తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Happiness Tips: 2022లో ఈ లైఫ్‌స్టైల్‌ ఛేంజెస్‌తో ఆనందం మీ సొంతం

Happiness tips: 2022లో ఈ లైఫ్‌స్టైల్‌ ఛేంజెస్‌తో ఆనందం మీ సొంతం

13 January 2022, 15:05 IST

కేలండర్‌లో ఏడాదులు మారుతూనే ఉంటాయి. అది కామనే. ఈ మార్పు రావాల్సిందల్లా మన జీవితంలోనే. ప్రతి ఏటా జనవరి ఫస్ట్‌ వస్తుందంటే.. హడావిడి చేసి, ఎంజాయ్‌ చేసి, ఏవో కొన్ని రెజల్యూషన్స్‌ తీసుకొని సైలెంట్‌గా ఉండటం కాదు. మన కెరీర్‌, ఆరోగ్యం పరంగా కూడా కేలండర్‌తోపాటు మనమూ కొన్ని మార్పులు చేసుకోవాలి. అప్పుడే జీవితం హ్యాపీగా ఉంటుంది. 

కేలండర్‌లో ఏడాదులు మారుతూనే ఉంటాయి. అది కామనే. ఈ మార్పు రావాల్సిందల్లా మన జీవితంలోనే. ప్రతి ఏటా జనవరి ఫస్ట్‌ వస్తుందంటే.. హడావిడి చేసి, ఎంజాయ్‌ చేసి, ఏవో కొన్ని రెజల్యూషన్స్‌ తీసుకొని సైలెంట్‌గా ఉండటం కాదు. మన కెరీర్‌, ఆరోగ్యం పరంగా కూడా కేలండర్‌తోపాటు మనమూ కొన్ని మార్పులు చేసుకోవాలి. అప్పుడే జీవితం హ్యాపీగా ఉంటుంది. 

ప్రతి ఏటా డిసెంబర్‌ 31 వస్తుందంటే చాలు.. అందరూ తమకు తాము ప్రతిజ్ఞలు చేసుకుంటూ ఉంటారు. కొత్త ఏడాదిలో మొత్తంగా మారిపోతానని, మందు, సిగరెట్‌ మానేస్తానని, కొత్త లైఫ్‌స్టైల్‌ మొదలుపెడతానని, మొబైల్‌ జోలికే వెళ్లనని.. ఇలా ఏవేవో తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్లకు జనవరి 1 ఉదయం మామూలుగానే ఉంటుంది. ఆ ఒక్క రోజే కాదు.. ఏడాదంతా కూడా అలాగే సాగిపోతుంది. మళ్లీ కొత్త ఏడాది వచ్చేస్తుంది. అలా కాకుండా జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటానని ఎవరికి వారు అనుకోవడం ఉత్తమమని హెల్త్‌ కోచ్‌ సిమ్రన్‌ చోప్రా చెబుతున్నారు. ఒకేసారి జీవితం మొత్తం మారాలంటే సాధ్యం కాదు. ఈ ఏడాది అంతా ఇష్టమైన పనులు చేస్తానని, పౌష్టికాహారం తీసుకుంటానని, ఫోన్‌ వాడకాన్ని తక్కువ చేస్తానని.. ఇలాంటి చిన్న చిన్న రెజల్యూషన్స్‌ తీసుకుంటే మార్పు సాధ్యమని ఆమె అంటున్నారు. అంతేకాదు 2022లో చేయాల్సిన 8 లైఫ్‌స్టైల్‌ మార్పులను కూడా సూచించారు.
(1 / 9)
ప్రతి ఏటా డిసెంబర్‌ 31 వస్తుందంటే చాలు.. అందరూ తమకు తాము ప్రతిజ్ఞలు చేసుకుంటూ ఉంటారు. కొత్త ఏడాదిలో మొత్తంగా మారిపోతానని, మందు, సిగరెట్‌ మానేస్తానని, కొత్త లైఫ్‌స్టైల్‌ మొదలుపెడతానని, మొబైల్‌ జోలికే వెళ్లనని.. ఇలా ఏవేవో తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్లకు జనవరి 1 ఉదయం మామూలుగానే ఉంటుంది. ఆ ఒక్క రోజే కాదు.. ఏడాదంతా కూడా అలాగే సాగిపోతుంది. మళ్లీ కొత్త ఏడాది వచ్చేస్తుంది. అలా కాకుండా జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటానని ఎవరికి వారు అనుకోవడం ఉత్తమమని హెల్త్‌ కోచ్‌ సిమ్రన్‌ చోప్రా చెబుతున్నారు. ఒకేసారి జీవితం మొత్తం మారాలంటే సాధ్యం కాదు. ఈ ఏడాది అంతా ఇష్టమైన పనులు చేస్తానని, పౌష్టికాహారం తీసుకుంటానని, ఫోన్‌ వాడకాన్ని తక్కువ చేస్తానని.. ఇలాంటి చిన్న చిన్న రెజల్యూషన్స్‌ తీసుకుంటే మార్పు సాధ్యమని ఆమె అంటున్నారు. అంతేకాదు 2022లో చేయాల్సిన 8 లైఫ్‌స్టైల్‌ మార్పులను కూడా సూచించారు.(Photo by Lidya Nada on Unsplash)
1. ప్రతి రోజూ మీ ఆహారంలో కచ్చితంగా కూరగాయలు ఉండేలా చూసుకోండి. ఈ వెజిటబుల్స్‌లో పుష్కలంగా పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మీరు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. తక్కువ కేలరీల ఫుడ్‌ కావడంతో బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. ప్రతి రోజూ రెండు కప్పుల కూరగాయలు తినాలని సిమ్రన్‌ చెబుతున్నారు. కొంతమందికి ఇది చాలా కష్టంగా అనిపిస్తుండగా.. మరికొందరికి అసలు వాటిని రుచికరంగా ఎలా చేసుకొని తినాలో తెలియక తికమక పడుతుంటారు.
(2 / 9)
1. ప్రతి రోజూ మీ ఆహారంలో కచ్చితంగా కూరగాయలు ఉండేలా చూసుకోండి. ఈ వెజిటబుల్స్‌లో పుష్కలంగా పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మీరు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. తక్కువ కేలరీల ఫుడ్‌ కావడంతో బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. ప్రతి రోజూ రెండు కప్పుల కూరగాయలు తినాలని సిమ్రన్‌ చెబుతున్నారు. కొంతమందికి ఇది చాలా కష్టంగా అనిపిస్తుండగా.. మరికొందరికి అసలు వాటిని రుచికరంగా ఎలా చేసుకొని తినాలో తెలియక తికమక పడుతుంటారు.(File Photo / Reuters)
2. ఇక ఈ ఏడాదిలో ప్రతి రోజూ 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలని గట్టిగా నిర్ణయించుకోండి. డీహైడ్రేషన్‌ అనేది మీ మానిసక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోండి. తగినన్ని నీళ్లు తాగకపోతే మీ మెదడు సరిగా పనిచేయదు. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలంటే తగినన్ని నీళ్లు తాగడం తప్పనిసరి. రోజూ నిద్రలేవగానే మొదట చేయాల్సిన పని ఓ గ్లాసు నీళ్లు తాగడమే. ఇక రోజంతా అవసరమైతే ప్రతి గంటకో, అరగంటకో రిమైండర్లు పెట్టుకొని మరీ నీళ్లు తాగడం మరచిపోకండి.
(3 / 9)
2. ఇక ఈ ఏడాదిలో ప్రతి రోజూ 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలని గట్టిగా నిర్ణయించుకోండి. డీహైడ్రేషన్‌ అనేది మీ మానిసక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోండి. తగినన్ని నీళ్లు తాగకపోతే మీ మెదడు సరిగా పనిచేయదు. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలంటే తగినన్ని నీళ్లు తాగడం తప్పనిసరి. రోజూ నిద్రలేవగానే మొదట చేయాల్సిన పని ఓ గ్లాసు నీళ్లు తాగడమే. ఇక రోజంతా అవసరమైతే ప్రతి గంటకో, అరగంటకో రిమైండర్లు పెట్టుకొని మరీ నీళ్లు తాగడం మరచిపోకండి.(Shutterstock)
3. మంచి భోజనం, తగినన్ని నీళ్లతోపాటు జీవక్రియ సరిగ్గా సాగాలంటే మంచి నిద్ర కూడా అవసరం. ఈ ఏడాది మీరు మీ నిద్రపై నియంత్రణ సాధించేలా చూసుకోండి. మంచి నిద్ర అలవాట్లు చేసుకోండి. నిద్ర సరిగా లేకపోతే మీ ఆకలి, మీ మూడ్‌, మీ హార్మోన్ల స్థాయి దెబ్బతింటుంది. అంతేకాదు మంచి నిద్ర లేకపోతే తరచూ అసహనానికి గురవుతుంటారు. అందువల్ల అనవసర ఆలోచనలన్నీ పక్కన పెట్టి రోజూ హాయిగా నిద్రపోయేలా ప్లాన్‌ చేసుకోండి.
(4 / 9)
3. మంచి భోజనం, తగినన్ని నీళ్లతోపాటు జీవక్రియ సరిగ్గా సాగాలంటే మంచి నిద్ర కూడా అవసరం. ఈ ఏడాది మీరు మీ నిద్రపై నియంత్రణ సాధించేలా చూసుకోండి. మంచి నిద్ర అలవాట్లు చేసుకోండి. నిద్ర సరిగా లేకపోతే మీ ఆకలి, మీ మూడ్‌, మీ హార్మోన్ల స్థాయి దెబ్బతింటుంది. అంతేకాదు మంచి నిద్ర లేకపోతే తరచూ అసహనానికి గురవుతుంటారు. అందువల్ల అనవసర ఆలోచనలన్నీ పక్కన పెట్టి రోజూ హాయిగా నిద్రపోయేలా ప్లాన్‌ చేసుకోండి.(Photo by Mert Kahveci on Unsplash)
4. మరీ ఎక్కువగా అవసరం లేదు కానీ.. రోజూ కనీసం 30 నిమిషాల పాటు ఎక్సర్‌సైజులు చేయండి. అది కూడా మీకు ఇష్టమైనవే. ఎలాగోలా శరీరాన్ని అటూ ఇటూ కదిపితే రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు. కనీసం 30 నిమిషాల కసరత్తులు మీ ఆరోగ్యంపై ఎంతో మెరుగైన ప్రభావం చూపుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ఎక్సర్‌సైజులనే కాదు డ్యాన్స్‌ చేయండి, యోగా చేయండి, అలా బయటికెళ్లి నడవండి, ఈత కొట్టండి.. మీ ఇష్టం. కానీ ఉదయాన్నే శరీరానికి కాస్త పని చెబితే.. రోజంతా హాయిగా, ఆరోగ్యంగా ఉండొచ్చు.
(5 / 9)
4. మరీ ఎక్కువగా అవసరం లేదు కానీ.. రోజూ కనీసం 30 నిమిషాల పాటు ఎక్సర్‌సైజులు చేయండి. అది కూడా మీకు ఇష్టమైనవే. ఎలాగోలా శరీరాన్ని అటూ ఇటూ కదిపితే రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు. కనీసం 30 నిమిషాల కసరత్తులు మీ ఆరోగ్యంపై ఎంతో మెరుగైన ప్రభావం చూపుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ఎక్సర్‌సైజులనే కాదు డ్యాన్స్‌ చేయండి, యోగా చేయండి, అలా బయటికెళ్లి నడవండి, ఈత కొట్టండి.. మీ ఇష్టం. కానీ ఉదయాన్నే శరీరానికి కాస్త పని చెబితే.. రోజంతా హాయిగా, ఆరోగ్యంగా ఉండొచ్చు.(Photo by Meghan Holmes on Unsplash)
5. ఈ ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి సహజం. అది అందరూ అనుభవిస్తున్నదే. అయితే ఈ ఒత్తిడి మిమ్మల్ని చిత్తు చేయకుండా ప్రతి రోజూ కాసేపు ఆ ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ధ్యానం దీనికి సరైన మందు. కేవలం 10 నిమిషాల పాటు సరైన పద్ధతిలో మెడిటేషన్‌ చేస్తే చాలు.. మీ మనసు అనవసర ఆలోచనల నుంచి తేరుకొని ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీస్‌లో ఉన్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా.. ఎక్కడున్నా సులువుగా చేయగలిగేదే ఈ ధ్యానం. సింపుల్‌గా మీ ఒత్తిడిని చిత్తు చేసే ఈ ముఖ్యమైన పనిని మరచిపోకండి.
(6 / 9)
5. ఈ ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి సహజం. అది అందరూ అనుభవిస్తున్నదే. అయితే ఈ ఒత్తిడి మిమ్మల్ని చిత్తు చేయకుండా ప్రతి రోజూ కాసేపు ఆ ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ధ్యానం దీనికి సరైన మందు. కేవలం 10 నిమిషాల పాటు సరైన పద్ధతిలో మెడిటేషన్‌ చేస్తే చాలు.. మీ మనసు అనవసర ఆలోచనల నుంచి తేరుకొని ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీస్‌లో ఉన్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా.. ఎక్కడున్నా సులువుగా చేయగలిగేదే ఈ ధ్యానం. సింపుల్‌గా మీ ఒత్తిడిని చిత్తు చేసే ఈ ముఖ్యమైన పనిని మరచిపోకండి.(Photo by Shaurya Sagar on Unsplash)
6. అవసరమైతే పక్కవారి సహాయం అడగండి. సహాయం కోరడం బలహీనత కాదు. మీకున్న సమస్యలను అధిగమించడం, లక్ష్యాల వైపు అడుగులు వేయడం కోసం సాయం తీసుకోవడంలో తప్పులేదు. నిజానికి అవసరమై అడిగితే సాయం చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. మన మొహమాటం పక్కన పెడితే చాలు. మీరూ సాయం చేయండి. మీకు అవసరమైనప్పుడు సాయం కోరండి. అనుకున్న పనిని పూర్తి చేయండి.
(7 / 9)
6. అవసరమైతే పక్కవారి సహాయం అడగండి. సహాయం కోరడం బలహీనత కాదు. మీకున్న సమస్యలను అధిగమించడం, లక్ష్యాల వైపు అడుగులు వేయడం కోసం సాయం తీసుకోవడంలో తప్పులేదు. నిజానికి అవసరమై అడిగితే సాయం చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. మన మొహమాటం పక్కన పెడితే చాలు. మీరూ సాయం చేయండి. మీకు అవసరమైనప్పుడు సాయం కోరండి. అనుకున్న పనిని పూర్తి చేయండి.(Photo by Brett Jordan on Unsplash)
7. ప్రతి రోజూ లేదంటే వారంలో కనీసం ఒకసారైనా మీకు చాలా ఇష్టమైన పని చేయండి. ఎంత బిజీగా ఉన్నా సరే ఇష్టమైన పని చేయడం మరచిపోవద్దు. ఇష్టమైనది అంటే ఏదైనా కావచ్చు. ఫ్రెండ్స్‌తో మాట్లాడటం, సినిమాకు వెళ్లడం, ఒంటరిగా, ప్రశాంతంగా కూర్చోవడం.. ఇలా ఏదైనా సరే. మీ మనసుకు బాగా నచ్చిన పని చేస్తే.. అది మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
(8 / 9)
7. ప్రతి రోజూ లేదంటే వారంలో కనీసం ఒకసారైనా మీకు చాలా ఇష్టమైన పని చేయండి. ఎంత బిజీగా ఉన్నా సరే ఇష్టమైన పని చేయడం మరచిపోవద్దు. ఇష్టమైనది అంటే ఏదైనా కావచ్చు. ఫ్రెండ్స్‌తో మాట్లాడటం, సినిమాకు వెళ్లడం, ఒంటరిగా, ప్రశాంతంగా కూర్చోవడం.. ఇలా ఏదైనా సరే. మీ మనసుకు బాగా నచ్చిన పని చేస్తే.. అది మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.(Pixabay)
8. నిద్రపోవడానికి కనీసం 30 నిమిషాల ముందు నుంచీ ఫోన్లు, ల్యాప్‌టాప్‌, టీవీ, కంప్యూటర్లకు దూరంగా ఉండండి. ఈ మధ్యకాలంలో చాలా మంది పడుకునే సమయంలో కచ్చితంగా మొబైల్స్‌ చూస్తున్నారు. ఇది నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. నిద్ర పోయే ముందు మొబైల్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు చూడటం వల్ల అది రాత్రిపూట శరీరంలో సహజంగా విడుదలయ్యే మెలటోనిన్‌ అనే హార్మోన్‌పై ప్రభావం చూపుతోందని అధ్యయనంలో తేలింది. మీరు సరైన సమయానికి నిద్రపోవడం, లేవడం జరగాలంటే ఈ హార్మోన్‌దే కీలకపాత్ర. అందుకే మొబైల్స్‌, టీవీలు, ల్యాప్‌టాప్‌లు ఈ హార్మోన్‌ను దెబ్బతీయకుండా చూసుకోండి.
(9 / 9)
8. నిద్రపోవడానికి కనీసం 30 నిమిషాల ముందు నుంచీ ఫోన్లు, ల్యాప్‌టాప్‌, టీవీ, కంప్యూటర్లకు దూరంగా ఉండండి. ఈ మధ్యకాలంలో చాలా మంది పడుకునే సమయంలో కచ్చితంగా మొబైల్స్‌ చూస్తున్నారు. ఇది నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. నిద్ర పోయే ముందు మొబైల్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు చూడటం వల్ల అది రాత్రిపూట శరీరంలో సహజంగా విడుదలయ్యే మెలటోనిన్‌ అనే హార్మోన్‌పై ప్రభావం చూపుతోందని అధ్యయనంలో తేలింది. మీరు సరైన సమయానికి నిద్రపోవడం, లేవడం జరగాలంటే ఈ హార్మోన్‌దే కీలకపాత్ర. అందుకే మొబైల్స్‌, టీవీలు, ల్యాప్‌టాప్‌లు ఈ హార్మోన్‌ను దెబ్బతీయకుండా చూసుకోండి.(Photo by Victoria Heath on Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి