తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rohit Sharma Record: రోహిత్ రేంజ్ పెరిగిపోయింది.. ధోనీ సరసన నిలిచిన కెప్టెన్

Rohit Sharma record: రోహిత్ రేంజ్ పెరిగిపోయింది.. ధోనీ సరసన నిలిచిన కెప్టెన్

18 September 2023, 8:34 IST

Rohit Sharma record: రోహిత్ శర్మ రేంజ్ పెరిగిపోయింది. కెప్టెన్ గా రెండోసారి ఆసియా కప్ అందించిన అతడు.. ఈ క్రమంలో మాజీ కెప్టెన్లు ధోనీ, అజారుద్దీన్ సరసన నిలవడం విశేషం.

  • Rohit Sharma record: రోహిత్ శర్మ రేంజ్ పెరిగిపోయింది. కెప్టెన్ గా రెండోసారి ఆసియా కప్ అందించిన అతడు.. ఈ క్రమంలో మాజీ కెప్టెన్లు ధోనీ, అజారుద్దీన్ సరసన నిలవడం విశేషం.
Rohit Sharma record: ఆసియాకప్ ను 8వ సారి గెలిచింది టీమిండియా. ఫైనల్లో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించి ట్రోఫీ అందుకున్న విషయం తెలిసిందే. కేవలం 6.1 ఓవర్లలోనే టార్గెట్ చేజ్ చేసిన ఇండియా.. ఈ క్రమంలో మిగిలిపోయిన బంతుల పరంగా (263 బంతులు) తమ అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.
(1 / 8)
Rohit Sharma record: ఆసియాకప్ ను 8వ సారి గెలిచింది టీమిండియా. ఫైనల్లో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించి ట్రోఫీ అందుకున్న విషయం తెలిసిందే. కేవలం 6.1 ఓవర్లలోనే టార్గెట్ చేజ్ చేసిన ఇండియా.. ఈ క్రమంలో మిగిలిపోయిన బంతుల పరంగా (263 బంతులు) తమ అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.(AFP)
Rohit Sharma record: ఈ విజయంతో కెప్టెన్ రోహిత్ శర్మ.. మాజీ కెప్టెన్లు ఎమ్మెస్ ధోనీ, మహ్మద్ అజారుద్దీన్ సరసన నిలిచాడు. రోహిత్ కెప్టెన్సీలో ఇండియా ఆసియా కప్ గెలవడం ఇది రెండోసారి.
(2 / 8)

Rohit Sharma record: ఆసియా కప్ ను రెండుసార్లు గెలిచిన మూడో ఇండియన్ కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు. గతంలో ధోనీ, అజారుద్దీన్ కెప్టెన్సీలోనూ ఇండియా రెండేసి సార్లు ఆసియా కప్ గెలవడం విశేషం.
(3 / 8)

Rohit Sharma record: అజారుద్దీన్ కెప్టెన్సీలో 1990, 1995లలో రెండుసార్లు ఇండియా ఆసియా కప్ ను సొంతం చేసుకుంది. అప్పట్లో ఇండియాకు రెండుసార్లు ఆసియా కప్ అందించిన తొలి కెప్టెన్ గా అతడు నిలిచాడు.
(4 / 8)

Rohit Sharma record: ధోనీ కెప్టెన్సీలో 2010, 2016లలో ఇండియా ఆసియా కప్ గెలుచుకుంది. 2010లో ఇదే శ్రీలంకపై ఇండియా గెలవగా.. 2016లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది.
(5 / 8)

Rohit Sharma record: రోహిత్ కెప్టెన్సీలో తొలిసారి 2018లో టీమిండియా ఆసియా కప్ గెలిచింది. అప్పట్లో నిజానికి విరాట్ కోహ్లి కెప్టెన్ అయినా.. గాయంతో అతడు ఈ టోర్నీ ఆడకపోవడంతో రోహిత్ తాత్కాలిక కెప్టెన్ గా ఉన్నాడు.
(6 / 8)

Rohit Sharma record: ఆసియా కప్ 2023 ఫైనల్ రోహిత్ శర్మకు 250వ వన్డే కావడం విశేషం. ఈ మైల్ స్టోన్ మ్యాచ్ లోనే రోహిత్ ఆసియా కప్ అందించాడు. ఇండియా తరఫున 250 వన్డేలు ఆడిన 9వ ప్లేయర్ రోహిత్ శర్మ.
(7 / 8)

Rohit Sharma record: ఈ ఆసియా కప్ లోనే రోహిత్ శర్మ వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. విరాట్ కోహ్లి తర్వాత అత్యంత వేగంగా 10 వేల రన్స్ చేసిన ప్లేయర్ గానూ అతడు నిలిచాడు.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి