తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Covid Vaccination Food | వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏ ఫుడ్ తీసుకోవాలి?

Covid Vaccination Food | వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏ ఫుడ్ తీసుకోవాలి?

13 January 2022, 15:04 IST

కరోనా వల్లే కాదు.. ఆ కరోనా నుంచి తప్పించుకోవడానికి తీసుకునే వ్యాక్సిన్ నుంచి కూడా సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే మీరు ఏ డోసు వ్యాక్సిన్ తీసుకుంటున్నా సరే.. వ్యాక్సిన్ తర్వాత ఈ పుడ్ తింటే.. సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడవచ్చు.

  • కరోనా వల్లే కాదు.. ఆ కరోనా నుంచి తప్పించుకోవడానికి తీసుకునే వ్యాక్సిన్ నుంచి కూడా సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే మీరు ఏ డోసు వ్యాక్సిన్ తీసుకుంటున్నా సరే.. వ్యాక్సిన్ తర్వాత ఈ పుడ్ తింటే.. సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడవచ్చు.
కరోనా ఇప్పట్లో మనల్ని వదిలేలా లేదు. దాని నుంచి తప్పించుకోవడానికి డోసుల మీద డోసుల వ్యాక్సినూ తప్పదు. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడల్లా కొందరిలో జ్వరం, నొప్పులు, తలనొప్పి, వీక్‌నెస్‌, అలసట, అసిడిటీ, వాంతి వచ్చినట్లు కావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలు కొన్ని ఉన్నాయి. గుర్గావ్‌లోని ఫోర్టిస్‌ మెమొరియల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ హెడ్‌ క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌ దీప్తి ఖతూజా కొన్ని ఫుడ్స్‌ గురించి చెబుతున్నారు.
(1 / 9)
కరోనా ఇప్పట్లో మనల్ని వదిలేలా లేదు. దాని నుంచి తప్పించుకోవడానికి డోసుల మీద డోసుల వ్యాక్సినూ తప్పదు. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడల్లా కొందరిలో జ్వరం, నొప్పులు, తలనొప్పి, వీక్‌నెస్‌, అలసట, అసిడిటీ, వాంతి వచ్చినట్లు కావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలు కొన్ని ఉన్నాయి. గుర్గావ్‌లోని ఫోర్టిస్‌ మెమొరియల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ హెడ్‌ క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌ దీప్తి ఖతూజా కొన్ని ఫుడ్స్‌ గురించి చెబుతున్నారు.(Pixabay)
పసుపు : వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత మీ ఆహారంలో పసుపును కచ్చితంగా చేర్చండి. ఇందులోని కర్కుమిన్‌ అనే సమ్మేళనం.. యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు కలిగి ఉంటుంది. అంతేకాదు పసుపులో యాంటిఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేస్తాయి. సాధారణ జలుబుకు కూడా ఇది బాగా పని చేస్తుంది. పాలల్లో కలుపుకొని తాగినా లేదంటే నిమ్మకాయ రసంలో కలుపుకున్నా.. పసుపు తీసుకోవడం ఉత్తమం.
(2 / 9)
పసుపు : వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత మీ ఆహారంలో పసుపును కచ్చితంగా చేర్చండి. ఇందులోని కర్కుమిన్‌ అనే సమ్మేళనం.. యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు కలిగి ఉంటుంది. అంతేకాదు పసుపులో యాంటిఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేస్తాయి. సాధారణ జలుబుకు కూడా ఇది బాగా పని చేస్తుంది. పాలల్లో కలుపుకొని తాగినా లేదంటే నిమ్మకాయ రసంలో కలుపుకున్నా.. పసుపు తీసుకోవడం ఉత్తమం.(Pixabay)
అల్లం: పసుపులాగే అల్లంలో ఉండే యాంటీమైక్రోబియల్‌ లక్షణాలు శరీర రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మీరు సాధారణంగా చాయ్‌లో అల్లం వేసుకొని తాగినా.. శరీరానికి అవసరమైన బలం చేకూరుతుంది.
(3 / 9)
అల్లం: పసుపులాగే అల్లంలో ఉండే యాంటీమైక్రోబియల్‌ లక్షణాలు శరీర రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మీరు సాధారణంగా చాయ్‌లో అల్లం వేసుకొని తాగినా.. శరీరానికి అవసరమైన బలం చేకూరుతుంది.(Pixabay)
ఆకు కూరలు: పచ్చని ఆకుకూరల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. అదే కాకుండా విటమిన్‌ సీ, ఈ, ఎ, ఫొలేట్‌, మాంగనీస్‌, యాంటీఆక్సిడెంట్స్‌, విటమిన్‌ కే వంటివి కూడా ఉంటాయి. విటమిన్ సీ, ఏ శరీర రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
(4 / 9)
ఆకు కూరలు: పచ్చని ఆకుకూరల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. అదే కాకుండా విటమిన్‌ సీ, ఈ, ఎ, ఫొలేట్‌, మాంగనీస్‌, యాంటీఆక్సిడెంట్స్‌, విటమిన్‌ కే వంటివి కూడా ఉంటాయి. విటమిన్ సీ, ఏ శరీర రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.(Pixabay)
పెరుగు: సహజ ప్రొబయోటిక్‌ అయిన పెరుగు తినడం ద్వారా మీ పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. ఇన్‌ఫ్లేమేషన్‌ను తగ్గించి రోగ నిరోధక వ్యవస్థ మెరుగయ్యేలా చేస్తుంది.
(5 / 9)
పెరుగు: సహజ ప్రొబయోటిక్‌ అయిన పెరుగు తినడం ద్వారా మీ పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. ఇన్‌ఫ్లేమేషన్‌ను తగ్గించి రోగ నిరోధక వ్యవస్థ మెరుగయ్యేలా చేస్తుంది.(Pixabay)
సిట్రస్‌ పండ్లు : ఆరెంజ్‌ లేదా కమలా లేదా సంత్ర పండ్లు, నిమ్మ, ఉసిరి వంటి వాటిలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి గాయాలను కూడా త్వరగా మాన్పుతాయి. యాంటిఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉండటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ కూడా మెరుగవుతుంది.
(6 / 9)
సిట్రస్‌ పండ్లు : ఆరెంజ్‌ లేదా కమలా లేదా సంత్ర పండ్లు, నిమ్మ, ఉసిరి వంటి వాటిలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి గాయాలను కూడా త్వరగా మాన్పుతాయి. యాంటిఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉండటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ కూడా మెరుగవుతుంది.(Shutterstock)
నీళ్లు ఎక్కువగా ఉండే ఆహారం: పుచ్చకాయ, కీర, ఆరెంజ్‌ వంటి నీళ్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. ముఖ్యంగా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కచ్చితంగా ఈ ఆహారం తీసుకోవాలి.
(7 / 9)
నీళ్లు ఎక్కువగా ఉండే ఆహారం: పుచ్చకాయ, కీర, ఆరెంజ్‌ వంటి నీళ్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. ముఖ్యంగా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కచ్చితంగా ఈ ఆహారం తీసుకోవాలి.(Shutterstock)
తృణధాన్యాలు: ఫైబర్‌, సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉండే తృణధాన్యాలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి తినడం ద్వారా మీ శరీరం పోషకాలను బాగా శోషించుకోగలదు.
(8 / 9)
తృణధాన్యాలు: ఫైబర్‌, సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉండే తృణధాన్యాలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి తినడం ద్వారా మీ శరీరం పోషకాలను బాగా శోషించుకోగలదు.(Pixabay)
వెల్లుల్లి: రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో వెల్లుల్లి కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో ప్రొబయోటిక్స్‌ పుష్కలంగా ఉంటాయి.
(9 / 9)
వెల్లుల్లి: రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో వెల్లుల్లి కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో ప్రొబయోటిక్స్‌ పుష్కలంగా ఉంటాయి.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి