తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Reverse Diet : మార్కెట్లోకి కొత్త డైట్ వచ్చింది.. దీనిలో నియమాలివే..

Reverse Diet : మార్కెట్లోకి కొత్త డైట్ వచ్చింది.. దీనిలో నియమాలివే..

11 June 2022, 16:20 IST

బరువు తగ్గేందుకు వ్యాయామం నుంచి డైటింగ్ వరకు అన్నీ పాటిస్తాము. ఈ డైటింగ్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో రివర్స్ డైట్ ప్రస్తుతం డైట్ ప్రియులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందో లేదో చుద్దాం.

డైటింగ్‌లో కొన్ని ప్రాథమిక నియమాలు ఉన్నాయని అందరికీ తెలుసు. అవి పాటించినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోండి. కీటో డైట్, జిఎం డైట్, ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ వంటి డైట్‌లు ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఇప్పుడు కొత్తగా రివర్స్ డైటింగ్ కూడా మెల్లగా సక్సెస్ అవుతోంది. దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 
(1 / 5)

రివర్స్ డైటింగ్ అంటే ఏమిటి? మీరు డైట్‌లో ఉన్నప్పుడు మీరు తక్కువ కేలరీలను తీసుకుంటారు. తద్వారా శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు పోతుంది. కానీ మీ డైట్ పూర్తయ్యాక మళ్లీ అదే డైట్ ప్రకారం తింటారు. దీనివల్ల మీకు మెటాబాలిజం తగ్గిపోతుంది. ఫలితంగా శరీరంలోని కొవ్వు అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రివర్స్ డైటింగ్ చాలా మేలు చేస్తుంది. ఈ రకమైన డైటింగ్‌లో శరీరంపై ఎటువంటి ప్రభావం చూపకుండా కేలరీలను తీసుకోవడం క్రమంగా పెంచుతారు.
(2 / 5)

రివర్స్ డైట్ ఎప్పుడు చేయాలి? ఎవరైనా బరువును అదుపులో ఉంచుకుని ఎక్కువ ఆహారం తినాలనుకున్నప్పుడు.. శరీరంలో మెటబాలిజం పెంచుకోవాలనుకున్నప్పుడు ఈ డైట్ పాటించవచ్చు. ఎవరైనా ఎక్కువ కాలం తక్కువ కేలరీలు తినడం ద్వారా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే.. రివర్స్ డైట్ వారిపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.
(3 / 5)

దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ ఆహారంలో అదనంగా 100-200 కేలరీలు తీసుకోండి. అయితే ఇది ఫాస్ట్ ఫుడ్ కాకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం తినండి. ఒక వారం తర్వాత.. మీ శరీరం సరిగా పని చేస్తుందో లేదో గమనించండి. ఇది ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటే.. తరువాత వారం మరో 100 కేలరీలు పెంచండి. మంచి ఆహారాన్ని తీసుకోవడం కొనసాగించండి. మీరు బరువు పెరగుతున్నట్లు అనిపిస్తే 100 కేలరీలు తగ్గించండి. ఈ విధంగా మీరు ఫిట్‌గా ఉండటానికి అంతేకాకుండా మీ బరువును నియంత్రించడానికి ఎన్ని కేలరీలు అవసరమో మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు.
(4 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి