తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Travel Wishlist: ఈ నెలలో వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ లిస్ట్ మీ కోసమే..

Travel wishlist: ఈ నెలలో వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ లిస్ట్ మీ కోసమే..

04 October 2023, 16:53 IST

Travel wishlist: అక్టోబర్ నెలలో, ముఖ్యంగా దసరా సెలవుల్లో చాలా మంది ఏదో ఒక కొత్త ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. వారి కోసమే ఈ లిస్ట్. భారత దేశంలో ఈ అక్టోబర్ నెలలో పర్యటించాల్సిన ప్రదేశాల లిస్ట్ ఇది..

Travel wishlist: అక్టోబర్ నెలలో, ముఖ్యంగా దసరా సెలవుల్లో చాలా మంది ఏదో ఒక కొత్త ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. వారి కోసమే ఈ లిస్ట్. భారత దేశంలో ఈ అక్టోబర్ నెలలో పర్యటించాల్సిన ప్రదేశాల లిస్ట్ ఇది..
ఈ నెలలో వెకేషన్ కు ప్లాన్ చేస్తే, ఈ ప్రదేశాల్లో ఏదో ఒకదానిని మీ ట్రావెల్ ప్లాన్ లో భాగం చేసుకోండి. మీ ట్రిప్ మెమొరబుల్ గా ఉంటుంది.
(1 / 8)
ఈ నెలలో వెకేషన్ కు ప్లాన్ చేస్తే, ఈ ప్రదేశాల్లో ఏదో ఒకదానిని మీ ట్రావెల్ ప్లాన్ లో భాగం చేసుకోండి. మీ ట్రిప్ మెమొరబుల్ గా ఉంటుంది.(Unsplash)
కశ్మీర్: భారత్ లో కచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం. పైన మంచు పర్వతాలు, కింద ఆకుపచ్చని లోయలతో భూతల స్వర్గంగా పేరున్న కశ్మర్ ను అక్టోబర్ నెలలో చూడవచ్చు. 
(2 / 8)
కశ్మీర్: భారత్ లో కచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం. పైన మంచు పర్వతాలు, కింద ఆకుపచ్చని లోయలతో భూతల స్వర్గంగా పేరున్న కశ్మర్ ను అక్టోబర్ నెలలో చూడవచ్చు. (Pixabay)
హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కాంగ్రా లోయలో ఉన్న చిన్న గ్రామం బిర్ బిలింగ్. ఇది అక్టోబర్ లో కచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం. పారా గ్లైడింగ్ ఇక్కడ చాలా ఫేమస్. అది అక్టోబర్ నెలలోనే ప్రారంభమవుతుందిద. 
(3 / 8)
హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కాంగ్రా లోయలో ఉన్న చిన్న గ్రామం బిర్ బిలింగ్. ఇది అక్టోబర్ లో కచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం. పారా గ్లైడింగ్ ఇక్కడ చాలా ఫేమస్. అది అక్టోబర్ నెలలోనే ప్రారంభమవుతుందిద. (Unsplash)
రిషికేష్: అక్టోబర్ నెలలో ప్లాన్ చేసుకోవాల్సి ఆధ్యాత్మిక, అడ్వెంచరస్ టూర్ రిషికేష్. ఇక్కడ క్యాంపింగ్, ట్రెకింగ్, రివర్ రాఫ్టింగ్ వంటివి కచ్చితంగా ఎక్స్ పీరియన్స్ చేయాల్సినవి. రిషికేష్ ను యోగా క్యాపిటల్ అని కూడా అంటారు.
(4 / 8)
రిషికేష్: అక్టోబర్ నెలలో ప్లాన్ చేసుకోవాల్సి ఆధ్యాత్మిక, అడ్వెంచరస్ టూర్ రిషికేష్. ఇక్కడ క్యాంపింగ్, ట్రెకింగ్, రివర్ రాఫ్టింగ్ వంటివి కచ్చితంగా ఎక్స్ పీరియన్స్ చేయాల్సినవి. రిషికేష్ ను యోగా క్యాపిటల్ అని కూడా అంటారు.(pixabay)
షిల్లాంగ్: బ్రిటిషర్లు దీనిని స్కాట్ లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అనేవారు. పైనాపిల్ తోటలు ఇక్కడ ఫేమస్. ఇది సముద్ర మట్టానికి 1491 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఈశాన్య రాష్ట్రం మేఘాలయ రాజధాని ఇది.
(5 / 8)
షిల్లాంగ్: బ్రిటిషర్లు దీనిని స్కాట్ లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అనేవారు. పైనాపిల్ తోటలు ఇక్కడ ఫేమస్. ఇది సముద్ర మట్టానికి 1491 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఈశాన్య రాష్ట్రం మేఘాలయ రాజధాని ఇది.(Unsplash)
కేరళ: అక్టోబర్ నెలలో పర్యటించడానికి అనువైన ప్రదేశాల్లో కేరళ కూడా ఒకటి. బ్యాక్ వాటర్స్ లో హౌజ్ బోట్ లో గడపడం మరచిపోలేని అనుభూతిగా మిగులుతుంది. మున్నార్, వాయనాడ్, కోవలం బీచ్ వంటివి కేరళలో చూడదగ్గ ప్రాంతాలు.
(6 / 8)
కేరళ: అక్టోబర్ నెలలో పర్యటించడానికి అనువైన ప్రదేశాల్లో కేరళ కూడా ఒకటి. బ్యాక్ వాటర్స్ లో హౌజ్ బోట్ లో గడపడం మరచిపోలేని అనుభూతిగా మిగులుతుంది. మున్నార్, వాయనాడ్, కోవలం బీచ్ వంటివి కేరళలో చూడదగ్గ ప్రాంతాలు.(Unsplash)
మైసూర్: కర్నాటకలోని మైసూరులో జరిగే దసరా ఉత్సవాలను చూడడం కోసం అక్టోబర్ నెలలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. మైసూర్ ప్యాలెస్, చాముండి హిల్స్, సెయింట్ ఫెలొమినా చర్చ్.. చూడాల్సిన ప్రదేశాలు. 
(7 / 8)
మైసూర్: కర్నాటకలోని మైసూరులో జరిగే దసరా ఉత్సవాలను చూడడం కోసం అక్టోబర్ నెలలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. మైసూర్ ప్యాలెస్, చాముండి హిల్స్, సెయింట్ ఫెలొమినా చర్చ్.. చూడాల్సిన ప్రదేశాలు. (Unsplash)
గోవా: అక్టోబర్ నెలలో గోవా పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఈ నెలలో ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడి బీచ్ లు రిలాక్సేషన్ కు, వాటర్ స్పోర్ట్స్ కు, బీచ్ పార్టీలకు సూటబుల్. 
(8 / 8)
గోవా: అక్టోబర్ నెలలో గోవా పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఈ నెలలో ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడి బీచ్ లు రిలాక్సేషన్ కు, వాటర్ స్పోర్ట్స్ కు, బీచ్ పార్టీలకు సూటబుల్. (Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి