తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Top 10 Rich Indians: వీరే భారత్ లోని టాప్ 10 సంపన్నులు

Top 10 Rich Indians: వీరే భారత్ లోని టాప్ 10 సంపన్నులు

13 October 2023, 18:56 IST

Top 10 Richest Indians: హురూన్ మ్యాగజైన్ 'ది హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023' పేరుతో ఈ ఏడాది భారతదేశంలోని టాప్ 10 సంపన్నుల జాబితాను ప్రచురించింది. ఆ వివరాలు..

Top 10 Richest Indians: హురూన్ మ్యాగజైన్ 'ది హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023' పేరుతో ఈ ఏడాది భారతదేశంలోని టాప్ 10 సంపన్నుల జాబితాను ప్రచురించింది. ఆ వివరాలు..
Mukesh Ambani :రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భారతదేశపు అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 
(1 / 10)
Mukesh Ambani :రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భారతదేశపు అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. (PTI)
Gautam Adani :భారతదేశపు అత్యంత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. అదానీ గ్రూప్ పవర్ జనరేషన్, అగ్రిబిజినెస్, రియల్ ఎస్టేట్, ఓడరేవులు మరియు రక్షణ పరికరాల తయారీతో సహా వివిధ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
(2 / 10)
Gautam Adani :భారతదేశపు అత్యంత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. అదానీ గ్రూప్ పవర్ జనరేషన్, అగ్రిబిజినెస్, రియల్ ఎస్టేట్, ఓడరేవులు మరియు రక్షణ పరికరాల తయారీతో సహా వివిధ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.(Image Credit : google/Wikimedia Commons )
Cyrus S Poonawalla : భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తల జాబితాలో వ్యాపారవేత్త సైరస్ పూనావాలా పేరు మూడవ స్థానంలో ఉంది. పూనావాలా పూణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు.
(3 / 10)
Cyrus S Poonawalla : భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తల జాబితాలో వ్యాపారవేత్త సైరస్ పూనావాలా పేరు మూడవ స్థానంలో ఉంది. పూనావాలా పూణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు.(Image Credit: google/Wikimedia Commons)
Shiv Nadar : HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, వ్యాపారవేత్త శివ్ నాడార్ భారతదేశంలో నాల్గవ సంపన్న వ్యాపారవేత్త. HCL టెక్నాలజీస్ భారతదేశ సమాచార సాంకేతిక (IT) పరిశ్రమకు గణనీయమైన కృషి చేసింది. ఆ సంస్థ అనేక అవార్డులను గెలుచుకుంది.
(4 / 10)
Shiv Nadar : HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, వ్యాపారవేత్త శివ్ నాడార్ భారతదేశంలో నాల్గవ సంపన్న వ్యాపారవేత్త. HCL టెక్నాలజీస్ భారతదేశ సమాచార సాంకేతిక (IT) పరిశ్రమకు గణనీయమైన కృషి చేసింది. ఆ సంస్థ అనేక అవార్డులను గెలుచుకుంది.(Image Credit: google/Wikimedia Commons )
Gopichand Hinduja : టాప్ 10 సంపన్నుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన గోపీచంద్ హిందూజా భారతదేశంలో జన్మించిన బ్రిటీష్ బిలియనీర్ వ్యాపారవేత్త, అతను భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిందూజా గ్రూప్‌ నకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
(5 / 10)

Dilip Shanghvi : సన్ ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ ఒక భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త. దేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో 6వ స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మాస్యూటికల్స్ భారతదేశంలో అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ, అలాగే, ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఫార్మా సంస్థ.
(6 / 10)

Lakshmi Mittal : ప్రపంచంలోనే అగ్రగామి ఉక్కు తయారీ సంస్థ ఆర్సెలార్ కు లక్ష్మి మిట్టల్ చైర్మన్ మరియు CEO గా ఉన్నారు.  లక్ష్మీ మిట్టల్ భారతీయ సంపన్నుల జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. మిట్టల్ బ్రిటన్‌లో నివసిస్తున్నారు.
(7 / 10)
Lakshmi Mittal : ప్రపంచంలోనే అగ్రగామి ఉక్కు తయారీ సంస్థ ఆర్సెలార్ కు లక్ష్మి మిట్టల్ చైర్మన్ మరియు CEO గా ఉన్నారు.  లక్ష్మీ మిట్టల్ భారతీయ సంపన్నుల జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. మిట్టల్ బ్రిటన్‌లో నివసిస్తున్నారు.(REUTERS)
Radhakishan Damani రాధాకిషన్ దమానీ భారతీయ బిలియనీర్ ఇన్వెస్టర్, వ్యాపారవేత్త, డీ మార్ట్ సూపర్ మార్కెట్ లను నిర్వహించే  అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు. భారతీయ సంపన్నుల జాబితాలో రాధాకిషన్ దమానీది 8వ స్థానం.
(8 / 10)

Kumar Mangalam Birla : ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఆదిత్య బిర్లా గ్రూప్ టెలికమ్యూనికేషన్స్, సిమెంట్ తయారీ, రసాయన పరిశ్రమ, టెక్స్‌టైల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు టెలికమ్యూనికేషన్స్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
(9 / 10)
Kumar Mangalam Birla : ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఆదిత్య బిర్లా గ్రూప్ టెలికమ్యూనికేషన్స్, సిమెంట్ తయారీ, రసాయన పరిశ్రమ, టెక్స్‌టైల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు టెలికమ్యూనికేషన్స్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.(Image Credit: google/Wikimedia Commons)
Niraj Bajaj :వ్యాపారవేత్త నీరజ్ బజాజ్ ముకంద్ ఇండస్ట్రీస్ కు చైర్మన్ గా ఉన్నారు. అతను బజాజ్ గ్రూప్ డైరెక్టర్ల బోర్డులో ఒకరు. ముకంద్ కంపెనీ వివిధ ఉత్పత్తులను ప్రధానంగా ఇనుముతో తయారు చేస్తుంది. నీరజ్ బజాజ్ హరూన్ సంపన్నుల జాబితాలో 10 వ స్థానంలో నిలిచారు.
(10 / 10)

    ఆర్టికల్ షేర్ చేయండి