తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kajal Aggarwal: జైపూర్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో భ‌గ‌వంత్ కేస‌రి హ‌వా - కాజ‌ల్‌కు అవార్డు రావడంపై నెటిజ‌న్ల ట్రోలింగ్‌

Kajal Aggarwal: జైపూర్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో భ‌గ‌వంత్ కేస‌రి హ‌వా - కాజ‌ల్‌కు అవార్డు రావడంపై నెటిజ‌న్ల ట్రోలింగ్‌

27 January 2024, 16:06 IST

Kajal Aggarwal: బాల‌కృష్ణ భ‌గ‌వంత్ కేస‌రి సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. గ‌త ఏడాది ద‌స‌రా కానుక‌గా రిలీజైన ఈ మూవీ 109 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి రికార్డ్ నెల‌కొల్పింది.

జైపూర్ ఇంట‌ర్‌నేష‌న‌ల్‌ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో భ‌గ‌వంత్ కేస‌రి మూవీ రెండు అవార్డుల‌ను గెలుచుకున్న‌ది. ఈ సినిమాకుగాను కాజ‌ల్‌, అర్జున్ రాంపాల్ అవార్డుల‌ను సొంతం చేసుకున్న‌ట్లు జైపూర్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ప్ర‌క‌టించింది. 
(1 / 6)

భ‌గ‌వంత్ కేస‌రి సినిమాకు కాజ‌ల్‌కు అవార్డు ప్ర‌క‌టించిన‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి. కాజ‌ల్‌కు అవార్డు రావ‌డంపై ప‌లువురు నెటిజ‌న్లు ట్రోల్ చేస్తోన్నారు. 
(2 / 6)

భ‌గ‌వంత్ కేస‌రిలో కాజ‌ల్ క్యారెక్ట‌ర్‌కు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండ‌దు. కాత్యాయిని అనే సైక‌లాజిస్ట్‌గా కాజ‌ల్ న‌టించింది.  కేవ‌లం కొన్ని సీన్స్‌లో మాత్ర‌మే కాజ‌ల్ క‌నిపిస్తుంది. ఈ పాత్ర‌కు అవార్డు ప్ర‌క‌టించ‌డం ఏంట‌ని నెటిజ‌న్లు అంటున్నారు. ఏ ప్ర‌తిపాదిక‌న అవార్డు ఇచ్చారంటూ ఫ‌న్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 
(3 / 6)

కాజ‌ల్ పాత్ర‌కు ఇంపార్టెన్స్ లేద‌ని తెలిసినా కూడా ఆమె ఈ సినిమాను అంగీక‌రించిందంటూ స్వ‌యంగా భ‌గ‌వంత్ కేస‌రి ప్ర‌మోష‌న్స్‌లో అనిల్ రావిపూడి కామెంట్స్ చేయ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
(4 / 6)

భ‌గ‌వంత్ కేస‌రి త‌ర్వాత తెలుగులో స‌త్య‌భామ సినిమా చేస్తోంది కాజ‌ల్‌. లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కాజ‌ల్ క‌నిపిస్తోంది. 
(5 / 6)

ప్ర‌స్తుతం కాజ‌ల్ స్విట్ల‌ర్లాండ్ టూర్‌లో ఉంది. భ‌ర్త గౌత‌మ్ కిచ్లూతో పాటు నీల్‌తో క‌లిసి టూర్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కాజ‌ల్ షేర్ చేసింది.  
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి