తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Heart Health: గుండె నొప్పి లేదా కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏం చేయాలి?

Heart health: గుండె నొప్పి లేదా కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏం చేయాలి?

15 December 2023, 9:03 IST

గుండెలో నొప్పిగా అనిపించడం లేదా కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు కనిపించినప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి.

గుండెలో నొప్పిగా అనిపించడం లేదా కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు కనిపించినప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి.
ఛాతీలో నొప్పి రావడం, కార్డియాక్ అరెస్ట్  లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు. వెంటనే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ప్రాణానికే హాని కలగవచ్చు. 
(1 / 6)
ఛాతీలో నొప్పి రావడం, కార్డియాక్ అరెస్ట్  లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు. వెంటనే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ప్రాణానికే హాని కలగవచ్చు. (Shutterstock)
ఆలస్యం చేయకుండా వైద్య సహాయం కోసం ఫోన్ చేయాలి. ఆసుపత్రి దగ్గర్లోనే ఉంటే వెంటనే ఆసుపత్రికి చేరుకోవాలి. 
(2 / 6)
ఆలస్యం చేయకుండా వైద్య సహాయం కోసం ఫోన్ చేయాలి. ఆసుపత్రి దగ్గర్లోనే ఉంటే వెంటనే ఆసుపత్రికి చేరుకోవాలి. (REPRESENTATIVE PHOTO)
గుండె నొప్పివస్తుంటే గాభరా పడకండి. కూర్చుని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఒత్తిడి, భయాందోళనలు గుండె పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. 
(3 / 6)
గుండె నొప్పివస్తుంటే గాభరా పడకండి. కూర్చుని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఒత్తిడి, భయాందోళనలు గుండె పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. (Freepik)
మీ ఎదుటి వ్యక్తి గుండె పోటు కారణం స్పృహ కోల్పోయినా లేక శ్వాస తీసుకోలేక పోయినా వెంటనే సీపీఆర్ చేయండి. ఛాతీ మధ్యభాగంలో రెండు చేతులతో వేగంగా అదుముతూ ఉండాలి. 
(4 / 6)
మీ ఎదుటి వ్యక్తి గుండె పోటు కారణం స్పృహ కోల్పోయినా లేక శ్వాస తీసుకోలేక పోయినా వెంటనే సీపీఆర్ చేయండి. ఛాతీ మధ్యభాగంలో రెండు చేతులతో వేగంగా అదుముతూ ఉండాలి. (Shutterstock)
ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (AED) అందుబాటులో ఉంటే, దానిని నిర్దేశించిన విధంగా ఉపయోగించాలి. AEDలు హృదయ స్పందనను పునరుద్ధరించడానికి ఉపయోగపడతాయి.  అవసరమైతే విద్యుత్ షాక్‌లను అందిస్తాయి. 
(5 / 6)
ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (AED) అందుబాటులో ఉంటే, దానిని నిర్దేశించిన విధంగా ఉపయోగించాలి. AEDలు హృదయ స్పందనను పునరుద్ధరించడానికి ఉపయోగపడతాయి.  అవసరమైతే విద్యుత్ షాక్‌లను అందిస్తాయి. (Freepik)
ప్రతి ఛాతీ నొప్పి... గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్‌ కాకపోవచ్చు. ఛాతీ నొప్పికి ఇతరకారణాలు కూడా ఉండవచ్చు.  కండరాల ఒత్తిడి, మానసిక ఆందోళన, అజీర్ణం వంటి కారణాల వల్ల కూడా ఈ నొప్పి రావచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఛాతీ నొప్పిని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. వెంటనే వైద్య సహాయం తీసుకోవడం మంచిది.
(6 / 6)
ప్రతి ఛాతీ నొప్పి... గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్‌ కాకపోవచ్చు. ఛాతీ నొప్పికి ఇతరకారణాలు కూడా ఉండవచ్చు.  కండరాల ఒత్తిడి, మానసిక ఆందోళన, అజీర్ణం వంటి కారణాల వల్ల కూడా ఈ నొప్పి రావచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఛాతీ నొప్పిని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. వెంటనే వైద్య సహాయం తీసుకోవడం మంచిది.(Image by InspiredImages from Pixabay )

    ఆర్టికల్ షేర్ చేయండి