.(facebook)
జయంతి ఉత్సవాల్లో భాగంగా మే 2వ తేదీన ఉదయం స్వస్తివాచనం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. తిరు వేంకటపతి అలంకార సేవోత్సవం చేపడతారు. రాత్రి గరుడ వాహనోత్సవం ఉంటుంది.
(2 / 5)
జయంతి ఉత్సవాల్లో భాగంగా మే 2వ తేదీన ఉదయం స్వస్తివాచనం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. తిరు వేంకటపతి అలంకార సేవోత్సవం చేపడతారు. రాత్రి గరుడ వాహనోత్సవం ఉంటుంది.(facebook)
ఇక మే 3వ తేదీన  నిత్యమూలమంత్ర హవనం, లక్షపుష్పార్చన, కాళీయమర్ధన అలంకార సేవ ఉంటుంది, ఇక సాయంత్రం నృసింహ మూలమత్ర హవనం, హనుమంత వాహనంపై శ్రీరాముడి అలంకారోత్సవాన్ని నిర్వహిస్తారు.
(3 / 5)
ఇక మే 3వ తేదీన  నిత్యమూలమంత్ర హవనం, లక్షపుష్పార్చన, కాళీయమర్ధన అలంకార సేవ ఉంటుంది, ఇక సాయంత్రం నృసింహ మూలమత్ర హవనం, హనుమంత వాహనంపై శ్రీరాముడి అలంకారోత్సవాన్ని నిర్వహిస్తారు.(facebook)
ఇక  4వ తేదీన ఉదయం స్వామివారి ప్రధానాలయంలో మూలమస్తృ హవనం, ఉదయం 9నుంచి 9:30 గంటల వరకు మహాపూర్ణాహుతి అనంతరం సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు, సాయంత్రం  నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహానివేదన, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించి ఉత్సవాలకు పరిసమాప్తి పలుకుతారు.
(4 / 5)
ఇక  4వ తేదీన ఉదయం స్వామివారి ప్రధానాలయంలో మూలమస్తృ హవనం, ఉదయం 9నుంచి 9:30 గంటల వరకు మహాపూర్ణాహుతి అనంతరం సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు, సాయంత్రం  నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహానివేదన, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించి ఉత్సవాలకు పరిసమాప్తి పలుకుతారు.(facebook)
స్వామివారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయా తేదీల్లో పలు సేవలను రద్దు చేయనున్నారు. ఆర్జిత సేవలైన సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత తిరుకల్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలను నిలిపివేయనున్నట్లు అధికారులు చెప్పారు.
(5 / 5)
స్వామివారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయా తేదీల్లో పలు సేవలను రద్దు చేయనున్నారు. ఆర్జిత సేవలైన సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత తిరుకల్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలను నిలిపివేయనున్నట్లు అధికారులు చెప్పారు.(facebook)

    ఆర్టికల్ షేర్ చేయండి