తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Wpl 2024: మెరిపించిన స్మృతి మంధాన.. Rcb ఘన విజయం

WPL 2024: మెరిపించిన స్మృతి మంధాన.. RCB ఘన విజయం

27 February 2024, 23:40 IST

WPL 2024 - RCB vs GG: డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో మ్యాచ్‍లో గెలిచింది. నేడు (ఫిబ్రవరి 27) జరిగిన మ్యాచ్‍లో గుజరాత్ జెయింట్స్ టీమ్‍పై ఘన విజయం సాధించింది.

  • WPL 2024 - RCB vs GG: డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో మ్యాచ్‍లో గెలిచింది. నేడు (ఫిబ్రవరి 27) జరిగిన మ్యాచ్‍లో గుజరాత్ జెయింట్స్ టీమ్‍పై ఘన విజయం సాధించింది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 సీజన్‍లో భారత స్టార్ స్మృతి మంధాన కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి అదరగొట్టింది. బెంగళూరు వేదికగా నేడు (ఫిబ్రవరి 27) జరిగిన మ్యాచ్‍లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ జెయింట్స్ (GG) జట్టుపై ఆర్సీబీ గెలిచింది. 
(1 / 6)
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 సీజన్‍లో భారత స్టార్ స్మృతి మంధాన కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి అదరగొట్టింది. బెంగళూరు వేదికగా నేడు (ఫిబ్రవరి 27) జరిగిన మ్యాచ్‍లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ జెయింట్స్ (GG) జట్టుపై ఆర్సీబీ గెలిచింది. (PTI)
ఈ డబ్ల్యూపీఎల్ మ్యాచ్‍లో గుజరాత్‍పై 8 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. 45 బంతులను మిగిల్చి మరీ లక్ష్యాన్ని ఛేదించి భారీ విజయాన్ని దక్కించుకుంది ఆర్సీబీ.
(2 / 6)
ఈ డబ్ల్యూపీఎల్ మ్యాచ్‍లో గుజరాత్‍పై 8 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. 45 బంతులను మిగిల్చి మరీ లక్ష్యాన్ని ఛేదించి భారీ విజయాన్ని దక్కించుకుంది ఆర్సీబీ.(PTI)
ఈ మ్యాచ్‍లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‍కు దిగింది గుజరాత్. అయితే, ఆర్సీబీ బౌలర్ల విజృంభణతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 107 పరుగులే చేయగలిగింది. దయలాన్ హేమలత (31 నాటౌట్) మినహా మిగిలిన గుజరాత్ బ్యాటర్లు విఫలమయ్యారు. 
(3 / 6)
ఈ మ్యాచ్‍లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‍కు దిగింది గుజరాత్. అయితే, ఆర్సీబీ బౌలర్ల విజృంభణతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 107 పరుగులే చేయగలిగింది. దయలాన్ హేమలత (31 నాటౌట్) మినహా మిగిలిన గుజరాత్ బ్యాటర్లు విఫలమయ్యారు. (PTI)
బెంగళూరు జట్టు బౌలర్ రేణుక సింగ్ 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టారు. సోఫీ మోలినెక్స్ మూడు వికెట్లు దక్కించుకున్నారు.
(4 / 6)
బెంగళూరు జట్టు బౌలర్ రేణుక సింగ్ 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టారు. సోఫీ మోలినెక్స్ మూడు వికెట్లు దక్కించుకున్నారు.(PTI)
స్వల్ప లక్ష్యాన్ని కేవలం 12.3 ఓవర్లలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఛేదించేసింది. కెప్టెన్ స్మృతి మంధాన 27 బంతుల్లోనే 43 పరుగులతో మెరుపులు మెరిపించారు. 2 వికెట్లు కోల్పోయి 12.3 ఓవర్లలో 110 రన్స్ చేసి ఆర్సీబీ గెలిచింది. సబ్బినేని మేఘన (36 నాటౌట్), ఎలీస్ పెర్రీ (23 నాటౌట్) కూడా రాణించారు. 
(5 / 6)
స్వల్ప లక్ష్యాన్ని కేవలం 12.3 ఓవర్లలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఛేదించేసింది. కెప్టెన్ స్మృతి మంధాన 27 బంతుల్లోనే 43 పరుగులతో మెరుపులు మెరిపించారు. 2 వికెట్లు కోల్పోయి 12.3 ఓవర్లలో 110 రన్స్ చేసి ఆర్సీబీ గెలిచింది. సబ్బినేని మేఘన (36 నాటౌట్), ఎలీస్ పెర్రీ (23 నాటౌట్) కూడా రాణించారు. (PTI)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ డబ్ల్యూపీఎల్ సీజన్‍లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‍లను గెలిచింది. దీంతో ప్రస్తుతం 4 పాయింట్లతో పట్టికలో టాప్‍కు చేరింది. గుజరాత్ ఐదో స్థానానికి పడింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. రేపు (ఫిబ్రవరి 28) ముంబై, యూపీ మధ్య మ్యాచ్ జరగనుంది. 
(6 / 6)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ డబ్ల్యూపీఎల్ సీజన్‍లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‍లను గెలిచింది. దీంతో ప్రస్తుతం 4 పాయింట్లతో పట్టికలో టాప్‍కు చేరింది. గుజరాత్ ఐదో స్థానానికి పడింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. రేపు (ఫిబ్రవరి 28) ముంబై, యూపీ మధ్య మ్యాచ్ జరగనుంది. (PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి