తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Osmania University: క్లోజ్డ్ క్యాంపస్ గా ఓయూ...మరికొద్దిరోజులు మాత్రమే వాహనాలకు ఎంట్రీ!

Osmania University: క్లోజ్డ్ క్యాంపస్ గా ఓయూ...మరికొద్దిరోజులు మాత్రమే వాహనాలకు ఎంట్రీ!

16 August 2023, 16:27 IST

Osmania University News: ఓయూలోకి వాహనాలకు రాకపోకలకు బ్రేకులు పడనున్నాయి. మరికొద్దిరోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రానున్నాయి.ప్రత్యామ్నాయంగా మరో లింక్ రోడ్డు నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రకటించారు.

  • Osmania University News: ఓయూలోకి వాహనాలకు రాకపోకలకు బ్రేకులు పడనున్నాయి. మరికొద్దిరోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రానున్నాయి.ప్రత్యామ్నాయంగా మరో లింక్ రోడ్డు నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రకటించారు.
 ఓయూ  క్యాంపస్‌ మధ్యలో ఉన్న లింక్ రోడ్డును త్వరలోనే మూసివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ రూట్‌లలో తిరిగే వారికి మరికొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
(1 / 5)
 ఓయూ  క్యాంపస్‌ మధ్యలో ఉన్న లింక్ రోడ్డును త్వరలోనే మూసివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ రూట్‌లలో తిరిగే వారికి మరికొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.(OU)
ఈ మార్గంలో వాహనాల రాకపోకలు క్యాంపస్‌లోని విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. పైగా క్యాంపస్‌లోని ప్రశాంతమైన వాతావరణానికి ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ఈ అంశంపై దృష్టిపెట్టిన సర్కార్… అతి త్వరలోనే 16.50కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ రోడ్డును నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఐటీ, పట్టణాభివృద్దిశాఖ మంత్రి కేటీఆర్‌ వివరాలను ఇటివలే ప్రకటించారు.
(2 / 5)
ఈ మార్గంలో వాహనాల రాకపోకలు క్యాంపస్‌లోని విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. పైగా క్యాంపస్‌లోని ప్రశాంతమైన వాతావరణానికి ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ఈ అంశంపై దృష్టిపెట్టిన సర్కార్… అతి త్వరలోనే 16.50కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ రోడ్డును నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఐటీ, పట్టణాభివృద్దిశాఖ మంత్రి కేటీఆర్‌ వివరాలను ఇటివలే ప్రకటించారు.(twitter)
ప్రస్తుతం ఉదయం 6గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మాత్రమే క్యాంపస్‌లో వాహనాలను అనుమతిస్తున్నారు.  అతి త్వరలో ఈ అవకాశం కూడా ఉండదు.
(3 / 5)
ప్రస్తుతం ఉదయం 6గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మాత్రమే క్యాంపస్‌లో వాహనాలను అనుమతిస్తున్నారు.  అతి త్వరలో ఈ అవకాశం కూడా ఉండదు.
ప్రత్యామ్నాయంగా అడిక్‌మెట్, తార్నాక, అంబర్‌పేట్‌ను కలిపే విధంగా అడిక్‌మెట్ ఫ్లైఓవర్ నుంచి ఈసీఈ డిపార్ట్‌మెంట్, ఆంధ్ర మహిళాసభ, యూనివర్సిటీ ఎన్‌సీసీ గేట్‌ను కలుపుతూ కొత్తగా లింక్‌ రోడ్డును నిర్మించే ప్రతిపాదన ఉందని మంత్రి కేటీఆర్  ప్రకటించారు. 16.5కోట్ల రూపాయలతో అతి త్వరలోనే ఈ పనులు చేపట్టబోతున్నట్లుగా వెల్లడించారు.
(4 / 5)

1917లో స్థాపించబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఇక్కడ అనేక దేశాలకు చెందిన విద్యార్థులు కూడా చదువుతుంటారు. నగరం నడిబొడ్డున ఎంతో విశాలంగా ఉండే ఓయూ క్యాంపస్ లో పర్యావరణాన్ని రక్షించేందుకు సర్కార్ చర్యలు చేపడుతోంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి