తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ipl 2024: కోత్‍కతా నైట్ రైడర్స్ జట్టులోకి శ్రీలంక పేసర్.. అతడి స్థానంలో..

IPL 2024: కోత్‍కతా నైట్ రైడర్స్ జట్టులోకి శ్రీలంక పేసర్.. అతడి స్థానంలో..

19 February 2024, 18:26 IST

IPL 2024 Updates - Kolkata Knight Riders: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ త్వరలో ప్రారంభం కానుండగా.. కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టులో ఓ మార్పు జరిగింది. గస్ అట్కిన్‍సన్ స్థానంలో శ్రీలంక పేసర్‌ను ఆ టీమ్ తీసుకుంది. ఆ వివరాలివే.

  • IPL 2024 Updates - Kolkata Knight Riders: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ త్వరలో ప్రారంభం కానుండగా.. కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టులో ఓ మార్పు జరిగింది. గస్ అట్కిన్‍సన్ స్థానంలో శ్రీలంక పేసర్‌ను ఆ టీమ్ తీసుకుంది. ఆ వివరాలివే.
ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్ కోసం శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీరను జట్టులోకి తీసుకుంది కోల్‍కతా నైట్ రైజర్స్ (KKR) జట్టు. ఈ విషయంపై నేడు (ఫిబ్రవరి 19) అధికారిక ప్రకటన చేసింది. 
(1 / 5)
ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్ కోసం శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీరను జట్టులోకి తీసుకుంది కోల్‍కతా నైట్ రైజర్స్ (KKR) జట్టు. ఈ విషయంపై నేడు (ఫిబ్రవరి 19) అధికారిక ప్రకటన చేసింది. (AFP)
ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్‍సన్‍ తప్పుకోవడంతో ఆ స్థానంలో చమీరను కోల్‍కతా ఎంపిక చేసుకుంది. ఐపీఎల్ 2024 కోసం నిర్వహించిన వేలంలో చమీర అమ్ముడుపోలేదు. అయితే, ఇప్పుడు రూ.50లక్షల బేస్ ప్రైజ్‍కు అతడిని కేకేఆర్ తీసుకుంది. 
(2 / 5)
ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్‍సన్‍ తప్పుకోవడంతో ఆ స్థానంలో చమీరను కోల్‍కతా ఎంపిక చేసుకుంది. ఐపీఎల్ 2024 కోసం నిర్వహించిన వేలంలో చమీర అమ్ముడుపోలేదు. అయితే, ఇప్పుడు రూ.50లక్షల బేస్ ప్రైజ్‍కు అతడిని కేకేఆర్ తీసుకుంది. (AP)
గస్ అట్కిన్‍సన్‍ను గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో రూ.కోటి పెట్టి కొనుగోలు చేసింది కోల్‍కతా నైట్ రైడర్స్. అయితే, ఇంగ్లండ్ తరఫున బిజీ షెడ్యూల్ ఉండటంతో ఈ ఏడాది ఐపీఎల్‍ నుంచి అట్కిన్‍సన్ తప్పుకున్నాడు. 
(3 / 5)
గస్ అట్కిన్‍సన్‍ను గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో రూ.కోటి పెట్టి కొనుగోలు చేసింది కోల్‍కతా నైట్ రైడర్స్. అయితే, ఇంగ్లండ్ తరఫున బిజీ షెడ్యూల్ ఉండటంతో ఈ ఏడాది ఐపీఎల్‍ నుంచి అట్కిన్‍సన్ తప్పుకున్నాడు. (AFP)
దుష్మంత చమీర ఐపీఎల్‍లో గతంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లలో ఉన్నాడు. మొత్తంగా 12 ఐపీఎల్ మ్యాచ్‍ల్లో 9 వికెట్లు తీశాడు. ఇప్పుడు 2024 సీజన్ కోసం చమీరను కోల్‍కతా నైట్ రైడర్స్ తీసుకుంది. 
(4 / 5)
దుష్మంత చమీర ఐపీఎల్‍లో గతంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లలో ఉన్నాడు. మొత్తంగా 12 ఐపీఎల్ మ్యాచ్‍ల్లో 9 వికెట్లు తీశాడు. ఇప్పుడు 2024 సీజన్ కోసం చమీరను కోల్‍కతా నైట్ రైడర్స్ తీసుకుంది. 
ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి మే నెలాఖరు వరకు జరుగుతుందని తెలుస్తోంది. ఐపీఎల్ తేదీలను త్వరలోనే బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. 
(5 / 5)
ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి మే నెలాఖరు వరకు జరుగుతుందని తెలుస్తోంది. ఐపీఎల్ తేదీలను త్వరలోనే బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. 

    ఆర్టికల్ షేర్ చేయండి