తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Watermelon For Skin Care: వేసవిలో చర్మం మెరవాలా? అయితే పుచ్చకాయను ఉపయోగించండిలా!

Watermelon for skin care: వేసవిలో చర్మం మెరవాలా? అయితే పుచ్చకాయను ఉపయోగించండిలా!

19 May 2023, 16:25 IST

Skin Care With Watermelon: సహజమైన చర్మ సంరక్షణ కోసం మనం రకరకాల పదార్థాలను ఉపయోగిస్తాం. ఎప్పుడైనా పుచ్చకాయ ఉపయోగించి చూశారా? ఈ వేసవిలో పుచ్చకాయ మీ చర్మాన్ని సంరక్షిస్తుంది. పుచ్చకాయ చర్మానికి ఎలా మేలు చేస్తుందో చూడండి..

  • Skin Care With Watermelon: సహజమైన చర్మ సంరక్షణ కోసం మనం రకరకాల పదార్థాలను ఉపయోగిస్తాం. ఎప్పుడైనా పుచ్చకాయ ఉపయోగించి చూశారా? ఈ వేసవిలో పుచ్చకాయ మీ చర్మాన్ని సంరక్షిస్తుంది. పుచ్చకాయ చర్మానికి ఎలా మేలు చేస్తుందో చూడండి..
 వేసవిలో పుచ్చకాయ విరివిగా లభించే పండు. ఇది తింటే రుచిగా ఉండటమే కాకుండా మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.  మీ చర్మాన్ని కూడా పుచ్చకాయ సంరక్షిస్తుంది. ఎలాగో చూడండి. 
(1 / 5)
 వేసవిలో పుచ్చకాయ విరివిగా లభించే పండు. ఇది తింటే రుచిగా ఉండటమే కాకుండా మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.  మీ చర్మాన్ని కూడా పుచ్చకాయ సంరక్షిస్తుంది. ఎలాగో చూడండి. (Freepik)
పుచ్చకాయ స్క్రబ్: ఒక గిన్నెలో చక్కెర, కొబ్బరి నూనె,  పుచ్చకాయ రసం కలపండి. ఇప్పుడు ఈ స్క్రబ్‌ని ముఖంపై వృత్తాకారంలో కాసేపు మసాజ్ చేయండి. కొన్ని నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే చర్మం మెరుస్తుంది. 
(2 / 5)
పుచ్చకాయ స్క్రబ్: ఒక గిన్నెలో చక్కెర, కొబ్బరి నూనె,  పుచ్చకాయ రసం కలపండి. ఇప్పుడు ఈ స్క్రబ్‌ని ముఖంపై వృత్తాకారంలో కాసేపు మసాజ్ చేయండి. కొన్ని నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే చర్మం మెరుస్తుంది. (Freepik)
పుచ్చకాయ ఫేషియల్ మిస్ట్: పుచ్చకాయ ఫేషియల్ మిస్ట్ సిద్ధం చేయడానికి, ముందుగా మిక్సర్‌లో కొన్ని పుచ్చకాయ ముక్కలను తీసుకోండి. ఇప్పుడు బాగా బ్లెండ్ చేసి రసాన్ని వడకట్టి స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఈ సీసాని ఫ్రిజ్‌లో ఉంచి కాస్త చల్లబరచండి.   ఈ మిశ్రమాన్ని మీకు కావలసినపుడు మీ చర్మానికి ఫేషియల్ లాగా ఉపయోగించవచ్చు. 
(3 / 5)
పుచ్చకాయ ఫేషియల్ మిస్ట్: పుచ్చకాయ ఫేషియల్ మిస్ట్ సిద్ధం చేయడానికి, ముందుగా మిక్సర్‌లో కొన్ని పుచ్చకాయ ముక్కలను తీసుకోండి. ఇప్పుడు బాగా బ్లెండ్ చేసి రసాన్ని వడకట్టి స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఈ సీసాని ఫ్రిజ్‌లో ఉంచి కాస్త చల్లబరచండి.   ఈ మిశ్రమాన్ని మీకు కావలసినపుడు మీ చర్మానికి ఫేషియల్ లాగా ఉపయోగించవచ్చు. (Freepik)
పుచ్చకాయ లిప్ స్క్రబ్: పుచ్చకాయలోని అమైనో ఆమ్లాలు పెదాలను హైడ్రేట్ గా , మృదువుగా  చేయడంలో సహాయపడతాయి. కొబ్బరి నూనెతో పుచ్చకాయ రసాన్ని మిక్స్ చేసి మీ పెదాలను స్క్రబ్ చేయండి. కొంత సమయం తర్వాత గోరువెచ్చని నీటితో పెదాలను కడగాలి. 
(4 / 5)
పుచ్చకాయ లిప్ స్క్రబ్: పుచ్చకాయలోని అమైనో ఆమ్లాలు పెదాలను హైడ్రేట్ గా , మృదువుగా  చేయడంలో సహాయపడతాయి. కొబ్బరి నూనెతో పుచ్చకాయ రసాన్ని మిక్స్ చేసి మీ పెదాలను స్క్రబ్ చేయండి. కొంత సమయం తర్వాత గోరువెచ్చని నీటితో పెదాలను కడగాలి. (Freepik)
ఫేస్ మాస్క్: పుచ్చకాయ ఫేస్ మాస్క్ చర్మ సంరక్షణకు  ప్రభావవంతంగా ఉంటుంది. మిక్సీలో కొన్ని పుచ్చకాయ ముక్కలను కలపండి. అందులో తేనె, పెరుగు వేసి మిక్స్ చేయండి. ఆపైన ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత నీళ్లతో కడిగేస్తే చర్మం మెరుస్తుంది.
(5 / 5)
ఫేస్ మాస్క్: పుచ్చకాయ ఫేస్ మాస్క్ చర్మ సంరక్షణకు  ప్రభావవంతంగా ఉంటుంది. మిక్సీలో కొన్ని పుచ్చకాయ ముక్కలను కలపండి. అందులో తేనె, పెరుగు వేసి మిక్స్ చేయండి. ఆపైన ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత నీళ్లతో కడిగేస్తే చర్మం మెరుస్తుంది.(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి