తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో ఛాన్స్ మిస్.. ఈ ఐదుగురికి నిరాశ

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో ఛాన్స్ మిస్.. ఈ ఐదుగురికి నిరాశ

30 April 2024, 18:51 IST

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ నేడు (ఏప్రిల్ 30) వెల్లడించింది. జూన్‍లో జరిగే ఈ మెగాటోర్నీ కోసం 15 మందితో కూడిన ప్రధాన జట్టును, నలుగురు రిజర్వ్ ప్లేయర్లను ప్రకటించింది. అయితే, ప్రధాన జట్టులో ఉంటారని భావించిన.. ఐదుగురు ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది.

  • T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ నేడు (ఏప్రిల్ 30) వెల్లడించింది. జూన్‍లో జరిగే ఈ మెగాటోర్నీ కోసం 15 మందితో కూడిన ప్రధాన జట్టును, నలుగురు రిజర్వ్ ప్లేయర్లను ప్రకటించింది. అయితే, ప్రధాన జట్టులో ఉంటారని భావించిన.. ఐదుగురు ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది.
కేఎల్ రాహుల్: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‍కు టీ20 ప్రపంచకప్‍ 2024 ఆడే భారత జట్టులో చోటు దక్కుతుందని జోరుగా చర్చ సాగింది. ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‍ల్లో 378 పరుగులు చేసి రాణించాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రాహుల్. అయితే, అతడిని ప్రపంచకప్‍కు తీసుకోలేదు సెలెక్టర్లు. దీంతో రాహుల్‍కు నిరాశే ఎదురైంది. 
(1 / 6)
కేఎల్ రాహుల్: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‍కు టీ20 ప్రపంచకప్‍ 2024 ఆడే భారత జట్టులో చోటు దక్కుతుందని జోరుగా చర్చ సాగింది. ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‍ల్లో 378 పరుగులు చేసి రాణించాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రాహుల్. అయితే, అతడిని ప్రపంచకప్‍కు తీసుకోలేదు సెలెక్టర్లు. దీంతో రాహుల్‍కు నిరాశే ఎదురైంది. (AFP)
రింకూ సింగ్: యంగ్ హిట్టర్ రింకూ సింగ్‍కు ఫినిషర్‌గా మంచి పేరు ఉంది. భారత్ తరపున ఇప్పటి వరకు 15 టీ20 మ్యాచ్‍లు ఆడిన రింకూ 176 స్ట్రైక్ రేట్‍తో 356 పరుగులు చేసి సత్తాచాటాడు. ఐపీఎల్‍లో కోల్‍కతా తరఫున గతేడాది ధనాధన్ ఆటతో అదరగొట్టాడు. ఈ సీజన్‍లో బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువగా రాలేదు. అయితే, టీ20 ప్రపంచకప్ భారత జట్టులో రింకూ తప్పక ఉంటాడని అందరూ అనుకున్నారు. అయితే, అతడికి 15 మందితో కూడిన ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్నాడు. 
(2 / 6)
రింకూ సింగ్: యంగ్ హిట్టర్ రింకూ సింగ్‍కు ఫినిషర్‌గా మంచి పేరు ఉంది. భారత్ తరపున ఇప్పటి వరకు 15 టీ20 మ్యాచ్‍లు ఆడిన రింకూ 176 స్ట్రైక్ రేట్‍తో 356 పరుగులు చేసి సత్తాచాటాడు. ఐపీఎల్‍లో కోల్‍కతా తరఫున గతేడాది ధనాధన్ ఆటతో అదరగొట్టాడు. ఈ సీజన్‍లో బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువగా రాలేదు. అయితే, టీ20 ప్రపంచకప్ భారత జట్టులో రింకూ తప్పక ఉంటాడని అందరూ అనుకున్నారు. అయితే, అతడికి 15 మందితో కూడిన ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్నాడు. (PTI)
శుభ్‍మన్ గిల్: భారత యంగ్ స్టార్ ఓపెనర్ శుభ్‍మన్ గిల్‍కు కూడా టీ20 ప్రపంచకప్‍ భారత జట్టులో చోటు దక్కలేదు. ఐపీఎల్ 2023 సీజన్‍లో 890 పరుగులతో అతడు ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అయితే, ప్రస్తుత 2024 సీజన్‍లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ తరుణంలో ప్రపంచకప్‍కు వెళ్లే ప్రధాన జట్టులో గిల్‍కు చోటు దక్కలేదు. రిజర్వ్‌లో ఉన్నాడు. ఇది కూడా కాస్త ఆశ్చర్యపరిచింది. 
