తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Wpl 2024: ముంబై ఇండియన్స్‌కు అలవోక గెలుపు.. ఆర్సీబీ చిత్తు

WPL 2024: ముంబై ఇండియన్స్‌కు అలవోక గెలుపు.. ఆర్సీబీ చిత్తు

02 March 2024, 23:04 IST

WPL 2024 - MI vs RCB: డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మళ్లీ జోరు చూపింది. ఈ సీజన్‍లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది.

  • WPL 2024 - MI vs RCB: డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మళ్లీ జోరు చూపింది. ఈ సీజన్‍లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2024 టోర్నీలో ముంబై ఇండియన్స్ (MI W) మరోసారి అదరగొట్టింది. బెంగళూరు వేదికగా నేడు (మార్చి 2) జరిగిన మ్యాచ్‍లో ముంబై 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB W) జట్టుపై విజయం సాధించింది. 
(1 / 5)
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2024 టోర్నీలో ముంబై ఇండియన్స్ (MI W) మరోసారి అదరగొట్టింది. బెంగళూరు వేదికగా నేడు (మార్చి 2) జరిగిన మ్యాచ్‍లో ముంబై 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB W) జట్టుపై విజయం సాధించింది. (PTI)
రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ గాయం వల్ల దూరం కాగా.. గత మ్యాచ్‍లో ముంబై ఇండియన్స్ ఓడింది. అయితే, నేటి మ్యాచ్‍తో మళ్లీ గెలుపు బాటపట్టింది. ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరును ముంబై కట్టడి చేసింది. 
(2 / 5)
రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ గాయం వల్ల దూరం కాగా.. గత మ్యాచ్‍లో ముంబై ఇండియన్స్ ఓడింది. అయితే, నేటి మ్యాచ్‍తో మళ్లీ గెలుపు బాటపట్టింది. ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరును ముంబై కట్టడి చేసింది. (PTI)
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 పరుగులు చేయగలిగింది. ఎలీస్ పెర్రీ (44 నాటౌట్) సత్తాచాటడంతో ఆ మాత్రం స్కోరు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (9) త్వరగానే ఔటైంది. ముంబై బౌలర్లలో తాత్కాలిక కెప్టెన్ నాట్ స్కీవెర్ బ్రంట్, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు తీశారు. 
(3 / 5)
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 పరుగులు చేయగలిగింది. ఎలీస్ పెర్రీ (44 నాటౌట్) సత్తాచాటడంతో ఆ మాత్రం స్కోరు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (9) త్వరగానే ఔటైంది. ముంబై బౌలర్లలో తాత్కాలిక కెప్టెన్ నాట్ స్కీవెర్ బ్రంట్, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు తీశారు. (PTI)
ఈ లక్ష్యాన్ని 15.1 ఓవర్లలోనే ముంబై ఇండియన్ ఛేదించింది. 3 వికెట్ల కోల్పోయి 133 రన్స్ చేసి విజయం సాధించింది. అమెలియా కెర్ (40 నాటౌట్) అదరగొట్టగా.. యక్షితా భాటియా (31) రాణించారు. బెంగళూరులో బౌలర్లలో సోఫీ డివైన్, వారెహమ్, శ్రేయాంక పాటిల్‍కు చెరో వికెట్ దక్కింది. 
(4 / 5)
ఈ లక్ష్యాన్ని 15.1 ఓవర్లలోనే ముంబై ఇండియన్ ఛేదించింది. 3 వికెట్ల కోల్పోయి 133 రన్స్ చేసి విజయం సాధించింది. అమెలియా కెర్ (40 నాటౌట్) అదరగొట్టగా.. యక్షితా భాటియా (31) రాణించారు. బెంగళూరులో బౌలర్లలో సోఫీ డివైన్, వారెహమ్, శ్రేయాంక పాటిల్‍కు చెరో వికెట్ దక్కింది. (PTI)
డబ్ల్యూపీఎల్ 2024 సీజన్‍లో నాలుగు మ్యాచ్‍ల్లో మూడో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ముంబై ఇండియన్స్ మరింత పదిలం చేసుకుంది. వరుసగా రెండో మ్యాచ్ ఓడిన బెంగళూరు నాలుగో స్థానానికి పడిపోయింది. 
(5 / 5)
డబ్ల్యూపీఎల్ 2024 సీజన్‍లో నాలుగు మ్యాచ్‍ల్లో మూడో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ముంబై ఇండియన్స్ మరింత పదిలం చేసుకుంది. వరుసగా రెండో మ్యాచ్ ఓడిన బెంగళూరు నాలుగో స్థానానికి పడిపోయింది. (PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి