తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hair Care: మీ జుట్టును నల్లగా, ఒత్తుగా మార్చే మ్యాజిక్.. ఈ ఆయుర్వేద ఔషధం..

Hair Care: మీ జుట్టును నల్లగా, ఒత్తుగా మార్చే మ్యాజిక్.. ఈ ఆయుర్వేద ఔషధం..

06 December 2023, 18:28 IST

Hair Mask: మీ జుట్టు ఒత్తుగా, నల్లగా చేయడానికి మీరు ఇంట్లోనే కరివేపాకుతో హెయిర్ మాస్క్‌ని తయారు చేసుకుని, ఉపయోగించవచ్చు.

  • Hair Mask: మీ జుట్టు ఒత్తుగా, నల్లగా చేయడానికి మీరు ఇంట్లోనే కరివేపాకుతో హెయిర్ మాస్క్‌ని తయారు చేసుకుని, ఉపయోగించవచ్చు.
వయస్సు పైబడిన తరువాత జుట్టు తెల్లబడితే పర్లేదు. కానీ, చాలా మందిలో వివిధ కారణాల వల్ల చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతోంది. వారికోసమే ఇది..
(1 / 5)
వయస్సు పైబడిన తరువాత జుట్టు తెల్లబడితే పర్లేదు. కానీ, చాలా మందిలో వివిధ కారణాల వల్ల చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతోంది. వారికోసమే ఇది..
 ఒక బాణలిలో 2 టీస్పూన్ల కొబ్బరి నూనెను తీసుకుని కొద్దిగా వేడి చేయండి. మంటను ఆపివేసి, అందులో 10, 12 కరివేపాకులను వేయండి. ఆ నూనెను 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. కాస్త చల్లారిన తర్వాత ఆ నూనెను జుట్టుకు పట్టించాలి. ఆ తరువాత 45 నిమిషాల నుంచి 2 గంటల వరకు వదిలివేయండి. తర్వాత తల స్నానం చేయండి. ఇలా వారానికి 2 సార్లు చేయండి.
(2 / 5)
 ఒక బాణలిలో 2 టీస్పూన్ల కొబ్బరి నూనెను తీసుకుని కొద్దిగా వేడి చేయండి. మంటను ఆపివేసి, అందులో 10, 12 కరివేపాకులను వేయండి. ఆ నూనెను 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. కాస్త చల్లారిన తర్వాత ఆ నూనెను జుట్టుకు పట్టించాలి. ఆ తరువాత 45 నిమిషాల నుంచి 2 గంటల వరకు వదిలివేయండి. తర్వాత తల స్నానం చేయండి. ఇలా వారానికి 2 సార్లు చేయండి.(Freepik)
పెరుగు, కరివేపాకు మాస్క్- 1/4 కప్పు కరివేపాకు, అర కప్పు పెరుగు తీసుకోండి. బాగా కలపండి. ఆ తరువాత దానిని గ్రైండ్ చేసి, పేస్ట్ లా చేయండి. ఆ పేస్ట్ ను మీ తలపై అప్లై చేసి, 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఇలా వారానికి 3 సార్లు చేయండి. 
(3 / 5)
పెరుగు, కరివేపాకు మాస్క్- 1/4 కప్పు కరివేపాకు, అర కప్పు పెరుగు తీసుకోండి. బాగా కలపండి. ఆ తరువాత దానిని గ్రైండ్ చేసి, పేస్ట్ లా చేయండి. ఆ పేస్ట్ ను మీ తలపై అప్లై చేసి, 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఇలా వారానికి 3 సార్లు చేయండి. (Freepik)
2 కప్పుల నీటిని వేడి చేసి అందులో 15 నుండి 20 కరివేపాకులను వేయాలి. ఆ నీటిని బాగా మరగబెట్టాలి. ఆ తరువాత ఆ నీటిని చల్లారనివ్వాలి. తల స్నానం చేసిన తరువాత, ఈ కరివేపాకు నీటిని తలకు బాగా పట్టించాలి. కాసేపయ్యాక తలను శుభ్రంగా తుడుచుకోవాలి.
(4 / 5)

వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా మారడానికి కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఈ ఆకును వంటలో ఉపయోగిస్తారు. అయితే, కరివేపాకును జుట్టుకు కూడా ఉపయోగించవచ్చు. కరివేపాకులో ఉండే విటమిన్ బి, బీటా కెరోటిన్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. చాలా సింపుల్ గా ఇంట్లో తయారుచేసిన కరివేపాకు మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు పాత నలుపు రంగు వస్తుంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి