తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ts Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్, మరో 5 రోజులు వర్షాలు

TS Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్, మరో 5 రోజులు వర్షాలు

15 July 2023, 20:40 IST

TS Rains : తెలంగాణలో రాగల 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

  • TS Rains : తెలంగాణలో రాగల 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
తెలంగాణలో మరో ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 
(1 / 8)
తెలంగాణలో మరో ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. (Unsplash)
శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 
(2 / 8)
శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. (Unsplash)
ఆదివారం, సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.  
(3 / 8)
ఆదివారం, సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.  (Unsplash)
మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ  తెలిపింది. 
(4 / 8)
మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ  తెలిపింది. (Unsplash)
బుధవారం నుంచి గురువారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. 
(5 / 8)
బుధవారం నుంచి గురువారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. (Unsplash)
నిన్న ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్‌  మీద ఆవరించిన ఆవర్తనం నేడు బలహీనపడిందని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా- గ్యాంగ్‌టక్‌ పశ్చిమ బెంగాల్‌ తీరాల్లో సముద్రమట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు ఆవర్తనం ఏర్పడింది. ఆవర్తనం ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశవైపుగా వంగి ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు.
(6 / 8)
నిన్న ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్‌  మీద ఆవరించిన ఆవర్తనం నేడు బలహీనపడిందని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా- గ్యాంగ్‌టక్‌ పశ్చిమ బెంగాల్‌ తీరాల్లో సముద్రమట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు ఆవర్తనం ఏర్పడింది. ఆవర్తనం ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశవైపుగా వంగి ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు.(Unsplash)
 ఈ ఆవర్తనం రాగల రెండు, మూడు రోజుల్లో  పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర ఒడిశా పరిసరాల్లోని గ్యాంగ్‌టక్‌, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్  మీదగా వెళ్లే విస్తరించే అవకాశం ఉందన్నారు. 
(7 / 8)
 ఈ ఆవర్తనం రాగల రెండు, మూడు రోజుల్లో  పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర ఒడిశా పరిసరాల్లోని గ్యాంగ్‌టక్‌, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్  మీదగా వెళ్లే విస్తరించే అవకాశం ఉందన్నారు. (Unsplash)
మరో ఆవర్తనం వాయవ్య బంగాళాఖాతంలో ఈనెల 18న ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ వైపు నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్నాయని తెలిపారు.  
(8 / 8)
మరో ఆవర్తనం వాయవ్య బంగాళాఖాతంలో ఈనెల 18న ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ వైపు నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్నాయని తెలిపారు.  (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి