తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Wtc Points Table: టాప్ నుంచి ఐదో స్థానానికి పడిపోయిన టీమిండియా

WTC Points Table: టాప్ నుంచి ఐదో స్థానానికి పడిపోయిన టీమిండియా

29 December 2023, 8:13 IST

WTC Points Table: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో మూడు రోజుల్లోనే టీమిండియా చేతులెత్తేసిన తర్వాత డబ్ల్యూటీసీ టేబుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇండియన్ టీమ్ తన టాప్ స్పాట్ కోల్పోయింది.

  • WTC Points Table: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో మూడు రోజుల్లోనే టీమిండియా చేతులెత్తేసిన తర్వాత డబ్ల్యూటీసీ టేబుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇండియన్ టీమ్ తన టాప్ స్పాట్ కోల్పోయింది.
WTC Points Table: ఆస్ట్రేలియా చేతుల్లో పాకిస్థాన్ తొలి టెస్టులో ఓడిన తర్వాత ఇండియా డబ్ల్యూటీసీ టేబుల్లో టాప్ లో కొనసాగింది. అయితే సౌతాఫ్రికా చేతుల్లో ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగులతో ఓడిపోవడంతో ఆ స్థానం కోల్పోయింది.
(1 / 7)
WTC Points Table: ఆస్ట్రేలియా చేతుల్లో పాకిస్థాన్ తొలి టెస్టులో ఓడిన తర్వాత ఇండియా డబ్ల్యూటీసీ టేబుల్లో టాప్ లో కొనసాగింది. అయితే సౌతాఫ్రికా చేతుల్లో ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగులతో ఓడిపోవడంతో ఆ స్థానం కోల్పోయింది.(Reuters)
WTC Points Table: సౌతాఫ్రికాతో ఓడిన తర్వాత ఇండియా విజయాల శాతం 44.44కు పడిపోయింది. ఈ కొత్త డబ్ల్యూటీసీ సైకిల్లో ఇండియా మూడు టెస్టుల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. మరొకటి డ్రా అయింది. దీంతో 16 పాయింట్లతో ఐదో స్థానానికి దిగజారింది.
(2 / 7)
WTC Points Table: సౌతాఫ్రికాతో ఓడిన తర్వాత ఇండియా విజయాల శాతం 44.44కు పడిపోయింది. ఈ కొత్త డబ్ల్యూటీసీ సైకిల్లో ఇండియా మూడు టెస్టుల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. మరొకటి డ్రా అయింది. దీంతో 16 పాయింట్లతో ఐదో స్థానానికి దిగజారింది.(PTI)
WTC Points Table: ఈ సైకిల్లో తొలి టెస్ట్ ఆడిన సౌతాఫ్రికా భారీ విజయంతో టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లడం విశేషం. ఇండియాను ఓడించిన తర్వాత 12 పాయింట్లు, 100 శాతం విజయాల రేటుతో సఫారీలు టాప్ లోకి వెళ్లారు.  
(3 / 7)
WTC Points Table: ఈ సైకిల్లో తొలి టెస్ట్ ఆడిన సౌతాఫ్రికా భారీ విజయంతో టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లడం విశేషం. ఇండియాను ఓడించిన తర్వాత 12 పాయింట్లు, 100 శాతం విజయాల రేటుతో సఫారీలు టాప్ లోకి వెళ్లారు.  (AFP)
WTC Points Table: పాకిస్థాన్ టీమ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ టీమ్ 3 మ్యాచ్ లలో 2 గెలిచి 61.1 శాతం విజయాలతో 22 పాయింట్లు సాధించింది. 
(4 / 7)
WTC Points Table: పాకిస్థాన్ టీమ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ టీమ్ 3 మ్యాచ్ లలో 2 గెలిచి 61.1 శాతం విజయాలతో 22 పాయింట్లు సాధించింది. (AFP)
WTC Points Table: న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. ఆ టీమ్ రెండు టెస్టులలో ఒకటి గెలిచి, మరొకటి ఓడింది. విజయాల శాతం 50 కాగా.. 12 పాయింట్లు ఉన్నాయి.
(5 / 7)
WTC Points Table: న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. ఆ టీమ్ రెండు టెస్టులలో ఒకటి గెలిచి, మరొకటి ఓడింది. విజయాల శాతం 50 కాగా.. 12 పాయింట్లు ఉన్నాయి.(AP)
WTC Points Table: బంగ్లాదేశ్ కూడా న్యూజిలాండ్ లాగే 2 మ్యాచ్ లలో ఒకటి గెలిచి మరొకటి ఓడింది. 12 పాయింట్లు, 50 శాతం విజయాలతో నాలుగో స్థానంలో ఉంది.
(6 / 7)
WTC Points Table: బంగ్లాదేశ్ కూడా న్యూజిలాండ్ లాగే 2 మ్యాచ్ లలో ఒకటి గెలిచి మరొకటి ఓడింది. 12 పాయింట్లు, 50 శాతం విజయాలతో నాలుగో స్థానంలో ఉంది.(AFP)
WTC Points Table: ఆస్ట్రేలియా ఆరో స్థానంలో ఉంది. ఆ టీమ్ దగ్గర 30 పాయింట్లు ఉన్నా.. విజయాల శాతం 41.67గానే ఉంది.
(7 / 7)
WTC Points Table: ఆస్ట్రేలియా ఆరో స్థానంలో ఉంది. ఆ టీమ్ దగ్గర 30 పాయింట్లు ఉన్నా.. విజయాల శాతం 41.67గానే ఉంది.(AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి