తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Exams Postponed : వర్షాల ఎఫెక్ట్.. ఓయూ, కేయూతో సహా Pstu పరీక్షలు వాయిదా

Exams Postponed : వర్షాల ఎఫెక్ట్.. ఓయూ, కేయూతో సహా PSTU పరీక్షలు వాయిదా

26 July 2023, 9:47 IST

Heavy Rains in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించింది తెలంగాణ సర్కార్. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు పలు యూనివర్శిటీ పరిధిలో జరుగుతున్న అన్ని పరీక్షలను వాయిదా వేశారు. 

  • Heavy Rains in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించింది తెలంగాణ సర్కార్. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు పలు యూనివర్శిటీ పరిధిలో జరుగుతున్న అన్ని పరీక్షలను వాయిదా వేశారు. 
ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు వర్శిటీ రిజిస్టార్ ప్రకటన విడుదల చేశారు. వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. 
(1 / 6)

వ‌రంగ‌ల్ కాక‌తీయ యూనివ‌ర్సిటీ ప‌రిధిలో జ‌ర‌గాల్సిన  పలు ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసిన‌ట్లు వ‌ర్సిటీ అధికారులు తెలిపారు. జులై 20 నుంచి 22 మ‌ధ్య వాయిదా ప‌డిన ప‌రీక్ష‌లతో పాటు తాజాగా వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
(2 / 6)

వ‌ర్షాల కారణంగా పాల‌మూరు యూనివ‌ర్సిటీ ప‌రిధిలో కూడా పలు ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశారు. వాయిదా ప‌డ్డ ప‌రీక్ష‌ల తేదీల‌ు త్వరలోనే రానున్నాయి. 
(3 / 6)

హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27, 28 తేదీల్లో జరగాల్సిన ప్రవేశ పరీక్ష(PSTUCET 2023)లను వాయిదా వేశారు.  ఆరు కోర్సుల్లో ప్రవేశాలకు జరగాల్సిన పరీక్షలను తర్వాత నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే అభ్యర్థులకు తెలియజేస్తామని వెల్లడించారు.
(4 / 6)

ఇవాళ,. రేపు తెలంగాణలోని అన్ని  ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది సర్కార్. బంగాళాశాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
(5 / 6)

ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలంటూ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని.. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి