తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sikkim Flash Flood: సిక్కింలో వరద బీభత్సం.. 14 మంది మృతి

Sikkim Flash Flood: సిక్కింలో వరద బీభత్సం.. 14 మంది మృతి

05 October 2023, 14:30 IST

Sikkim Flash Flood: ఆకస్మిక వరదలు సిక్కింను విషాదంలో ముంచెత్తాయి. ఎగువ నుంచి ఒక్కసారిగా వరద నీరు రావడంతో తీస్తా నది ఉప్పొంగి తీర ప్రాంతాలను ముంచెత్తింది.

Sikkim Flash Flood: ఆకస్మిక వరదలు సిక్కింను విషాదంలో ముంచెత్తాయి. ఎగువ నుంచి ఒక్కసారిగా వరద నీరు రావడంతో తీస్తా నది ఉప్పొంగి తీర ప్రాంతాలను ముంచెత్తింది.
సిక్కిం ఆకస్మిక వరదల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. గల్లంతైన వారిలో 22 మంది సైనిక సిబ్బంది కూడా ఉన్నారు.
(1 / 7)
సిక్కిం ఆకస్మిక వరదల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. గల్లంతైన వారిలో 22 మంది సైనిక సిబ్బంది కూడా ఉన్నారు.(AFP)
ఇప్పటివరుక 2 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిక్కిం ఆకస్మిక వరదల ప్రభావం సుమారు 22 వేల మందిపై పడింది.
(2 / 7)
ఇప్పటివరుక 2 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిక్కిం ఆకస్మిక వరదల ప్రభావం సుమారు 22 వేల మందిపై పడింది.(AFP)
సిక్కింలో ఒక ఇంటిని చుట్టుముట్టిన వరద నీరు. వరద కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
(3 / 7)
సిక్కింలో ఒక ఇంటిని చుట్టుముట్టిన వరద నీరు. వరద కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.(AFP)
సిక్కింలో వరద నీటిలో చిక్కుకున్న జనావాస ప్రాంతం. వరదల వల్ల తీస్తానది పై నిర్మించిన 11 వంతెనలు ధ్వంసమయ్యాయి. వాటిలో 8 బ్రిడ్జీలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
(4 / 7)
సిక్కింలో వరద నీటిలో చిక్కుకున్న జనావాస ప్రాంతం. వరదల వల్ల తీస్తానది పై నిర్మించిన 11 వంతెనలు ధ్వంసమయ్యాయి. వాటిలో 8 బ్రిడ్జీలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.(PTI)
బాధితులను సహాయ కేంద్రాలకు తరలిస్తున్న సిబ్బంది. ఆకస్మిక వరదల కారణంగా రాష్ట్రంలో 277 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆ ఆకస్మిక వరదలు రాష్ట్రంలోని 4 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపాయి.
(5 / 7)
బాధితులను సహాయ కేంద్రాలకు తరలిస్తున్న సిబ్బంది. ఆకస్మిక వరదల కారణంగా రాష్ట్రంలో 277 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆ ఆకస్మిక వరదలు రాష్ట్రంలోని 4 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపాయి.(AFP)
సిక్కింలో జనావాసాలను ముంచెత్తిన వరద నీరు. రహదారులపై దాదాపు 10 అడుగుల మేర నీరు నిలిచింది. 
(6 / 7)
సిక్కింలో జనావాసాలను ముంచెత్తిన వరద నీరు. రహదారులపై దాదాపు 10 అడుగుల మేర నీరు నిలిచింది. (AFP)
ఒక్కసారిగా మహోగ్రంగా తీస్తా నది వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం కూడా లభించలేదు. ఆర్మీకి చెందిన బీఆర్ఓ వరద నీటిలో చిక్కుకున్న వందలాది మంది ప్రజలను రక్షించింది.
(7 / 7)
ఒక్కసారిగా మహోగ్రంగా తీస్తా నది వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం కూడా లభించలేదు. ఆర్మీకి చెందిన బీఆర్ఓ వరద నీటిలో చిక్కుకున్న వందలాది మంది ప్రజలను రక్షించింది.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి