తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ego | మీ అహం మిమ్మల్ని నియంత్రిస్తోందా? ఈ 5 సంకేతాలతో తెలుసుకోండి!

Ego | మీ అహం మిమ్మల్ని నియంత్రిస్తోందా? ఈ 5 సంకేతాలతో తెలుసుకోండి!

06 March 2022, 8:08 IST

Ego.. అహం అనేది ఉండాలి. కానీ ఓ పరిమితి వరకే. ఈ అహమే మనల్ని కొన్నిసార్లు కొన్ని ముప్పుల నుంచి బయటపడేస్తుంది. అయితే ఈ ఇగో మనల్ని నియంత్రించడం ప్రారంభించిందంటే మాత్రం ప్రమాదమే. ఇది మన ప్రవర్తనను పూర్తిగా మార్చేస్తుంది. ఒక్కోసారి నవ్వులపాలు చేస్తుంది. ఇగో మనల్ని కంట్రోల్‌ చేస్తున్నప్పుడు మన ప్రవర్తనలో కలిగే మార్పుల గురించి సైకాలజిస్ట్‌ డాక్టర్‌ నికోల్‌ లెపెరా ఏమంటున్నారంటే..

  • Ego.. అహం అనేది ఉండాలి. కానీ ఓ పరిమితి వరకే. ఈ అహమే మనల్ని కొన్నిసార్లు కొన్ని ముప్పుల నుంచి బయటపడేస్తుంది. అయితే ఈ ఇగో మనల్ని నియంత్రించడం ప్రారంభించిందంటే మాత్రం ప్రమాదమే. ఇది మన ప్రవర్తనను పూర్తిగా మార్చేస్తుంది. ఒక్కోసారి నవ్వులపాలు చేస్తుంది. ఇగో మనల్ని కంట్రోల్‌ చేస్తున్నప్పుడు మన ప్రవర్తనలో కలిగే మార్పుల గురించి సైకాలజిస్ట్‌ డాక్టర్‌ నికోల్‌ లెపెరా ఏమంటున్నారంటే..
"ఏదో ఒక విషయంలో ఓ మనిషి ఇగో హర్ట్‌ అవుతుంది. ఇది ఆ మనిషిని రక్షణాత్మకంగా మార్చేస్తుంది. దీంతో ఆ వ్యక్తి ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. అరవడం, తాను చెప్పిందే సరైనదని వాదించడం, అర్థం లేని మాటలు మాట్లాడటం, అవతలి వ్యక్తులను శత్రువులుగా చూడటం వంటివి చేస్తారు. ఇది సదరు వ్యక్తిని నవ్వులపాలు చేసి తర్వాత బాధపడేలా చేస్తుంది" అని డాక్టర్‌ నికోల్‌ పెరెరా అంటున్నారు. ఇగో మనల్ని నియంత్రించడం ప్రారంభించినప్పుడు మన ప్రవర్తనలో కలిగే మార్పుల గురించి వివరించారు.
(1 / 8)
"ఏదో ఒక విషయంలో ఓ మనిషి ఇగో హర్ట్‌ అవుతుంది. ఇది ఆ మనిషిని రక్షణాత్మకంగా మార్చేస్తుంది. దీంతో ఆ వ్యక్తి ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. అరవడం, తాను చెప్పిందే సరైనదని వాదించడం, అర్థం లేని మాటలు మాట్లాడటం, అవతలి వ్యక్తులను శత్రువులుగా చూడటం వంటివి చేస్తారు. ఇది సదరు వ్యక్తిని నవ్వులపాలు చేసి తర్వాత బాధపడేలా చేస్తుంది" అని డాక్టర్‌ నికోల్‌ పెరెరా అంటున్నారు. ఇగో మనల్ని నియంత్రించడం ప్రారంభించినప్పుడు మన ప్రవర్తనలో కలిగే మార్పుల గురించి వివరించారు.(Shutterstock)
మీరు రక్షణాత్మకంగా మారుతారు. మీరు చేసింది లేదా చెప్పింది నిజమని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో అవతలి వ్యక్తి చెప్పేది అసలు వినరు.
(2 / 8)
మీరు రక్షణాత్మకంగా మారుతారు. మీరు చేసింది లేదా చెప్పింది నిజమని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో అవతలి వ్యక్తి చెప్పేది అసలు వినరు.(Pixabay)
మీ భావోద్వేగాలు తీవ్రమవుతాయి. ఏడవాలని, గట్టిగా అరవాలని అనిపిస్తుంది. తీవ్ర ఒత్తిడికి గురవుతారు.
(3 / 8)
మీ భావోద్వేగాలు తీవ్రమవుతాయి. ఏడవాలని, గట్టిగా అరవాలని అనిపిస్తుంది. తీవ్ర ఒత్తిడికి గురవుతారు.(Pixabay)
మీ నాఢీ వ్యవస్థ నియంత్రణ కోల్పోతుంది. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతారు.
(4 / 8)
మీ నాఢీ వ్యవస్థ నియంత్రణ కోల్పోతుంది. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతారు.(Pixabay)
ఆ వాదననే మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటారు. ఏదో ఒక విధంగా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు.
(5 / 8)
ఆ వాదననే మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటారు. ఏదో ఒక విధంగా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు.(Pixabay)
మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని చూస్తారు. అవతలి వ్యక్తి చెప్పేది అసలు వినరు. ఓపెన్‌ మైండ్‌తో ఆలోచించడం మానేస్తారు.
(6 / 8)
మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని చూస్తారు. అవతలి వ్యక్తి చెప్పేది అసలు వినరు. ఓపెన్‌ మైండ్‌తో ఆలోచించడం మానేస్తారు.(Pixabay)
ఇగోకు అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారించాలని డాక్టర్‌ లెపెరా సూచిస్తున్నారు. అహంకారంతో స్పందించడం కంటే కాస్త ఆగి, ఆలోచించి.. ఈ ఇగో నన్ను దెబ్బతీస్తుందన్న ఆలోచన చేసి తర్వాత రియాక్టయితే.. మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటారు అని ఆమె అంటున్నారు.
(7 / 8)
ఇగోకు అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారించాలని డాక్టర్‌ లెపెరా సూచిస్తున్నారు. అహంకారంతో స్పందించడం కంటే కాస్త ఆగి, ఆలోచించి.. ఈ ఇగో నన్ను దెబ్బతీస్తుందన్న ఆలోచన చేసి తర్వాత రియాక్టయితే.. మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటారు అని ఆమె అంటున్నారు.(Pixabay)
మన అహం మనతో ఎలాంటి పనులు చేయిస్తుందన్న విషయంపై స్పష్టత ఉంటే.. అవతలి వ్యక్తిని మనం అర్థం చేసుకోగలం. వాళ్లు కూడా తమ అహానికి లోబడి అలా ప్రవర్తించారు తప్ప వ్యక్తిగతంగా అలా ప్రవర్తించడం వారి ఉద్దేశం కాదు అన్న విషయం మనకు తెలుస్తుంది అని ఆమె చెప్పారు.
(8 / 8)
మన అహం మనతో ఎలాంటి పనులు చేయిస్తుందన్న విషయంపై స్పష్టత ఉంటే.. అవతలి వ్యక్తిని మనం అర్థం చేసుకోగలం. వాళ్లు కూడా తమ అహానికి లోబడి అలా ప్రవర్తించారు తప్ప వ్యక్తిగతంగా అలా ప్రవర్తించడం వారి ఉద్దేశం కాదు అన్న విషయం మనకు తెలుస్తుంది అని ఆమె చెప్పారు.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి