తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ts Dsc Exams 2024 : డీఎస్సీ అభ్యర్థులకు టీ-శాట్ గుడ్ న్యూస్ ...మీకోసమే ఈ ప్రత్యేక తరగతులు, వివరాలివే

TS DSC Exams 2024 : డీఎస్సీ అభ్యర్థులకు టీ-శాట్ గుడ్ న్యూస్ ...మీకోసమే ఈ ప్రత్యేక తరగతులు, వివరాలివే

18 April 2024, 22:31 IST

TS DSC Exams 2024 Updates : తెలంగాణలో డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నవారికి టీ- శాట్ గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యర్థులకు 9 రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

  • TS DSC Exams 2024 Updates : తెలంగాణలో డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నవారికి టీ- శాట్ గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యర్థులకు 9 రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది టీ- శాట్. అభ్యర్థులకు 9 రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. 
(1 / 5)
 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది టీ- శాట్. అభ్యర్థులకు 9 రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. (photo from https://unsplash.com/)
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జూలై నెలలో నిర్వహించే డీఎస్సీ పోటీ పరీక్షపై టి-సాట్ నెట్వర్క్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు నిర్వహిస్తోందని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. 
(2 / 5)
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జూలై నెలలో నిర్వహించే డీఎస్సీ పోటీ పరీక్షపై టి-సాట్ నెట్వర్క్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు నిర్వహిస్తోందని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. (photo from https://unsplash.com/)
తెలంగాణలోని వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సుమారు 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల అవగాహన కోసం స్పెషల్ లైవ్ ప్రొగ్రామ్స్ ఏర్పాటు చేసామని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. 
(3 / 5)
తెలంగాణలోని వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సుమారు 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల అవగాహన కోసం స్పెషల్ లైవ్ ప్రొగ్రామ్స్ ఏర్పాటు చేసామని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. (photo from https://unsplash.com/)
ఈ నెల 18వ తేదీ గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు గంట పాటు తొమ్మిది రోజులు నిపుణ ఛానల్ లో వివిధ సబ్జెక్టులపై ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ద్వార అవగాహన పాఠ్యాంశాలుంటాయన్నారు.
(4 / 5)
ఈ నెల 18వ తేదీ గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు గంట పాటు తొమ్మిది రోజులు నిపుణ ఛానల్ లో వివిధ సబ్జెక్టులపై ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ద్వార అవగాహన పాఠ్యాంశాలుంటాయన్నారు.
మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టులపై ప్రసారమయ్యే లైవ్ ప్రొగ్రామ్స్ మరుసటి రోజు విద్య ఛానల్ లో సాయంత్రం ఆరు గంటలకు పున: ప్రసారమౌతాయని సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు తమ తమ సందేహాలను ఫోన్ కాల్ ద్వార చర్చలో పాల్గొని అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు. డీఎస్సీ పరీక్ష పూర్తయ్యే వరకు అవగాహన పాఠ్యాంశ ప్రసారాలు కొనసాగుతాయన్నారు.
(5 / 5)
మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టులపై ప్రసారమయ్యే లైవ్ ప్రొగ్రామ్స్ మరుసటి రోజు విద్య ఛానల్ లో సాయంత్రం ఆరు గంటలకు పున: ప్రసారమౌతాయని సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు తమ తమ సందేహాలను ఫోన్ కాల్ ద్వార చర్చలో పాల్గొని అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు. డీఎస్సీ పరీక్ష పూర్తయ్యే వరకు అవగాహన పాఠ్యాంశ ప్రసారాలు కొనసాగుతాయన్నారు.(TSAT)

    ఆర్టికల్ షేర్ చేయండి