తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lunar Eclipse 2023:ఈ రోజే చంద్ర గ్రహణం; ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం..

Lunar Eclipse 2023:ఈ రోజే చంద్ర గ్రహణం; ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం..

28 October 2023, 16:02 IST

Lunar Eclipse 2023: చంద్ర గ్రహణం ఈ రోజు అర్ధరాత్రి దాటిన తరువాత ప్రారంభమవుతుంది. ఈ గ్రహణం వివిధ రాశుల వారిపై చూపే ప్రభావం ఏంటో చూద్దాం..

పౌర్ణమి సమయంలో సూర్యుడు, చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది, మేషరాశిలో వచ్చే ఈ గ్రహణం చాలా అరుదు. దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది.
(1 / 13)
పౌర్ణమి సమయంలో సూర్యుడు, చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది, మేషరాశిలో వచ్చే ఈ గ్రహణం చాలా అరుదు. దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది.(Photo by Benjamin Voros on Unsplash)
మేషం: ఈ గ్రహణం మీ ఆత్మవిశ్వాసాన్ని, కొత్త సవాళ్ల పట్ల ఉత్సాహాన్ని పెంచుతుంది. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి, పాత అలవాట్లను విడనాడడానికి ఇది మంచి సమయం, ఆరోగ్య దినచర్యలలో మార్పులు చేయడం గురించి ఆలోచించండి.
(2 / 13)

వృషభం: ఈ గ్రహణంతో మీలో దాగిన భావోద్వేగాలు బయటకు రావడం ప్రారంభమవుతుంది. మీలో ఆత్మ విమర్శ ప్రారంభమవుతుంది. ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. పాత చింతకాయ పచ్చడి నమ్మకాలను విడనాడండి.
(3 / 13)

మిథునం: ఇది మీ లక్ష్యాలను మరియు మీ ఆకాంక్షలను పునర్విమర్శించుకునే సమయం. అలాగే, మిమ్మల్ని ప్రభావితం చేసే వ్యక్తులను తిరిగి అంచనా వేయాల్సిన సమయం. కొన్ని స్నేహాలు లేదా అనుబంధాలు ముగియవచ్చు, కొత్త, మరింత అనుకూలమైన అనుబంధాలు ఏర్పడవచ్చు. మీకు నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టండి.
(4 / 13)

కర్కాటకం: ఈ గ్రహణం మీ వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో పరివర్తన దశకు దారితీస్తుంది. మీరు మరింత లక్ష్యసాధకులు అవుతారు, నాయకత్వ అవకాశాలను కోరుకుంటారు. మీ వృత్తిపరమైన ప్రయాణంలో పాత పరిమితుల నుండి విముక్తి పొందే సమయం ఇది. వృత్తిపరమైన లక్ష్యాలను, వ్యక్తిగత లక్ష్యాలను నిర్దేశించుకుంటారు.
(5 / 13)

సింహం: ఈ గ్రహణం మీకు మార్గనిర్దేశనం చేసే ఉపాధ్యాయులు, గురువులు, మార్గదర్శకులతో మీ సంబంధాలను ప్రభావితం చేస్తుంది. మీలో ఆత్మ విమర్శ ప్రారంభమవుతుంది. మీ ప్రస్తుత విశ్వసాలను ప్రశ్నించడం ప్రారంభిస్తారు. కొత్త ఆధ్యాత్మిక భావనలకు ఆకర్షితులవుతారు. స్వీయ శోధన దిశగా అడుగులు వేస్తారు. అనూహ్య ప్రయాణాలకు సిద్ధంగా ఉండండి.
(6 / 13)

కన్య: గ్రహణం మీ జీవితంలోని రహస్య అంశాలను వెల్లడిస్తుంది, ఇది స్వీయ-ఆవిష్కరణ మరియు లోతైన భావోద్వేగ అన్వేషణకు దారితీస్తుంది. మీ ఆర్థిక వ్యూహాలను నిశితంగా పరిశీలించండి. డబ్బు విషయాల గురించి జాగ్రత్తగా ఉండండి. మీ అప్పులు, పన్నులు, పెట్టుబడులను సమీక్షించండి. 
(7 / 13)

తుల: గ్రహణం మీ భాగస్వామ్యాల్లో విభేదాలను తీసుకువస్తుంది. ఘర్షణల సమయంలో సంయమనంతో ఉండండి. కుటుంబ సభ్యులతో సంయమనంతో వ్యవహరించండి. మీరు వ్యాపార కార్యకలాపాల్లో ఉంటే, భాగస్వామ్యాల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశముంది.
(8 / 13)

వృశ్చికం: ఈ చంద్ర గ్రహణం సమయంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మరోసారి తీవ్రమయ్యే అవకాశముంది. ఫిట్ నెస్ పై, ఆరోగ్య విధానాలపై దృష్టి పెడ్తారు. మీ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో సంబంధాలపై  సమీక్షిస్తారు. ఉద్యోగ మార్పు అవకాశాలున్నాయి. ఉద్యోగ మార్పులను స్వాగతించండి.
(9 / 13)

ధనుస్సు: ఈ గ్రహణం సృజనాత్మక ప్రయత్నాల పట్ల మీ అభిరుచిని మరింత పెంచుతుంది, కొత్త అభిరుచులు, కళాత్మక ప్రాజెక్ట్‌ల పట్ల ఆకర్షితులవుతారు. మీ కళాత్మక ప్రతిభను పరీక్షించుకోవడానికి, సృజనాత్మక ప్రాజెక్ట్‌లను ప్రారంభించడానికి ఇది అనువైన సమయం. మరోవైపు, దాగి ఉన్న భావోద్వేగాలు బయటపడవచ్చు.
(10 / 13)

మకరం: ఈ చంద్రగ్రహణం సమయంలో మీ దృష్టి కుటుంబం శ్రేయస్సుపై పడుతుంది. మీరు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలను పునఃపరిశీలించుకుంటారు. లోతైన ఆత్మపరిశీలన కోసం సమయం వచ్చింది. ఇప్పటివరకు పరిష్కరించని కుటుంబ సమస్యలు తెరపైకి రావచ్చు, నూతన గృహంలోకి మారే అవకాశముంది.
(11 / 13)

కుంభం: ఈ గ్రహణం మీ భావ వ్యక్తీకరణల్లో మార్పునకు దారి తీస్తుంది. మీరు మరింత దృఢంగా, నిర్మొహమాటంగా మారుతారు. ఇది మీ ఆలోచనలను ప్రభావవంతంగా తెలియజేయగల మీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, కానీ అనవసరంగా ఉద్రేకపడకండి. తోబుట్టువులతో సమయం గడపండి.
(12 / 13)

మీనం: ఆర్థిక విషయాలలో మార్పులు ఉంటాయి. ఆర్థిక నిర్వహణలో మార్పులకు దారితీయవచ్చు. ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టండి. తదనుగుణంగా సర్దుబాట్లు చేయండి. ఉపయోగపడని పెట్టుబడుల నుంచి బయటకు రండి. మీ ఉద్యోగ జీవితంలో మీ అర్హతకు తగ్గ ఫలితాలను డిమాండ్ చేయండి.
(13 / 13)

    ఆర్టికల్ షేర్ చేయండి