తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Airport In Ayodhya: రామాయణ విశేషాల చిత్రాలతో కనువిందు చేస్తున్న అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయం

Airport in Ayodhya: రామాయణ విశేషాల చిత్రాలతో కనువిందు చేస్తున్న అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయం

30 December 2023, 19:00 IST

Ayodhya Airport: అయోధ్యలో అత్యాధునికంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. రామాయణంతో అయోధ్య కు ఉన్న అనుబంధం నేపథ్యంలో, రామాయణ విశేషాలను ఆ విమానాశ్రయంలో కనువిందుగా చిత్రించారు.

Ayodhya Airport: అయోధ్యలో అత్యాధునికంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. రామాయణంతో అయోధ్య కు ఉన్న అనుబంధం నేపథ్యంలో, రామాయణ విశేషాలను ఆ విమానాశ్రయంలో కనువిందుగా చిత్రించారు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయం ఇది. దీనికి మహర్షి వాల్మీకి విమానాశ్రయమని పేరు పెట్టారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే ఈ విమానాశ్రయాన్ని శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. 
(1 / 6)
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయం ఇది. దీనికి మహర్షి వాల్మీకి విమానాశ్రయమని పేరు పెట్టారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే ఈ విమానాశ్రయాన్ని శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. (ANI)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయం ప్రవేశ ద్వారం ఇది. ఈ ఏర్ పోర్ట్ అయోధ్య నగరానికి దాదాపు 15 కి.మీ దూరంలో ఉంటుంది. త్వరలో దీనిని అంతర్జాతీయ విమానాశ్రయంగా ఆధునీకరించనున్నారు.
(2 / 6)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయం ప్రవేశ ద్వారం ఇది. ఈ ఏర్ పోర్ట్ అయోధ్య నగరానికి దాదాపు 15 కి.మీ దూరంలో ఉంటుంది. త్వరలో దీనిని అంతర్జాతీయ విమానాశ్రయంగా ఆధునీకరించనున్నారు.(ANI)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయ ఎంట్రీ గేట్ ఇది. సంప్రదాయ లుక్ లో దీన్ని తీర్చిదిద్దారు. రామాయణ స్ఫూర్తి ఈ విమానాశ్రయంలో అడుగడుగునా కనిపించేలా శ్రద్ధ వహించారు. ఈ విమానాశ్రయంతో భక్తి, ఆధ్యాత్మక పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. 
(3 / 6)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయ ఎంట్రీ గేట్ ఇది. సంప్రదాయ లుక్ లో దీన్ని తీర్చిదిద్దారు. రామాయణ స్ఫూర్తి ఈ విమానాశ్రయంలో అడుగడుగునా కనిపించేలా శ్రద్ధ వహించారు. ఈ విమానాశ్రయంతో భక్తి, ఆధ్యాత్మక పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. (ANI)
విమానాశ్రయంలోపల ప్రయాణీకులు కూర్చునే ప్రదేశం ఇది. శ్రీరాముడి చిత్రాలతో ఈ ప్రదేశాన్ని అలంకరించారు. 
(4 / 6)
విమానాశ్రయంలోపల ప్రయాణీకులు కూర్చునే ప్రదేశం ఇది. శ్రీరాముడి చిత్రాలతో ఈ ప్రదేశాన్ని అలంకరించారు. (ANI)
విమానాశ్రయం లోపల దృశ్యం ఇది. రామాయణ ఘట్టాలను వివరించే అద్భుతమైన చిత్రాలతో అలంకరించారు. పూర్తిగా రామాయణం థీమ్ తో ఈ విమానాశ్రయాన్ని తీర్చి దిద్దారు. 
(5 / 6)
విమానాశ్రయం లోపల దృశ్యం ఇది. రామాయణ ఘట్టాలను వివరించే అద్భుతమైన చిత్రాలతో అలంకరించారు. పూర్తిగా రామాయణం థీమ్ తో ఈ విమానాశ్రయాన్ని తీర్చి దిద్దారు. (ANI)
అయోధ్యలోని విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ ఇన్ ప్రాంతం. ప్రయాణికులకు, రామాలయ సందర్శనకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ విమానాశ్రయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్ పోర్ట్ లో ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, LED లైటింగ్, రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, ల్యాండ్‌స్కేపింగ్‌లో ఫౌంటైన్‌లు, నీటి శుద్ధి ప్లాంట్స్, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, సౌర విద్యుత్ ప్లాంట్ ఉన్నాయి. 
(6 / 6)
అయోధ్యలోని విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ ఇన్ ప్రాంతం. ప్రయాణికులకు, రామాలయ సందర్శనకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ విమానాశ్రయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్ పోర్ట్ లో ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, LED లైటింగ్, రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, ల్యాండ్‌స్కేపింగ్‌లో ఫౌంటైన్‌లు, నీటి శుద్ధి ప్లాంట్స్, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, సౌర విద్యుత్ ప్లాంట్ ఉన్నాయి. (ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి