తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ipl 2024 Points Table: ఓడినా టాప్‍లోనే రాజస్థాన్ రాయల్స్.. ఓ ప్లేస్ పైకి వచ్చిన గుజరాత్

IPL 2024 Points Table: ఓడినా టాప్‍లోనే రాజస్థాన్ రాయల్స్.. ఓ ప్లేస్ పైకి వచ్చిన గుజరాత్

11 April 2024, 7:31 IST

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. బుధవారం (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్‍లో రాజస్థాన్‍ను గుజరాత్ టైటాన్స్ ఓడించింది. ఈ సీజన్‍లో 24 లీగ్ మ్యాచ్‍ల తర్వాత ప్రస్తుతం పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఇక్కడ చూడండి.

  • IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. బుధవారం (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్‍లో రాజస్థాన్‍ను గుజరాత్ టైటాన్స్ ఓడించింది. ఈ సీజన్‍లో 24 లీగ్ మ్యాచ్‍ల తర్వాత ప్రస్తుతం పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఇక్కడ చూడండి.
ఐపీఎల్ 2024 టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ (RR)పై గుజరాత్ టైటాన్స్ (GT) ఉత్కంఠ విజయం సాధించింది. జైపూర్‌లో బుధవారం (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్‍లో 3 వికెట్ల తేడాతో చివరి బంతికి గుజరాత్ గెలిచింది. దీంతో నాలుగు గెలుపుల తర్వాత రాజస్థాన్‍కు ఓటమి ఎదురైంది. ఈ సీజన్‍లో గుజరాత్ మూడో విజయం సాధించింది. ఇప్పటి ఆరు మ్యాచ్‍ల్లో మూడు గెలిచిన గుజరాత్ 6 పాయింట్లతో (-0.63 నెట్‍ రన్‍రేట్) పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మరో నాలుగు టీమ్‍లు కూడా ప్రస్తుతం ఆరు పాయింట్లతోనే ఉండగా.. నెట్‍రన్ రేట్ తక్కువగా ఉండడం వల్ల గుజరాత్ ఆరో ప్లేస్‍లో ఉంది. ఈ మ్యాచ్ ముందు ఏడో స్థానంలో ఉన్న గుజరాత్.. గెలుపుతో ఓ ప్లేస్ పైకి వచ్చింది. 
(1 / 9)

గుజరాత్ చేతిలో ఓడినా రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‍లో ఉంది. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‍ల్లో నాలుగు గెలిచిన సంజూ శాంసన్ సేన 8 పాయింట్లతో టాప్‍లో ఉంది. +0.87తో మంచి నెట్‍రన్ రేట్ కలిగి ఉంది. 
(2 / 9)

ఈ సీజన్‍లో ఇప్పటి వరకు తొలి నాలుగు మ్యాచ్‍ల్లో కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టు మూడింట గెలిచింది. ప్రస్తుతం ఆరు పాయింట్లతో (+1.52) ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో కోల్‍కతా రెండో స్థానంలో ఉంది.
(3 / 9)

ఈ సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ తన తొలి 4 మ్యాచ్‍ల్లో 3 గెలిచింది. ఆరు పాయింట్లతో (+0.77) ప్రస్తుతం టేబుల్‍లో మూడో స్థానంలో కొనసాగింది. కేకేఆర్ కంటే ప్రస్తుతం నెట్ రన్‍రేట్‍లో తక్కువగా ఉంది. 
(4 / 9)

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‍లో ఇప్పటి వరకు తాను ఆడిన తొలి 5 మ్యాచ్‍ల్లో మూడింట్లో గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం ఆరు పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం +0.66 నెట్‍రన్ రేట్ ఉన్న సీఎస్‍కే పాయింట్ల పట్టికల నాలుగో స్థానంలో నిలిచింది.
(5 / 9)

సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 మ్యాచ్‍ల్లో మూడు గెలిచి ప్రస్తుతం ఆరు పాయింట్ల (+0.344)తో ఉంది. పాయింట్స్ టేబుల్‍లో ఐదో ప్లేస్‍లో ఉంది. గుజరాత్ 6 పాయింట్లతో ఆరో ప్లేస్‍లో నిలిచింది.
(6 / 9)

ఈ సీజన్‍లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‍ల్లో 2 గెలిచి 4 పాయింట్లతో (-0.19) ఉంది పంజాబ్ కింగ్స్. ప్రస్తుతం ఆ టీమ్ పట్టికలో ఏడో స్థానంలో ఉంది. రాజస్థాన్‍పై గుజరాత్ గెలిచాక.. పంజాబ్ ఓ స్థానం పడిపోయింది. 
(7 / 9)

ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ 2 పాయింట్లనే సాధించాయి. నాలుగు మ్యాచ్‍ల్లో ఒకటి గెలిచిన ముంబై ఇండియన్స్ (-0.70) పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంటే..  ఐదు మ్యాచ్‍ల్లో ఒకదాంట్లోనే విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (-0.84) తొమ్మిదో స్థానంలో ఉంది. 5 మ్యాచ్‍ల్లో ఒకదాంట్లోనే గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం (-1.37) ఆఖరిదైన పదో స్థానంలో ఉంది.  
(8 / 9)
ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ 2 పాయింట్లనే సాధించాయి. నాలుగు మ్యాచ్‍ల్లో ఒకటి గెలిచిన ముంబై ఇండియన్స్ (-0.70) పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంటే..  ఐదు మ్యాచ్‍ల్లో ఒకదాంట్లోనే విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (-0.84) తొమ్మిదో స్థానంలో ఉంది. 5 మ్యాచ్‍ల్లో ఒకదాంట్లోనే గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం (-1.37) ఆఖరిదైన పదో స్థానంలో ఉంది.  (PTI)
నేడు (ఏప్రిల్ 11) ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
(9 / 9)
నేడు (ఏప్రిల్ 11) ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.(AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి