తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Dc Vs Mi: మ్యాచ్ జరుగుతుండగా గాలిపటంతో ఆడుకున్న రోహిత్ శర్మ, రిషబ్ పంత్: ఫొటోలు

DC vs MI: మ్యాచ్ జరుగుతుండగా గాలిపటంతో ఆడుకున్న రోహిత్ శర్మ, రిషబ్ పంత్: ఫొటోలు

27 April 2024, 22:45 IST

DC vs MI: ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నేడు (ఏప్రిల్ 27) ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ గాలిపటం మైదానంలోకి వచ్చింది. గాలిపటంతో కాసేపు ఎంజాయ్ చేశారు ముంబై స్టార్ రోహిత్ శర్మ, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్. ఆ వివరాలివే..

  • DC vs MI: ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నేడు (ఏప్రిల్ 27) ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ గాలిపటం మైదానంలోకి వచ్చింది. గాలిపటంతో కాసేపు ఎంజాయ్ చేశారు ముంబై స్టార్ రోహిత్ శర్మ, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్. ఆ వివరాలివే..
ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‍లో ఓ గాలిపటం మైదానంలో వచ్చింది. నేడు (ఏప్రిల్ 27) ఢిల్లీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ముంబై లక్ష్యఛేదన చేస్తున్న సమయంలో గాలిపటం సడెన్‍గా ఎంట్రీ ఇచ్చింది. 
(1 / 7)
ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‍లో ఓ గాలిపటం మైదానంలో వచ్చింది. నేడు (ఏప్రిల్ 27) ఢిల్లీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ముంబై లక్ష్యఛేదన చేస్తున్న సమయంలో గాలిపటం సడెన్‍గా ఎంట్రీ ఇచ్చింది. (PTI)
తన వద్దకు వచ్చిన గాలిపటాన్ని కీపింగ్ చేస్తున్న ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‍కు ఇచ్చాడు ముంబై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ. అయితే, మైదానంలోనే ఆ గాలిపటాన్ని ఎగరేసేందుకు పంత్ ప్రయత్నించాడు. కాసేపు దానితో ఆడుకున్నాడు. 
(2 / 7)
తన వద్దకు వచ్చిన గాలిపటాన్ని కీపింగ్ చేస్తున్న ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‍కు ఇచ్చాడు ముంబై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ. అయితే, మైదానంలోనే ఆ గాలిపటాన్ని ఎగరేసేందుకు పంత్ ప్రయత్నించాడు. కాసేపు దానితో ఆడుకున్నాడు. (AP)
రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా.. ఈ గాలిపటం గ్రౌండ్‍లోకి వచ్చింది. దీంతో ఆటకు కాస్త అంతరాయం కలిగింది. అయితే, ఆ గాలిపటాన్ని పంత్‍ అందించాడు రోహిత్. పంత్ సరదాగా దాన్ని ఎగరేసేందుకు ట్రైచేశాడు. 
(3 / 7)
రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా.. ఈ గాలిపటం గ్రౌండ్‍లోకి వచ్చింది. దీంతో ఆటకు కాస్త అంతరాయం కలిగింది. అయితే, ఆ గాలిపటాన్ని పంత్‍ అందించాడు రోహిత్. పంత్ సరదాగా దాన్ని ఎగరేసేందుకు ట్రైచేశాడు. (AP)
స్క్వైర్ లెంగ్ అంపైర్ వచ్చి ఆ గాలిపటాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత ఆట కొనసాగింది.
(4 / 7)
స్క్వైర్ లెంగ్ అంపైర్ వచ్చి ఆ గాలిపటాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత ఆట కొనసాగింది.(PTI)
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫ్రేజర్ మెక్‍గుర్క్ (27 బంతుల్లో 84 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్‍లో 10 పరుగుల తేడాతో ఢిల్లీ గెలిచింది. 
(5 / 7)
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫ్రేజర్ మెక్‍గుర్క్ (27 బంతుల్లో 84 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్‍లో 10 పరుగుల తేడాతో ఢిల్లీ గెలిచింది. (PTI)
లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగులు చేసి.. ఓడిపోయింది. ఢిల్లీ విజయం సాధించింది. 
(6 / 7)
లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగులు చేసి.. ఓడిపోయింది. ఢిల్లీ విజయం సాధించింది. (PTI)
అయితే, ఈ మ్యాచ్‍లో గాలిపటం విషయం ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. 
(7 / 7)
అయితే, ఈ మ్యాచ్‍లో గాలిపటం విషయం ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. (PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి