తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Vontimitta Brahmotsavam 2024 : ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణ మహోత్సవాలు - 'హరిధ్రా ఘటనం' తో ప్రారంభం

Vontimitta Brahmotsavam 2024 : ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణ మహోత్సవాలు - 'హరిధ్రా ఘటనం' తో ప్రారంభం

13 April 2024, 15:18 IST

Vontimitta Brahmotsavam 2024 Updates: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) నిర్వహించనున్నారు. అయితే శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవాలు శనివారం రోజు ”హరిధ్రా ఘటనం”తో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

  • Vontimitta Brahmotsavam 2024 Updates: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) నిర్వహించనున్నారు. అయితే శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవాలు శనివారం రోజు ”హరిధ్రా ఘటనం”తో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
(1 / 8)
ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.(Photo From https://news.tirumala.org/ )
వొంటిమిట్టలోని శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవాలు శనివారంనాడు ”హరిధ్రా ఘటనం”తో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది తొలిసారిగా టీటీడీ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
(2 / 8)
వొంటిమిట్టలోని శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవాలు శనివారంనాడు ”హరిధ్రా ఘటనం”తో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది తొలిసారిగా టీటీడీ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.(Photo From https://news.tirumala.org/ )
ఈ సందర్భంగా మహిళా భక్తులు సుమారు మూడు కిలోల పసుపును పోసి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ సాంప్రదాయబద్దంగా రోలులో దంచారు.
(3 / 8)
ఈ సందర్భంగా మహిళా భక్తులు సుమారు మూడు కిలోల పసుపును పోసి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ సాంప్రదాయబద్దంగా రోలులో దంచారు.(Photo From https://news.tirumala.org/ )
అంతకుముందు గర్భాలయం లోపల పసుపు కొమ్ములకు, రోకళ్లకు స్వామి పాదాల చెంత ప్రత్యేక పూజలను అర్చక స్వాములు సశాస్త్రీయంగా చేశారు.
(4 / 8)
అంతకుముందు గర్భాలయం లోపల పసుపు కొమ్ములకు, రోకళ్లకు స్వామి పాదాల చెంత ప్రత్యేక పూజలను అర్చక స్వాములు సశాస్త్రీయంగా చేశారు.(Photo From https://news.tirumala.org/ )
అర్చకులు శ్రీ శ్రవణ స్వామి మాట్లాడుతూ భగవత్ విజ్ఞాపనతో హరిధ్రా ఘటనం కార్యక్రమం ప్రారంభం అయిందని తెలిపారు. తద్వారా శ్రీ సీతా రామ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లకు నాంది పలికినట్లు అయిందన్నారు
(5 / 8)
అర్చకులు శ్రీ శ్రవణ స్వామి మాట్లాడుతూ భగవత్ విజ్ఞాపనతో హరిధ్రా ఘటనం కార్యక్రమం ప్రారంభం అయిందని తెలిపారు. తద్వారా శ్రీ సీతా రామ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లకు నాంది పలికినట్లు అయిందన్నారు(Photo From https://news.tirumala.org/ )
అనంతరం ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను భక్తులకు తెలియజేశారు. “ఇవాళ పసుపు దంచే కార్యక్రమంలో వచ్చిన పసుపును ఉత్సవరులకు కళ్యాణం నాడు నిర్వహించే స్నపనం మరియు తలంబ్రాలు తయారీకి ఉపయోగిస్తారన్నారు.
(6 / 8)
అనంతరం ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను భక్తులకు తెలియజేశారు. “ఇవాళ పసుపు దంచే కార్యక్రమంలో వచ్చిన పసుపును ఉత్సవరులకు కళ్యాణం నాడు నిర్వహించే స్నపనం మరియు తలంబ్రాలు తయారీకి ఉపయోగిస్తారన్నారు.(Photo From https://news.tirumala.org/ )
“జై శ్రీ రామ్… జై శ్రీ రామ్ అంటూ నినదిస్తూ ఈ సాంప్రదాయ పసుపు దంచే కార్యక్రమంలో మహిళా భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్నమాచార్య కళాకారుల బృందం సందర్భానుసారంగా రామ భజనలను కీర్తించారు.
(7 / 8)
“జై శ్రీ రామ్… జై శ్రీ రామ్ అంటూ నినదిస్తూ ఈ సాంప్రదాయ పసుపు దంచే కార్యక్రమంలో మహిళా భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్నమాచార్య కళాకారుల బృందం సందర్భానుసారంగా రామ భజనలను కీర్తించారు.(Photo From https://news.tirumala.org/ )
ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంట‌ల వ‌ర‌కు సీతారాముల క‌ల్యాణం అత్యంత వైభ‌వంగా నిర్వహించ‌నున్నారు.
(8 / 8)
ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంట‌ల వ‌ర‌కు సీతారాముల క‌ల్యాణం అత్యంత వైభ‌వంగా నిర్వహించ‌నున్నారు.(Photo From https://news.tirumala.org/ )

    ఆర్టికల్ షేర్ చేయండి