(3 / 6)
శుభ్‍మన్ గిల్: భారత యంగ్ స్టార్ ఓపెనర్ శుభ్‍మన్ గిల్‍కు కూడా టీ20 ప్రపంచకప్‍ భారత జట్టులో చోటు దక్కలేదు. ఐపీఎల్ 2023 సీజన్‍లో 890 పరుగులతో అతడు ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అయితే, ప్రస్తుత 2024 సీజన్‍లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ తరుణంలో ప్రపంచకప్‍కు వెళ్లే ప్రధాన జట్టులో గిల్‍కు చోటు దక్కలేదు. రిజర్వ్‌లో ఉన్నాడు. ఇది కూడా కాస్త ఆశ్చర్యపరిచింది. (PTI)
రవి బిష్ణోయ్: లక్నో సూపర్ జెయింట్స్ యంగ్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‍కు టీ20 ప్రపంచకప్‍లో చోటు దక్కుతుందనే అంచనాలు వినిపించాయి. అయితే, 2024 ఐపీఎల్ సీజన్‍లో అద్భుత ప్రదర్శన చేస్తున్న సీనియర్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‍ను తీసుకున్న సెలెక్టర్లు.. మెగాటోర్నీకి బిష్ణోయ్‍ను పక్కనపెట్టారు. 
(4 / 6)
రవి బిష్ణోయ్: లక్నో సూపర్ జెయింట్స్ యంగ్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‍కు టీ20 ప్రపంచకప్‍లో చోటు దక్కుతుందనే అంచనాలు వినిపించాయి. అయితే, 2024 ఐపీఎల్ సీజన్‍లో అద్భుత ప్రదర్శన చేస్తున్న సీనియర్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‍ను తీసుకున్న సెలెక్టర్లు.. మెగాటోర్నీకి బిష్ణోయ్‍ను పక్కనపెట్టారు. (ANI)
రియాన్ పరాగ్: టీ20 ప్రపంచకప్‍ టీమిండియాలో రియాన్ పరాగ్ కూడా చోటు దక్కించుకుంటాడని అంచనాలు బాగానే వినిపించాయి. ఈ ఏడాది ఐపీఎల్‍లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‍ల్లో 159 స్ట్రైక్ రేట్‍తో 332 పరుగులు చేశాడు పరాగ్. అలాగే, అంతకు ముందు దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తార్ అలీ ట్రోఫీలోనూ దుమ్మురేపాడు. అయితే, టీ20 ప్రపంచకప్‍కు అతడిని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. 
(5 / 6)
రియాన్ పరాగ్: టీ20 ప్రపంచకప్‍ టీమిండియాలో రియాన్ పరాగ్ కూడా చోటు దక్కించుకుంటాడని అంచనాలు బాగానే వినిపించాయి. ఈ ఏడాది ఐపీఎల్‍లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‍ల్లో 159 స్ట్రైక్ రేట్‍తో 332 పరుగులు చేశాడు పరాగ్. అలాగే, అంతకు ముందు దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తార్ అలీ ట్రోఫీలోనూ దుమ్మురేపాడు. అయితే, టీ20 ప్రపంచకప్‍కు అతడిని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. (AFP)
టీ20 ప్రపంచకప్‍ 2024 టోర్నీ జూన్ 1వ తేదీన నుంచి 29వ తేదీ వరకు వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరగనుంది. టీ20 ప్రపంచకప్‍ టోర్నీకి ఎంపికైన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్     రిజర్వ్ ప్లేయర్లు: శుభ్‍మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్
(6 / 6)
టీ20 ప్రపంచకప్‍ 2024 టోర్నీ జూన్ 1వ తేదీన నుంచి 29వ తేదీ వరకు వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరగనుంది. టీ20 ప్రపంచకప్‍ టోర్నీకి ఎంపికైన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్     రిజర్వ్ ప్లేయర్లు: శుభ్‍మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి