తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Nasa Pictures: క్రాబ్ నెబ్యూలా, ఆండ్రోమీడా గెలాక్సీ.. ఇవేంటో చూడండి..

NASA Pictures: క్రాబ్ నెబ్యూలా, ఆండ్రోమీడా గెలాక్సీ.. ఇవేంటో చూడండి..

24 March 2023, 17:22 IST

NASA Pictures: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్ట్రో ఫొటోగ్రాఫర్స్ తీసిన అద్భుతమైన ఫొటోలను నాసా (NASA) పబ్లిష్ చేస్తుంటుంది. ఈ వారం నాసా (NASA) ఎంపిక చేసిన ఫొటోలు ఇవి..

NASA Pictures: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్ట్రో ఫొటోగ్రాఫర్స్ తీసిన అద్భుతమైన ఫొటోలను నాసా (NASA) పబ్లిష్ చేస్తుంటుంది. ఈ వారం నాసా (NASA) ఎంపిక చేసిన ఫొటోలు ఇవి..
M1 Crab Nebula - ఇది ఎం1 క్రాబ్ నెబ్యులా (Messier 1 Crab Nebula) . దీన్ని మొదట చైనా ఆస్ట్రానమర్స్ 1054 వ సంవత్సరంలో కనిపెట్టారు. ఇది భూమికి 6500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సూపర్ నోవా విస్ఫోటనం వల్ల ఇది ఏర్పడిందని భావిస్తారు. 
(1 / 5)
M1 Crab Nebula - ఇది ఎం1 క్రాబ్ నెబ్యులా (Messier 1 Crab Nebula) . దీన్ని మొదట చైనా ఆస్ట్రానమర్స్ 1054 వ సంవత్సరంలో కనిపెట్టారు. ఇది భూమికి 6500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సూపర్ నోవా విస్ఫోటనం వల్ల ఇది ఏర్పడిందని భావిస్తారు. (NASA/Detlef Hartmann)
Dark Nebulae and the Taurus Molecular Cloud - టారస్ మాలిక్యలార్ క్లౌడ్ (TMC) లోని నక్షత్రాలు, డార్క్ నెబ్యూలే ఉన్న చిత్రం ఇది. భూమికి 400 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మన సౌర వ్యవస్థకు అత్యంత సమీపంలో ఈ టారస్ మాలిక్యలార్ క్లౌడ్ (TMC)  ఉంది.
(2 / 5)
Dark Nebulae and the Taurus Molecular Cloud - టారస్ మాలిక్యలార్ క్లౌడ్ (TMC) లోని నక్షత్రాలు, డార్క్ నెబ్యూలే ఉన్న చిత్రం ఇది. భూమికి 400 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మన సౌర వ్యవస్థకు అత్యంత సమీపంలో ఈ టారస్ మాలిక్యలార్ క్లౌడ్ (TMC)  ఉంది.(NASA/Vikas Chander)
The Andromeda Galaxy: ఆండ్రొమీడా గెలాక్సీ. ఇది మన పాల పుంత (Milky Way Galaxy) కన్నా రెండు రెట్లు పెద్దగా ఉంటుంది. దీని విస్తీర్ణం సుమారు 2.6 లక్షల కాంతి సంవత్సరాలు. అలాగే, ఇందులో సుమారు లక్ష కోట్ల నక్షత్రాలు ఉంటాయి. 
(3 / 5)
The Andromeda Galaxy: ఆండ్రొమీడా గెలాక్సీ. ఇది మన పాల పుంత (Milky Way Galaxy) కన్నా రెండు రెట్లు పెద్దగా ఉంటుంది. దీని విస్తీర్ణం సుమారు 2.6 లక్షల కాంతి సంవత్సరాలు. అలాగే, ఇందులో సుమారు లక్ష కోట్ల నక్షత్రాలు ఉంటాయి. (NASA/Abdullah Al-Harbi)
Spiral Galaxy NGC 2841 : ఇది స్పైరల్ గెలాక్సీ. దీన్ని NGC 2841 అని కూడా అంటారు. ఇది 4.6 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో, ఉర్సా మేజర్ (Ursa Major) అనే గ్రహ కూటమిలో ఉంది.
(4 / 5)
Spiral Galaxy NGC 2841 : ఇది స్పైరల్ గెలాక్సీ. దీన్ని NGC 2841 అని కూడా అంటారు. ఇది 4.6 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో, ఉర్సా మేజర్ (Ursa Major) అనే గ్రహ కూటమిలో ఉంది.(NASA/Roberto Marinoni)
Comet ZTF and the stars of Milky Way- చిత్రంలో ప్రకాశవంతంగా వెలుగుతోంది జెడ్ టీ ఎఫ్ తోకచుక్క (Comet ZTF). ఇది ప్రస్తుతం భూమి నుంచి 13.3 కాంతి నిమిషాల దూరంలో ఉంది. భవిష్యత్తులో మరో 50 వేల సంవత్సరాల తరువాత మళ్లీ భూమికి దగ్గరగా వస్తుంది. 
(5 / 5)
Comet ZTF and the stars of Milky Way- చిత్రంలో ప్రకాశవంతంగా వెలుగుతోంది జెడ్ టీ ఎఫ్ తోకచుక్క (Comet ZTF). ఇది ప్రస్తుతం భూమి నుంచి 13.3 కాంతి నిమిషాల దూరంలో ఉంది. భవిష్యత్తులో మరో 50 వేల సంవత్సరాల తరువాత మళ్లీ భూమికి దగ్గరగా వస్తుంది. (NASA/Rolando Ligustri)

    ఆర్టికల్ షేర్ చేయండి