తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Vidya Balan: పోర్న్ సినిమాలు చూస్తారా.. డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యా బాలన్ సమాధానం ఇదే!

Vidya Balan: పోర్న్ సినిమాలు చూస్తారా.. డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యా బాలన్ సమాధానం ఇదే!

27 April 2024, 15:02 IST

Vidya Balan About Porn Movies: డర్టీ పిక్చర్ సినిమాతో హిందీలోనే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ విద్యా బాలన్. ఇటీవల ఆమె నటించిమ దో ఔర్ దో ప్యార్ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఊహించని సమాధానాలు ఇచ్చింది.

Vidya Balan About Porn Movies: డర్టీ పిక్చర్ సినిమాతో హిందీలోనే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ విద్యా బాలన్. ఇటీవల ఆమె నటించిమ దో ఔర్ దో ప్యార్ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఊహించని సమాధానాలు ఇచ్చింది.
ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించిన లేటెస్ట్ మూవీ 'దో ఔర్ దో ప్యార్'. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది విద్యా బాలన్. 
(1 / 5)
ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించిన లేటెస్ట్ మూవీ 'దో ఔర్ దో ప్యార్'. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది విద్యా బాలన్. (Instagram/@who_wore_what_when)
విద్యా, ప్రతీక్ ఇటీవల అన్ ఫిల్టర్డ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మీరు సినిమాలు చూస్తారా?' అని అడగ్గా, దానికి విద్యా ఇచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది.
(2 / 5)
విద్యా, ప్రతీక్ ఇటీవల అన్ ఫిల్టర్డ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మీరు సినిమాలు చూస్తారా?' అని అడగ్గా, దానికి విద్యా ఇచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది.(Instagram/@who_wore_what_when)
"నిజం చెప్పాలంటే, నేను ఎప్పుడూ ఆ పోర్న్ కాన్సెప్ట్ అర్థం చేసుకోలేకపోయాను. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల శారీరక సంబంధాలను చూడటం నాకు ఇష్టం లేదు, నేను దానిని చూడటానికి అస్సలు ఇష్టపడను. సినిమాలో ఒక సన్నివేశం ఉంటే, సున్నితమైన రీతిలో షూట్ చేస్తే, ఆ సన్నివేశం వెనుక మంచి కథ ఉంటే, దాన్ని చూడటానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు" అని విద్యా బాలన్ తెలిపింది. 
(3 / 5)
"నిజం చెప్పాలంటే, నేను ఎప్పుడూ ఆ పోర్న్ కాన్సెప్ట్ అర్థం చేసుకోలేకపోయాను. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల శారీరక సంబంధాలను చూడటం నాకు ఇష్టం లేదు, నేను దానిని చూడటానికి అస్సలు ఇష్టపడను. సినిమాలో ఒక సన్నివేశం ఉంటే, సున్నితమైన రీతిలో షూట్ చేస్తే, ఆ సన్నివేశం వెనుక మంచి కథ ఉంటే, దాన్ని చూడటానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు" అని విద్యా బాలన్ తెలిపింది. (Instagram/@who_wore_what_when)
"ఇలాంటి సినిమాల్లో మహిళలను మాత్రమే ఒక శారీరక వస్తవులా చిత్రీకరిస్తారని నేను చూసిన సన్నివేశాలను బట్టి నాకు అనిపించింది. కథ లేదు, సెక్స్ మాత్రమే. కాబట్టి, ఇలాంటి సన్నివేశాలను చూస్తూ నేను ఎప్పటికీ మాములుగా ఉండలేను. అందుకే చూడటం నాకు ఇష్టం లేదు" అని విద్యా పేర్కొంది. 
(4 / 5)
"ఇలాంటి సినిమాల్లో మహిళలను మాత్రమే ఒక శారీరక వస్తవులా చిత్రీకరిస్తారని నేను చూసిన సన్నివేశాలను బట్టి నాకు అనిపించింది. కథ లేదు, సెక్స్ మాత్రమే. కాబట్టి, ఇలాంటి సన్నివేశాలను చూస్తూ నేను ఎప్పటికీ మాములుగా ఉండలేను. అందుకే చూడటం నాకు ఇష్టం లేదు" అని విద్యా పేర్కొంది. (Instagram/@who_wore_what_when)
ఇకపోతే విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్'లో సిల్క్ స్మిత పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో బోల్డ్ సీన్స్ చాలానే ఉన్నాయి. కాబట్టి, ఆమెను తరచూ సెక్స్, పోర్న్ సినిమాల గురించి అడుగుతున్నట్లు తెలుస్తోంది. 
(5 / 5)
ఇకపోతే విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్'లో సిల్క్ స్మిత పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో బోల్డ్ సీన్స్ చాలానే ఉన్నాయి. కాబట్టి, ఆమెను తరచూ సెక్స్, పోర్న్ సినిమాల గురించి అడుగుతున్నట్లు తెలుస్తోంది. (Instagram/@who_wore_what_when)

    ఆర్టికల్ షేర్ చేయండి